హైదరాబాద్

నీటి సౌకర్యం కోసం సమగ్ర నివేదిక రూపొందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాంద్రాయణగుట్ట, డిసెంబర్ 10: జిహెచ్‌ఎంసి చుట్టు ఉన్న పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో నీటి సరఫరా ఏర్పాటు చేసేందుకు సమగ్ర డిజైన్ రూపకల్పన కోసం జలమండలి ఉన్నతాధికారులు ఎన్‌సిపిఇ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతనిధులతో గురువారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జిహెచ్‌ఎంసి చుట్టు పక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో, గ్రామాల్లో నీటి సరఫరా కల్పించేందుకుగాను డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును తయారుచేయాలని అధికారులు ఆ సంస్థ ప్రతినిధులతో చర్చించారు. గ్రామాల్లో నీటివసతి కల్పించేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లకు సంబంధించి పూర్తి నివేదికలను రూపొందించడంతోపాటు ఎత్తు ప్రాంతాల్లో వున్నవారికి కూడా నీటి సౌకర్యం కల్పించేందుకు కావాల్సిన సూచనలు, సలహాలు సూచించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి ఎగ్జిక్యుటివ్ డైరక్టర్ ఎమ్.సత్యనారాయం, డైరక్టర్ టెక్నికల్ అధికారి శెట్టిపల్లి ప్రభాకర్ శర్మ, రెవిన్యు డైరక్టర్ డా.పి.సత్యసూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
జలమండలి పరిధిలోని డివిజన్ 7,8,14,15తోపాటు 16 డివిజన్లకు సంబంధించిన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంజీరా, సింగూర్ నీటికిబదులు గోదావరి నీటిని సరఫరా చేస్తున్న ప్రాంతాల్లో నీటి సరఫరా తీరుతెన్నులపై సంబంధిత డివిజన్ జనరల్ మేనేజర్లు, ఉన్నతాధికారులకు వివరించారు.దీంతోపాటు నీటి బిల్లుల వసూళ్లపై కూడా ప్రత్యేక చర్చ జరిగింది. సమావేశంలో ఆయా డివిజన్లకు చెందిన జనరల్‌మేనేజర్లు, డిజిఎం, మేనేజర్లు పాల్గొన్నారు. బోర్డు ఇడి, ఇఎన్‌సి ఎమ్.సత్యనారాయణ, రెవిన్యు, టెక్నికల్ డైరక్టర్లు, జలమండలికి సంబంధించిన డివిజన్ 8, 15 మెయింటెనెన్స్ విభాగానికి చెందిన అధికారులతో సమావేశమయ్యారు. డివిజన్ 15 పరిధిలోని మియాపూర్, హఫీజ్‌పేట్‌లో నెలకొన్న నీటి సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఇడి డివిజన్ స్థాయి అధికారులను ఆదేశించారు.

ఇంటర్ డిస్ట్రిక్ట్ అండర్ -14 క్రికెట్ టోర్నీ
హర్షవర్ధన్ సెంచరీ : నిజామాబాద్ గెలుపు
హైదరాబాద్, డిసెంబర్ 10: ఆదిలాబాద్, నిజామాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో నిజామాబాద్ జట్టు మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆదిలాబాద్ జట్టుతొలుత బ్యాటింగ్ చేసి 206 పరుగులు సాధించి ఆలౌటయింది. హిమతేజ (124) బ్యాటింగ్‌లో రాణించి సెంచరీ సాధించగా, నబీల్ బౌలింగ్‌లో ఆకట్టుకుని 49 పరుగులిచ్చి నాలుగువికెట్లు సొంతం చేసుకున్నాడు. జవాబుగా బ్యాటింగ్ చేసిన నిజామాబాద్ జట్టు ఏడు వికెట్లు నష్టపోయి లక్ష్యసాధనలో విజయం సాధించింది. హర్షవర్ధన్ (104) అజేయ సెంచరీతో జట్టును విజయపథంలో నడిపించాడు. నల్గొండ, ఖమ్మం జిల్లాల మధ్య జరిగిన మరోమ్యాచ్‌లో నల్గొండ జట్టు విజయం సాధించింది. నల్గొండ జట్టు మొదటబ్యాటింగ్ చేసి 159 పరుగులు సాధించి ఆలౌటయింది. సాయి సిద్ధార్థ్ 41 పరుగులు సాధించగా, ఉదయ్ 37 పరుగులిచ్చి ఐదు వికెట్లు చేజిక్కించుకున్నాడు. జవాబుగా బ్యాటింగ్ చేసిన ఖమ్మం జట్టు 128 పరుగులు సాధించి కుప్పకూలి పరాజయం పాలయింది. అనే్వష్ బౌలింగ్‌లో రాణించి 25 పరుగులిచ్చి ఆరు వికెట్లు చేజిక్కించుకుని జట్టువిజయంలో కీలకపాత్ర పోషించాడు. కరీంనగర్, వరంగల్ జట్ల మధ్య జరిగిన మరొక మ్యాచ్‌లో వరంగల్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. కరీంనగర్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 89 పరుగులు సాధించి కుప్పకూలింది. అజయ్ మూడు, పవన్ నాలుగు వికెట్లు చేజిక్కించుకున్నారు. జవాబుగా బ్యాటింగ్ చేసిన వరంగల్ జట్టు రెండు వికెట్లు నష్టపోయి లక్ష్యసాధనలో విజయం సాధించింది. మెదక్, మహబూబ్‌నగర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మెదక్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి కేవలం 115 పరుగులు సాధించి కుప్పకూలింది. సుమంత్ ఐదు, సాయి ప్రవీణ్ మూడు వికెట్లు చేజిక్కించుకున్నారు. జవాబుగా బ్యాటింగ్ చేసిన మహబూబ్‌నగర్ జట్టు ఒక వికెట్ మాత్రమే నష్టపోయి లక్ష్యసాధనలో విజయం సాధించింది. హర్షవర్దన్ (54) అజేయ అర్ధసెంచరీతో జట్టును విజయపథంలో నడిపించాడు.