రంగారెడ్డి

రోడ్లపై నదిలా ప్రవహించిన గోదావరి జలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, డిసెంబర్ 3: బస్తీలలోని రోడ్లపై ఓ నదిలా గోదావరి జలాలు పుష్కలంగా ప్రవహించాయి. జగద్గిరిగుట్ట జలమండలి కార్యాలయం నుండి నేరుగా రోడ్ల పైకి గోదావరి జలాలు ప్రవహించాయి. వీధులలో, రోడ్లపై నీరంతా వృథాగా ప్రవహించడంతో ప్రజలంతా ఆశ్చర్యానికి గురయ్యారు. గత 20 రోజుల నుండి నీటి సరఫరా లేకపోవడంతో బస్తీలలో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్న తరుణంలో ఒక్కసారిగా నీరంతా రోడ్లపై ప్రవహించడంతో అవాక్కయ్యారు. అసలే నీళ్లందకు ప్రజలు బోర్‌లను, ఇతరత్రా కొనుగోలు చేసుకుని వాడుకుంటుంటే రోడ్లపై నదిలా గోదావరి ప్రవహించడం అందరిని కలచివేసింది. తాగునీరు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో నీరంతా వృథాగా రోడ్లపై ప్రవహించడం అధికారుల పనితీరుకు అద్ధం పడుతుంది. దీనిపై జలమండలి డిజిఎంను వివరణ కోరగా నీటిలో అధికంగా చెత్త చేరడంతో కాసేపు నీటిని బయటికి వదిలిపెట్టామని చెప్పారు. ఏదిఏమైనా ఓ వైపు నీరు లేక ప్రజలు అవస్థలను ఎదుర్కొంటుంటే రోడ్లపై నీరంతా వృథాగా పోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల పై వృథాగా వదిలిపెట్టే బదులు అన్ని బస్తీలకు కాసేపు నీటి సరఫరా చేస్తే వాడుకోవడానికైనా ఉపయోగపడేవి కదా ప్రజలు ప్రశ్నిస్తున్నారు.