విజయనగరం

ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొబ్బిలి, మే 18: రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీకి చెప్పిన గుణపాఠం కంటే రానున్న ఎన్నికల్లో బీజేపీకి అంతకంటే ఎక్కువగా ప్రజలు బుద్ధిచెబుతారని రాష్ట్ర గనులశాఖామంత్రి సుజయ్‌కృష్ణరంగారావు అన్నారు. స్థానిక రాజ్ దర్భార్‌లో శుక్రవారం మినీ మహానాడు నిర్వహించారు. ముందుగా ఎన్‌టిఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గోదావరిలో లాంచీ మునిగి మృతి చెందిన వారి కుటుంబానికి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2014లో కాంగ్రెస్‌పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిందని, అందుకే ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్యాకేజీలు ఇస్తామని మాట ఇచ్చి మోసగించారని, ఈ విషయాన్ని ప్రజలు గుర్తించి 2019 ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష పార్టీ నాయకులు దొంగ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం విస్తృతస్థాయిలో పోరాటాలు, ధర్మదీక్షలు చేస్తుంటే వాటికి మద్దతు ఇవ్వాల్సిన వైకాపా, జనసేన పార్టీలు బీజేపీతో రహస్య ఒప్పందాలు పెట్టుకోవడం సిగ్గుచేటన్నారు. బీజేపీని ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రంపై బురదజల్లే ప్రయత్నం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నాలుగేళ్లక్రితం టీడీపీ పొత్తు పెట్టుకున్న విషయం విధితమే. అప్పటి నుంచి పలుసార్లు ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని నిలదీస్తున్నప్పటికీ నెట్టుకొచ్చి చివరకు మోసగించిందని ఆరోపించారు. ఆర్థిక లోటులో ఉన్నప్పటికీ సంక్షేమ, అభివృద్ధి పేరుతో ప్రభుత్వం ప్రజలందరికీ న్యాయం చేస్తుందన్నారు. నాల్గవ బడ్జెట్‌లో కేంద్రం కనీసం స్పందించకుండా విభజన చట్టాన్ని తుంగలోకి తొక్కిందన్నారు. ప్రజలంతా కేంద్ర ప్రభుత్వంపై పోరాటాలు చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి తలెత్తుకుని ఓట్లు అడిగే హక్కు టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు ఉందన్నారు. పార్టీలో విభేదాలను పక్కన పెట్టి రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబును గద్దెనెక్కించే బాధ్యతను నాయకులు, కార్యకర్తలు భజస్కందాలపై వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి తెంటు లక్ష్మునాయుడు, జెడ్పీ ఛైర్‌పర్సన్ స్వాతీరాణి, విజయనగరం ఎంపీ నియోజకవర్గ పరిశీలకుడు శ్రీనివాసరావు, కృష్ణ, రాష్ట్ర ఆర్థిక కమిషన్ సభ్యులు తూముల భాస్కరరావు, జిల్లా పరిశీలకులు బంగారునాయుడు, ఛైర్‌పర్సన్ అచ్యుతవల్లి, వైస్‌ఛైర్మన్ రమేష్‌నాయుడు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు రాంబార్కి శరత్‌తోపాటు బొబ్బిలి, తెర్లాం, బాడంగి, రామభద్రపురం ప్రజాప్రతినిదులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నియోజకవర్గ తీర్మానాలు: జిల్లాస్థాయిలో నిర్వహించనున్న మినీ మహానాడులో చర్చించేందుకు బొబ్బిలి నియోజకవర్గ సమస్యలపై తీర్మానించారు. ఈ తీర్మానాలను మంత్రి సుజయ్‌కృష్ణ సమక్షంలో జిల్లా అధిష్టానవర్గానికి పంపించేందుకు ఏకగ్రీవంగా ఆమోదించారు. టీడీపీ నియోజకవర్గం ఇన్‌ఛార్జి తెంటు లక్ష్మునాయుడు ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేయాలని, ఇచ్చేంతవరకు నాయకులు, కార్యకర్తలు అప్రమత్తం కావాలని ప్రతిపాదనను తీర్మానంగా ఆమోదించారు. అలాగే రాష్ట్ర ఆర్థిక కమిషన్ సభ్యుడు తూముల భాస్కరరావు మాట్లాడుతూ విశాఖరైల్వేజోన్ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలన్నారు. ఛైర్‌పర్సన్ అచ్యుతవల్లి మాట్లాడుతూ సువర్ణముఖి నది నుంచి నీటిప్రాజెక్టును బొబ్బిలి పురపాలక సంఘానికి మంజూరు చేయాలని తీర్మానించారు. రైతుల సంక్షేమం కోసం కృషి చేయాలని అల్లాడ భాస్కరరావు తీర్మానించారు. ధర్మపోరాటం కోసం నేతలంతా నడుంబిగించాలని సీనియర్ కౌన్సిల్ సభ్యులు తీర్మానించారు. అలాగే బొబ్బిలిలో మూసివేసిన జ్యూట్‌మిల్లును తెరిపించి కార్మికులకు న్యాయం చేయాలని వైస్ ఛైర్మన్ చోడిగంజి రమేష్‌నాయుడు తీర్మానం చేశారు.

