ఆంధ్రప్రదేశ్‌

వేచి చూద్దాం..తొందరేం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాజీ ఎమ్మెల్యేలతో మాజీ సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి

రాజమండ్రి, డిసెంబర్ 28: ‘వేచి చూద్దాం. అప్పుడే తొందర లేదు’ అని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తనను కలిసిన మాజీ ఎమ్మెల్యేలు, నాయకులతో చెప్పారు. మాజీ ఎంపి జివి హర్షకుమార్‌కు చెందిన రాజీవ్‌గాంధీ విద్యాసంస్థల సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొనడానికి మంగళవారం రాజమండ్రి వచ్చిన ఆయన కొద్దిసేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేలుగా బాధ్యతలు నిర్వహించిన నాయకులు, ఇతర నాయకులతో మాట్లాడారు. ఏ పార్టీలోనూ చేరకుండా తటస్థంగా ఉండిపోయిన పెద్దాపురం మాజీ ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్ భవిష్యత్ కార్యాచరణను లేవనెత్తారు. దీనిపై కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందిస్తూ కొంత కాలం పాటు వేచి చూద్దామని చెప్పారు. ఈ సందర్భంగా తనను కలిసిన మాజీ ఎమ్మెల్యేలు, నాయకులతో కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, రాష్ట్రప్రభుత్వం పని తీరు, ఇరిగేషన్ ప్రాజెక్టులు తదితర అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం సరికాదని, దీనివల్ల కృష్ణా డెల్టాకు ఏమంత ప్రయోజనం ఉండదని చెప్పారు. కృష్ణా బ్యారేజి బేసిన్‌లో 3టిఎంసిల నీటిని నిల్వచేయవచ్చని, కానీ బేసిన్‌లో 1టిఎంసి నీటి నిల్వకు సరిపడా ప్రాంతం ఇసుక మేటలతో నిండి ఉందని, మరో 1.5టిఎంసి నీటిని విటిపిఎస్‌కు సరఫరాచేయాల్సి ఉంటుందని, ఇక మిగిలిందల్లా 0.5టిఎంసి మాత్రమేనన్నారు. ఈ మాత్రం దానికి అంత డబ్బు ఖర్చుచేసి పట్టిసీమ ప్రాజెక్టును నిర్మించాల్సిన అవసరం లేదని మాజీ ఎమ్మెల్యేలకు వివరించినట్టు తెలిసింది. రాష్ట్రప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పోలవరం ప్రాజెక్టును చాలా వేగంగా నిర్మించవచ్చని, పనుల్లో ఆలస్యం చేసిన కాంట్రాక్టు సంస్థలపై పెనాల్టీ విధించే విధంగా తాను ఉత్తర్వులు జారీచేసానన్నారు. రాష్ట్రంలో పరిపాలన అంత సవ్యంగా సాగటం లేదని, ప్రతిపక్ష పార్టీ వైసిపి దీటుగా వ్యవహరించలేకపోతోందని అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. రాజధాని నిర్మాణంపై కూడా ఆయన తన అభిప్రాయాలను మాజీ ఎమ్మెల్యేలతో పంచుకున్నట్టు తెలిసింది. అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణం వల్ల మట్టి పరీక్షలకే అదనంగా రూ.5వేల కోట్లు వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని చెప్పినట్టు సమాచారం. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసిన వారిలో మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశరావు, వంగా గీత, పంతం గాంధీమోహన్, పొన్నాడ సతీష్, రాజా అశోక్‌బాబు, రాపాక వరప్రసాద్, కెవి సత్యనారాయణరెడ్డి, భమిడిపాటి రామ్మూర్తి తదితరులు ఉన్నారు.