వీక్లీ సీరియల్
డార్క్ అవెన్యూ-6
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
‘కనిపిస్తారు. కానీ మీరు కొద్దిగా ఓపిక పట్టాలి. మీ వారు వచ్చాక వెంటనే మా గురించి చెప్పకూడదు’ చెప్పాడు సమీర్.
‘ఎందుకు?’ అనుమానంగా ప్రశ్నించింది చంద్రకళ.
‘మేము తనకు బాగా పరిచయం లేము కదా.. భయంతో వెళ్లిపోవచ్చు’ చెప్పాడు సమీర్.
కొద్దిగా కన్విన్స్ అయినట్టు మొహం పెట్టి సరేనన్నట్టు తలూపింది.
‘ఇప్పుడు మీరు వెళ్లి గదిలో కూడా పూజ చేయాలి’ అని చెప్పి ఆ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని అక్కడ కూడా సీక్రెట్ కెమెరాలు ఫిక్స్ చేశారు.
* * *
సిఐ దుర్జన్‌కుమార్ బెడ్ కింద వున్న మొబైల్ ఫోన్ తీశాడు. అది నిన్న రాత్రి ఒక వార్డ్ బాయ్ చేత సీక్రెట్‌గా వచ్చిన ఫోన్. అది స్మార్ట్ ఫోన్ కాదు. దాన్ని ట్రాక్ చేయడం కూడా కష్టం. అది కొత్త నంబర్.
డిసిపి అవినాష్ తన మీద నిఘా పెట్టాడన్న అనుమానం సిఐ దుర్జన్ కుమార్‌కు వచ్చింది. కానిస్టేబుల్ వహీద్ తనను అంటిపెట్టుకునే ఉంటున్నాడు. సరిగా తనకు వచ్చిన అనుమానమే.. మరో వ్యక్తికి వచ్చింది. అతనే ఈ కథకు కీలకమైన వ్యక్తి. నిన్న రాత్రి తను నిద్రపోతుండగా వార్డ్ బాయ్ వచ్చాడు. తన చేతికి కట్టు కట్టాలని చెప్పాడు. వహీద్ ముందు వచ్చి వార్డ్ బాయ్ వంక చూసి వార్డ్ బాయ్ కట్టు కట్టాడని బ్యాండేజ్ తీయడం చూసి బయటకు వెళ్లి కూచున్నాడు.
వార్డ్ బాయ్ బ్యాండేజ్ కట్టు కట్టి సిఐ దుర్జన్ కుమార్ వంక చూసి ‘రాత్రి అందరూ పడుకున్నాక బ్యాండేజ్ విప్పి మొబైల్ తీసుకో’ అని చెప్పాడు.
అప్పుడు గమనించాడు. మొబైల్ ఫోన్ పెట్టి పై నుంచి బ్యాండేజ్ కట్టు కట్టారని.. రాత్రివేళ బెడ్ సర్ది బెడ్‌షీట్స్ మారుస్తారు. అప్పుడు అనుమానం రాకుండా ఉండడానికి ఇలా చేశారని అర్థమైంది.
ఒక్క క్షణం ఒళ్లు జలదరించింది. అవతలి వ్యక్తి క్రిమినల్ మైండ్ చూసి ఒక పోలీస్ ఆఫీసర్‌నే షాక్‌కు గురి చేశాడు.
మామూలు సాదాసీదా మొబైల్.. కొత్త సిమ్.. యాక్టివేట్ అయి వుంది. సైలెంట్ మోడ్‌లో వుంది. సరిగా అర్ధరాత్రి పనె్నండు గంటలకు వాష్‌రూమ్‌లోకి వెళ్లాడు. తనకు వచ్చిన ఇన్‌ఫర్మేషన్ ప్రకారం.
సరిగ్గా పనె్నండు గంటలకు మొబైల్ రింగ్ అయ్యింది.
‘నువ్వు మాట్లాడకు. నేను చెప్పేది విను. రేపు నిన్ను డిశ్చార్జ్ చేస్తారు. నువ్వేం చేయాలో నేను చెప్పేవరకు నువ్వు నీ స్వంత నిర్ణయాలు తీసుకోకు...’ అంటూ అవతల వ్యక్తి చెప్పసాగాడు.
అవతలి వ్యక్తి చెప్పేది విని పది నిమిషాల తరువాత ఎవ్వరికీ అనుమానం రాకుండా ఫ్లష్ నొక్కాడు. నీళ్ల సౌండ్ బయటకు వినిపించేలా...
తరువాత మొబైల్ చేతికి వున్న బ్యాండేజ్‌లోనే పెట్టి బయటకు వచ్చాడు.
* * *
డార్క్ అవెన్యూ చీకటి కళ్లు తెరుచుకున్నాయి.
రాత్రి పనె్నండు కావస్తోంది...
అప్పటికే సమీర్ భార్గవి వచ్చి ఒక్కరోజు దాటింది.
