విశాఖపట్నం

యుద్ధ నౌకలను సందర్శించిన చిన్నారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 27: భారత నౌకాదళ వారోత్సవాల సందర్భంగా శుక్రవారం తూర్పు నౌకాదళంలోని యుద్ధ నౌకలను వివిధ కళాశాలలకు చెందిన చిన్నారులు సందర్శించారు. 12 కళాశాలల నుంచి 178 మంది చిన్నారులు యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ కమోర్తా, శివాలిక్‌లను సందర్శించారు. నేవీ సిబ్బంది జీవన విధానం, వారి పనితీరు గురించి చిన్నారులు తెలుసుకున్నారు. నౌకాదళ సిబ్బంది వినియోగించి తెలిపాటి ఆయుధాలను వీరు పరిశీలించారు. యుద్ధ నౌకపై వీరు ఆటపాటలతో సందడి చేశారు.

జిఎస్‌టితో ఎంతో మేలు
* ఐసిఎఐ సదస్సులో వక్తలు
విశాఖపట్నం, నవంబర్ 27: దేశ వ్యాప్తంగా ఒకే పన్ను విదానం అమలు చేయడం వల్ల ఎంతో మేలు కలుగుతుందని ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ) వక్తలు అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఇక్కడ సాయిప్రియా రిసార్ట్స్‌లో దక్షిణ భారత ప్రాంతీయ మండలి, విశాఖ చాప్టర్ ఆధ్వర్యంలో రెండు రోజుల సదస్సు ప్రారంభించారు. దేశంలో స్థిరమైన జాతీయాదాయానికి సహజ వనరులు ఎలా వినియోగించాలనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్ ఉపాధ్యక్షుడు మానస్ కుమార్ ఠాకూర్ మాట్లాడుతూ సహజ వనరులను బావి తరాలకు అందించేందుకు వాటిని సక్రమ మార్గంలో వినియోగించాలన్నారు. అలాగే సహజ వనరులు దుబారా కాకుండా చూడాలన్నారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న ఆర్‌ఐఎన్‌ఎల్ డైరెక్టర్ టివిఎస్ కృష్ణకుమార్ మాట్లాడుతూ సహజ వనరుల వినియోగంపైనే తయారీ రంగం ఆధారపడి ఉందన్నారు. విశాఖ చాప్టర్ చైర్మన్ పివిఎన్ మాదవ్ మాట్లాడుతూ విశాఖ చాప్టర్ ఏర్పడి 50 ఏళ్లు కావస్తుందన్నారు. దేశాభివృద్ధికి స్ధిరమైన వృద్ధి సాధించడం ముఖ్యమన్నారు. వృధాను అరికట్టడంతోపాటు సహజ వనరులను అభిలషణీయ స్థానం వరకు ఉత్పత్తి చేయడం అవసరమన్నారు. దాంతోపాటు పర్యావరణాన్ని కాపాడుకోవడం అవసరమన్నారు. ఈ సందర్భంగా త్వరలో అమలు కానున్న జిఎస్‌టి విధానం ఎలా ఉండాలనే అంశంపై చర్చించారు. జిఎస్‌టిని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐసిఎఐ కృషి చేయాలన్నారు. జిఎస్‌టి వల్ల ప్రధానంగా ఏకీకృత పన్ను విధానం అమల్లోకి వస్తుందన్నారు. అయితే ఈ విధానాన్ని తమిళనాడు, మహారాష్ట్ర వ్యతిరేకిస్తున్నాయన్నారు. త్వరలోనే ఈ సమస్య కొలిక్కి రానుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐఆర్‌సి చైర్మన్ కె.సన్యాసిరావు మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియా బావనను నిజం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రవికాంత్, కె.నర్సింహమూర్తి, ఎన్‌ఇఎన్ రామసాయి, వికాస్ షా, సుభాషిని, కెవిఎన్ లావణ్య, ఎబి నవాల్, హరిహర ప్రసాద్, వి.కల్యాణ్ రామన్ తదితరులు వివిధ అంశాలపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటకకు చెందిన కాస్ట్ అకౌంటెంట్లు పాల్గొన్నారు.