విజయనగరం

బపనుకువలస, గజపతినగరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (గంట్యాడ), మే 18: జిల్లాలో పాచిపెంట మండలంలో పనుకువలసలోను గజపతినగరంలో కొత్తగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని జిల్లా సంయుక్త కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి తెలిపారు. జిల్లా రబీ 2018 సీజనులో 22వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు అంచనాలు వేశారని, ఆ మేరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారన్నారు.
ఐదువారాల్లో మక్కువ మండలంలో మక్కువ, వెంకటభైరిపురం, ఎ వెంకంపేట గ్రామాలతో పాటు మెండాడ, బలిజపేట, కొమరాడ మండల కేంద్రాల్లోని జియ్యంవలస మండలంలో చినమేరంగి, కడుమ, గరుగుబిల్లి మండలంలో నాగూరు, కొత్తూరు, బొ బ్బిలి మండలంలో బొబ్బిలి, పక్కి, గుర్ల మండలంలో తెట్టంగి, సీతానగరం మండలంలో దాశాపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో మొత్తం 76 ధాన్యం కొనుగోలు కేంద్రాలద్వారా రైతులు వద్దనుంచి కనీసం మద్దతు ధరలకు ధాన్యం కొనుగొలు చేస్తున్నట్టు తెలిపారు. సాధారణ రకం క్వింటాకు రూ.1550, గ్రేడ్-ఎ రకం కింటాకు రూ.1590 చెల్లిస్తున్నామని తెలిపారు.

మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం భరోసా
చీపురుపల్లి, మే 18: మొక్కజొన్న రైతులను ఆదుకొనేందుకు ప్రభుత్వం మొక్కజొన్న ధర స్ధిరీకరణ పథకాన్ని అమలు చేస్తుందని వ్యవసాయశాఖ సహాయ సం చాలకుడు ఎన్ వీ వేణుగోపాల్ తెలిపారు. ఆయన విలేఖరులతో శుక్రవారం మా ట్లాడారు. ఈ ఏడాది మొక్కజొన్న పండిస్తున్న రైతులను ప్రభుత్వం ధరస్ధిరీకరణ పథకం ద్వారా లబ్ది చేకూర్చనుందని వెల్లడించారు. ఈ పథకంద్వారా మొక్కజొన్న పండించే రైతుకి క్వింటాకు రూ.200 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. పథ కం లబ్ది పొందేందుకు మొక్కజొన్న రైతులు పండించే భూమి విస్తీర్ణం గ్రామ రెవిన్యూ అధికారితో ధృవీకరించిన పత్రంతో వ్యవసాయశాఖ విస్తరణాధికారి, ఏఇవో, ఎంపిఇవోను సంప్రదించి బ్యాంకు పాస్‌పుస్తకం, ఆధార్‌కార్డు, భూమి పట్టా నకల్లను జూన్ 6వతేదీలోగా సంప్రదించి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని కోరా రు. చీపురుపల్లి, గరివిడి, గుర్ల, మెరకముడిదాం, నెల్లిమర్ల మండలాల మొక్కజొన్న రైతులు అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని కోరారు.

‘ఇంటి పన్నులు వసూలు వేగవంతం చేయాలి’
గజపతినగరం,మే18: గ్రామాలలో ఇంటిపన్నులు వసూళ్ల్లను వేగవంతం చేయాలని ఎంపిడివో జి.జనార్దనరావు అన్నారు. స్దానిక ఎంపిడివో కార్యాలయంలో శుక్రవారం పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. 2018-19 ఆర్దిక సంవత్సరానికి గ్రామాల వారీగా నిర్ణయించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. అలాగే సామాజిక పించన్లకు సంబందించి కదలలేని స్దితిలో ఉన్న పించనుదారులకు ఇంటింటికి వెళ్లి పించన్లు పంపిణీ చేయాలన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండి ఏమైనా సమస్యలు ఉంటే తక్షణమే మండల కేంద్రానికి సమాచారం ఇవ్వాలన్నారు. పారిశుద్ద్యపనులు చేపట్టి అంటురోగాలు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలన్నారు.