ఆంధ్రప్రదేశ్‌

మహనంది క్షేత్రంలోకి నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు: జిల్లాలోని ప్రసిద్ధ మహనంది క్షేత్రంలోకి నీరు ప్రవేశించింది. క్షేత్రంలో మోకాళ్ల లోతుకు పైగా నీరు ప్రవహిస్తుండటంతో భక్తులు స్వామివారి దర్శనం చేసుకోలేకపోయారు. అంతేకాదు రుద్రగుండం పుష్కరణిలో ఉన్న పంచలింగాలపైకి నాలుగు అడుగుల నీరు చేరింది. ప్రధాన అర్చకులు నీటిలో గుండానే వెళ్లి మహానందిశ్వర స్వామి, కామేశ్వరి అమ్మవార్లకు పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సోమవారం అర్థరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి గతంలో ఎన్నడూ లేనివిధంగా క్షేత్రంలోకి నీరు వచ్చింది. ఇదిలావుండగా రాళ్లవాగు, పాలేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. విద్యాశాఖ పాఠశాలలకు సెలవు ప్రకటించింది. కాగా భారీ వర్షాలకు ఎన్జీరంగా వ్యవసాయ కళాశాల, వైఎస్‌ఆర్ ఉద్యానవన శాఖ పరిశోధన స్థానం, వెంకటేశ్వర ఒంగోలు జాతి పరిశోధన స్థానం నీట మునిగాయి. అక్కడ 250 ఒంగోలు జాతి ఆవులు, దూడలు నీటిలోనే ఉన్నాయి.