రాష్ట్రీయం

వ్యర్థాల నిర్వహణకు మూడు ఒప్పందాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘స్వచ్ఛాంధ్ర’కు ఉత్తమ పద్ధతులు అవలంభించాలి: సిఎం
విజయవాడ, నవంబర్ 30: ఆంధ్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోందని సిఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సోమవారం సిఎంఓలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మరుగుదొడ్లు, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు మూడు అంతర్జాతీయ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. వ్యర్థాల నిర్వహణలో ప్రపంచంలోని ఉత్తమ పద్ధతులను అవలంభించాలని చంద్రబాబు సూచించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పర్యావరణహితంగా వ్యర్థాల నిర్వహణ చేపట్టాలని సూచించారు. వ్యర్థాల నుంచి విద్యుదుత్పత్తి చేయతలపెట్టామని, అందుకుతగిన ప్రతిపాదనలతో అంతర్జాతీయ సంస్థలు ముందుకొస్తే ఆహ్వానిస్తామన్నారు. దీనిపై ఇప్పటికే టెండర్లు పిలిచామని తెలిపారు. రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల్లో 3 లక్షల మరుగుదొడ్ల అవసరం వుందని, ఇప్పటికి 60వేల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేశామన్నారు. వచ్చే ఏడాది మార్చిలోగా మిగిలిన వాటి నిర్మాణం పూర్తిచేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు.
ప్రపంచంలోనే పేరున్న సంస్థలు
అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్న జిఐజెడ్, బిఎఆర్డీఏ అండ్ సిడిడి, వాటర్.ఒఆర్‌జి.. మూడు మూడు కంపెనీలు ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణలో ప్రపంచంలోనే పేరుపొందాయి. జిఐజెడ్ 130 దేశాల్లో వ్యర్థాల నిర్వహణలో పనిచేస్తోంది. బోర్డా అండ్ సిడిడి 23 దేశాల్లో తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న వేస్ట్ మేనేజ్‌మెంట్ కార్యక్రమాలను అధ్యయనం చేసి మరింత పటిష్టంగా చేపట్టేందుకు మున్సిపల్ అధికారులకు, పారిశుద్ధ్య సిబ్బందికి తగిన శిక్షణ అందజేసి, ఘన, ద్రవ వ్యర్ధాల నిర్వహణలో అంతర్జాతీయస్థాయి ప్రమాణాలను అందుకునేలా కృషి చేస్తున్నారు. బోర్డా అండ్ సిడిడి ప్రతినిధి సుస్మితా సిన్హా మాట్లాడుతూ తమ సంస్థ ఇప్పటికే 23 దేశాల్లో వ్యర్థాల నిర్వహణలో కార్యకలాపాలు నిర్వర్తిస్తోందన్నారు. బెంగళూరు శివారులోని మున్సిపాలిటీలో పూర్తి పర్యావరణహితమైన ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టును నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఎలాంటి విద్యుత్, హానికర రసాయనాలతో పనిలేకుండా ప్రాజెక్టు నిర్వహించటం ప్రత్యేకతగా చెప్పుకున్నారు. ప్రాథమిక అవగాహన ఒప్పందం ప్రకారం త్వరలో రాజధాని శివారు మున్సిపాలిటీలో పర్యావరణహిత వ్యర్ధాల నిర్వహణ ప్రాజెక్టు ప్రారంభిస్తామన్నారు. సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్ధి మంత్రి నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, సిఎంఓ ముఖ్య కార్యదర్శి సతీష్‌చంద్ర, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండి డి మురళీధర్‌రెడ్డి, బోర్డా అండ్ సిడిడి ప్రతినిధి సుస్మితా సిన్హా, జిఐజడ్ సంస్థ ప్రతినిధి డిర్క్‌వాల్దర్, వాటర్.ఆర్గ్ ప్రతినిధి సెల్వరాజ్, తదితరులు పాల్గొన్నారు.