యువ

ఈ ఫోన్‌ని కడిగి పారేయొచ్చు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషబుల్ ఫోన్ ‘డిగ్నో రఫ్రె’
నిత్యం మనం చేత్తో పట్టుకు తిరిగే స్మార్ట్ఫోన్ లక్షలాది సూక్ష్మజీవులకు నిలయం. బాత్‌రూమ్‌లో కమోడ్‌పై ఉండే బ్యాక్టీరియాకు పదిహేను రెట్ల బ్యాక్టీరియా స్మార్ట్ఫోన్‌పై ఉంటుందని ఆ మధ్య ఓ సర్వేలో వెల్లడైంది. ఇదంతా సరే. స్మార్ట్ ఫోన్‌ను క్లీన్ చేయడమెలా? నీళ్లతో కడిగినా, రసాయనిక ద్రవాలతో తుడిచినా ఫోన్ పాడైపోవడం ఖాయం. మార్కెట్లోకి వాటర్‌ప్రూఫ్ ఫోన్లు చాలానే వచ్చాయి. అలాని చెప్పి వాటిని నీళ్లతో కడిగితే బ్యాక్టీరియా మొత్తం పోకపోవచ్చు. మరి, ఈ సమస్యకు పరిష్కారమే లేదా? ఇలా ప్రశ్నించేవారికి సమాధానంగా జపాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్, సెరామిక్స్ ఉత్పత్తుల సంస్థ క్యోసెరా తాజాగా సబ్బుతో కడిగినా చెక్కు చెదరని స్మార్ట్ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువస్తోంది. ఈ ఫోన్ పేరు డిగ్నో రఫ్రె. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది సోప్ ప్రూఫ్ ఫోన్. అన్ని రకాల వాతావరణాలను తట్టుకుని నిలబడే ఫోన్ అని క్యోసెరా చెబుతోంది. కిచెన్‌లో వంట చేస్తూ, బాత్‌రూమ్‌లో స్నానం చేస్తూ కూడా తమ ఫోన్‌ను వినియోగించవచ్చని భరోసా ఇస్తోంది. మరో విశేషమేమంటే- ఈ ఫోన్‌లో స్పీకర్ ఉండదట. బోన్ కండక్టింగ్ టెక్నాలజీతో రూపొందించిన స్మార్ట్ సోనిక్ రిసీవర్‌తో స్పీకర్ లేకుండానే స్పష్టమైన ఆడియోను వినవచ్చట. వచ్చే వారం మార్కెట్లోకి రానున్న డిగ్నో రఫ్రె ధర 465 డాలర్లు.
*