అప్పటికే ఆ ఇంటి పరిస్థితి అర్థమైంది. ఆ ఇంట్లో వంట చేసుకోవడం కూడా కష్టమే. ప్రతీ క్షణం బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. తలుపులు ఎప్పుడూ మూసి వుంటాయి. దానికి తోడు కిటికీలు...
చంద్రప్రభ తనలో తానే గొణుక్కుంటూ ఉంటుంది. తల్లి చంద్రకళ పరిస్థితి ఇంచుమించు అలానే ఉంది.
ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకు వస్తుందో.. అని.
అలాంటి వాతావరణంలో చంద్రలేఖను చూస్తుంటే భార్గవికి బాధగా వుంది. ఆ ఇంట్లో సమీర్ ఫోన్ మాట్లాడలేడు. భార్గవి కూడా.. కేవలం మెసేజెస్ మాత్రమే పంపుకునే అవకాశం.
చంద్రలేఖ రహస్యంగా సమీర్‌తో భార్గవితో చాట్ చేస్తోంది. సమీర్ ఏం చేయాలో గైడెన్స్ ఇస్తున్నాడు.
సమీర్‌కు ఒక్క విషయం అర్థమైంది. ఆ ఇంట్లో ఏదో జరుగుతోంది. తనకు నీడలు.. అడుగుల శబ్దాలు వినిపించాయి. కానీ ఆ సమయంలో బయటకు వెళ్లలేని పరిస్థితి.
పనె్నండు దాటి పది నిమిషాలు అయ్యింది. తన గదిలో వున్న చంద్రకళ కూతురి దగ్గరకు పరిగెత్తుకు వచ్చింది. చంద్రలేఖ చేయి పట్టుకుని తన గదిలోకి లాక్కెళ్లింది.
‘వాళ్లను వెళ్లిపొమ్మని చెప్పు.. వాళ్లు ఉంటే మీ నాన్నగారు రావడం లేదు’ చెప్పింది తల్లి.
ఒక్క క్షణం ఒళ్లు జలదరించింది. తల్లి వంక చూసి ఏమనాలో అర్థం కాలేదు.
‘ఈ విషయాన్నీ సమీర్‌తో చెప్పాలి.. వాళ్ల అభిప్రాయాన్ని కనుక్కోవాలి..’ అనుకుంది. వెంటనే తల్లి వంక చూసి ‘వాళ్లకు చెబుతాను’ అంది.
‘చెప్పడం కదా వెళ్లిపొమ్మని చెప్పు. వాళ్లు వెళ్లగానే మీ నాన్న వస్తాడు’ చెప్పింది తల్లి.
చంద్రలేఖ అలాగే అని వెనక్కి తిరిగింది. తన మొబైల్ నుంచి వాళ్లకు విషయాన్ని వాట్సాప్ ద్వారా తెలియజేసింది.
సమీర్ ‘ఓకే’ అన్నాడు..
సమీర్ భార్గవి బయటకు వెళ్లారు. వాళ్లు వెళ్లగానే డార్క్ అవెన్యూ తలుపులు మూసుకున్నాయి.
సమీర్ భార్గవి డార్క్ అవెన్యూ నుంచి వెళ్లిపోయారు.. వాళ్లు సిటీలోకి ఎంటర్ అయి.. వెంటనే డార్క్ అవెన్యూ వైపు కదిలారు.
సమీర్ రెండు రోజుల క్రితమే డార్క్ అవెన్యూకు చేరుకోవడానికి ఒక రూట్ కనిపెట్టాడు. డార్క్ అవెన్యూకే కూతవేటు దూరంలో చుట్టూ పొదలు.. చెట్లు.. అక్కడ ఒక పాడుబడిన వ్యాన్ ఉంది. అందులో ఒక ల్యాప్‌టాప్ ఉంది.
సమీర్ భార్గవి అక్కడికి వచ్చారు.
డార్క్ అవెన్యూలో అమర్చిన కెమెరాల్లో నుంచి ప్రతీ ఒక్కటీ అక్కడ రికార్డు వుంటుంది.
ఆ ఏర్పాటు రెండు రోజుల క్రితమే చేశాడు సమీర్.
* * *
అర్ధరాత్రి రెండు గంటలు.. పాడుబడిన వ్యాన్.. చుట్టుపక్కల జన సంచారం లేదు.. కేవలం మొబైల్ ఫ్లాష్‌తోనే ఆ వ్యాన్‌లో కూచొని ఉన్నారు సమీర్ భార్గవి. ల్యాప్‌టాప్ ఓపెన్ చేశారు. ఆ ఇంట్లో అమర్చిన కెమెరాలు పని చేస్తున్నాయి. బెడ్‌రూమ్ కిచెన్ హాలు బయట.. ఒక్క వాష్‌రూమ్ మినహా అన్ని గదుల్లో కెమెరాలు ఉన్నాయి. చంద్రకళ పదేపదే పెరటి గుమ్మం వైపు చూస్తోంది.
చంద్రప్రభ మాటిమాటికి కిటికీల వైపు చూస్తూ భయపడుతోంది. తనలో తానే గొణుక్కుంటోంది.. హాలులో వున్న చంద్రలేఖ తల్లిని అక్కను ఓ కంట కనిపెడుతూ ఉంది.
