క్రైమ్/లీగల్

ఆటో- బస్సు ఢీ: ఒకరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దత్తిరాజేరు, మే 18: మండలంలోని మరడాం-కోమటపల్లి గ్రామాల మధ్య తాడేంద్రవలస రహదారి జంక్షన్ సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటోను బస్సు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి గాయాలు అయ్యాయి. ఎస్.బూర్జివలస పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం అర్థరాత్రి విశాఖపట్నం నుంచి ఉమ్మరకోట వెళుతున్న ఓల్వా బస్సు మరడాం నుంచి కోమటిపల్లి వస్తున్న ఆటోను ఢీకొనడంతో ఆటోలో ప్రయాణం చేస్తున్న షేక్ అబ్దుల్లాకు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు 108 వాహనంలో విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు. ఎర్రా లక్ష్మణకు తలకు గాయాలు కాగా, వసాది రామారావుకు కొద్దిపాటి గాయాలయ్యాయి. ఎర్రా లక్ష్మణ విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వసాది రామారావు గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతునికి తల్లితండ్రులు ఎవరు లేకపోగా మరడాంలో తన పెద్దమ్మ ఇంటివద్ద ఉంటున్నాడు. ఎస్.బూర్జివలస ఎస్సై రమేష్‌నాయుడు అబ్దుల్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.