ప్రజా సంక్షేమానికి తొలి ప్రాధాన్యత
విజయనగరం(చీపురుపల్లి), మే 18: పేదల సంక్షేమానికే ప్రభుత్వం తొలి ప్రా ధాన్యతను ఇస్తుందని జిల్లా కలెక్టర్ డా క్టర్ హరి జవహర్‌లాల్ అన్నారు. పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అం దించడానికి అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని ఆదేశించారు. అభివృద్ధి, సంక్షేమ ప థకాల అమల్లో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం చేయాలన్నారు. జిల్లాలోని అ న్ని మండలాల అధికారులతో ఆయన శుక్రవారం నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. గృహ నిర్మాణా లు, పించన్లు, చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్లికానుక, నైపుణ్యాభివృద్ధి, న్యూట్రీగార్డెన్లు, ప్రతీ కుటుంబానికి రూ.పదివేలు ఆదాయం, ఉద్యానవన తోటల పెంప కం, క్రీడామైదానాల నిర్మాణం, ఓడిఎఫ్ ప్లస్, పురపాలక సంఘాల్లో చెత్తసేకరణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎల్‌ఇడి దీపాల ఏ ర్పాటు, జిల్లా అధికారుల పల్లెనిద్ర, వినతుల పరిష్కారం, ఎంఎస్‌ఎంఇ పార్కు ల ఏర్పాటు, భూసేకరణ, కొత్తరేషన్‌కార్డుల పంపిణీ, అన్న క్యాంటిన్ల ఏర్పాటు, ఆర్‌ఎఫ్‌వోఆర్ పట్టాల పంపిణీ, పంట రుణాలు, గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు, రహదారులు నిర్మాణాలు, ఇరిగేషన్ ప్రాజెక్టుల భూసేకరణ అంశాలపై దిశ నిర్ధేశం చేశారు. జిల్లా అభివృద్ధిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గృహ నిర్మాణాలకు అవసరమైన భూసేకరణ చేయాలని ఆదేశించా రు. అర్హులైన లబ్దిదారులకు వృ ద్ధాప్య, వితంతు, వికలాంగ పించన్లు, ప్రభు త్వం ఇటీవల మంజూరు చేసిన హిజ్రా ల పించన్లను నూరుశాతం లబ్దిదారులకు పంపిణీ చేయాలని చెప్పారు. చంద్రన్న బీమా నమోదులో జిల్లా అగ్రస్థానంలో నిలిచిందని, క్లైముల పరిష్కారంలో ముందు ఉండాలన్నారు. ప్రతీ కుటుంబానికి నెలకు రూ.పదివేలు ఆ దాయం వచ్చేలా ప్రణాళికలు రూ పొందించి విజయవంతంగా అమలు చే యాలని ఆదేశించారు. జిల్లాలో హార్టికల్చర్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. అవకాశం ఉన్న పాఠశాలల్లో క్రీడామైదానాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఓడిఎఫ్ ప్లస్ కొన్నిచోట్ల ఇంకా ప్రారంభం కాలేదని, కొన్నిచోట్ల అసంపూర్తిగా ఉన్న పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు. సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్‌పై చ ర్యలు చేపట్టడం, పురపాలక సంఘాల్లో నూరు శాతం చెత్తసేకరణ చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో ఎల్‌ఇడి దీపాలు, వౌలిక సదుపాయాలు కల్పి ంచి టెన్‌స్టార్ స్థాయికి గ్రామాలు ఎదగాలన్నారు. పల్లెనిద్రలో భాగంగా గ్రా మాల సందర్శనచేసి పాఠశాలలు, అం గన్వాడీకేంద్రాలుతనిఖీచేయాలన్నారు.
భోగాపురం విమానాశ్రయానికి 89శాతం భూసేకరణ జరిగిందని, కోర్టు కేసులను పరిశీలించి మిగిలిన 11శాతం భూసేకరణ చేయాలన్నారు. ఖరీఫ్‌లో రై తులు అధిక దిగుబడులు సాధించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. సాగునీటి సమస్యలు తలెత్తకుండా చెరువులు, కాల్వల పూడికలు తీయించాలన్నారు. ఉపాధి హామీ పథకం అమలులో సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో వౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. స మావేశంలో జాయింట్ కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, డీఆర్‌వో ఆర్.శ్రీలత, జెడ్పీ ముఖ్యకార్యనిర్వహణాధికారి వెం కటేశ్వరరావు, ప్రత్యేక ఉప కలెక్టర్ సా ల్మన్‌రాజ్, ఆర్‌డబ్ల్యూ ఎస్‌ఎస్‌ఇఎ న్‌వి రమణమూర్తి, సాంఘికసంక్షేమశాఖ ఉపసంచాలకులు కె సునీల్, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమం పట్టని చంద్రబాబు
* ఎమ్మెల్సీ కోలగట్ల
విజయనగరం(గంట్యాడ), మే 18: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి ధన, అధికార దాహం తప్ప ప్రజా సంక్షేమం పట్టడడం లేదని శాసన మండలి సభ్యుడు, వైఎస్సార్ సిపి ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఆటోకార్మికునికి జగనన్న భరోసా ఏటా పదివేల చేయూత ప్రకటన నేపథ్యంలో విజయనగరం నియోజకవర్గంలో ఆటోకార్మికులు శుక్రవారం చేపట్టిన హర్షాతిరేక ర్యాలీలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ముందుగా పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వైఎస్సార్ విగ్రహానికి ఆటో కార్మికులు క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం కార్మికులు కాంప్లెక్స్ నుంచి ర్యాలీగా బయలుదేరి మరియు జంక్షన్ మీదుగా కాంప్లెక్స్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కోలగట్ల మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో ఆటో కార్మికుల సమస్యలను గుర్తించి వారికి అండగా పథకాలను జగన్మోహన్‌రెడ్డిప్రకటించడంతో ఆటో కార్మికులు హర్షాద్వేగాలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు పాపారావు, శ్రీనివాసరావు, అప్పలరాజురెడ్డి, తాతారావు, నారాయణప్పడు, పట్టణ వై ఎస్సార్ సిపి నాయకులు పాల్గొన్నారు.