పిచ్చి లేకున్నా పిచ్చి పట్టినట్టు పిచ్చివాళ్ల మధ్య ఓ పిచ్చిదానిలా ఉండడం ఎంత భయంకరమో తెలుస్తోంది.
ల్యాప్‌టాప్ మీద మొత్తం గదులు విభజించబడి వున్నాయి. ఒక్కో కెమెరా వున్న గదికి ఒక్కో నెంబర్.. కెమెరా ఒకటి.. కెమెరా రెండు.. ఇలా...
భార్గవికి నిద్ర ముంచుకు వస్తోంది. ఈ మధ్య నిద్రకు చాలా దూరం అయ్యింది. నిద్ర లేకపోవడం.. ప్రతీ క్షణం టెన్షన్ పడడం.. ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయం...
‘్భర్గవి నువ్వు కాసేపు పడుకో’ అన్నాడు సమీర్.
అతనికి పేరు పెట్టే పిలిచే చనువు వచ్చింది. ఆ చనువు తనకు తాను తీసుకున్నది కాదు.. భార్గవి ఇచ్చింది. అతను తనను ‘మీరు’ అంటుంటే అదోలా వుంది. కొందరు ‘నువ్వు’ అని పిలిస్తే అందులో మనసుకు నచ్చిన వాళ్లు పిలిస్తే బావుంటుందని.. సమీర్ తనను ‘నువ్వు.. భార్గవీ’ అని పిలిచినప్పుడు తెలిసింది.
‘పర్లేదు’ అంది భార్గవి.
‘వద్దు మళ్లీ రేపు మనకు పని ఉంటుంది. అసలు నువ్వు గెస్ట్‌హౌస్‌లో రెస్ట్ తీసుకుంటే బావుండేది’ అన్నాడు సమీర్.
‘ఒక్కదాన్నా.. నేనా.. అదీ మీరు లేకుండా’ ఠక్కున అనేసింది.
ఒక్క క్షణం భార్గవి వైపు చూసి, ‘కాసేపు కళ్లు మూసుకో.. లేదా.. వాటర్‌తో మొహం కడుక్కో’ అన్నాడు చనువుగా..
అలాగేనన్నట్టు చూసింది. తమతోపాటు తెచ్చిన బ్యాగ్‌లో నుంచి వాటర్ బాటిల్ తీసింది.. లోపల బిస్కట్ పాకెట్ ఉంది. వాటర్ బాటిల్ చేతిలోకి తీసుకుంది.. వ్యాన్ దిగింది. అర్జెంట్‌గా టాయిలెట్‌కు వెళ్లాలనుకుంది. ఆ క్షణం ఒక పత్రికలో ఒక జర్నలిస్ట్ ఒక నటిని చేసిన ఇంటర్వ్యూ గుర్తుకు వచ్చింది.
‘టాయిలెట్’ చాలా చిన్నగా అనిపించే పెద్ద సమస్య. ముఖ్యంగా మహిళలకు ఓ నటి ఇంటర్వ్యూలో ఇలా చెప్పింది.
‘మమ్మల్ని చూడగానే ఈలలు వేస్తారు.. మా వెంట పడతారు. మాకు డ్రెస్ ఛేంజ్ చేసుకోవాలన్నా అవుట్‌డోర్‌లో చాటు ఉండదు. అత్యవసర సమయాల్లో బాత్‌రూమ్ అవసరాన్ని వాయిదా వేస్తాం... దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఎవరికీ అర్థంకావు’
నిజమే.. ప్రాక్టికల్‌గా అనుభవంలోకి వస్తే తప్ప తెలియదు.
చుట్టూ చూసింది. అన్నీ గుబురు పొదలే.. వ్యాన్‌లో సమీర్. చిన్నపాటి ఫీలింగ్.. సిగ్గు.. ఇబ్బంది కాదు కానీ చెప్పలేని ఫీలింగ్ అనిపించింది.
కాస్త దూరంగా వెళ్లింది.
* * *
సమీర్‌కు కళ్లు మూతలు పడుతున్నాయి. తాను కూడా మొహం కడుక్కుంటే కాస్త ఫ్రెష్ అవ్వొచ్చు అనుకున్నాడు. వాటర్ బాటిల్ కోసం చూశాడు. భార్గవి వ్యాన్ దిగిన విషయం గుర్తొచ్చింది. టైం చూసుకున్నాడు. భార్గవి వెళ్లి చాలాసేపైంది. ఇంతసేపు.. టాయిలెట్‌కు వెళ్లిందా? వ్యాన్ దిగి వెళ్తే భార్గవికి ఇబ్బందిగా ఉంటుంది.. అనుకుంటూ సడెన్‌గా ఆగిపోయాడు.
ల్యాప్‌టాప్‌లో కెమెరా నంబర్ మూడులో.. అంటే చంద్రలేఖ గదిలోకి ఒక ఆకారం వచ్చింది.. పరీక్షగా చూడబోయేంతలో బయట నుంచి కేక.. ఆ కేక వేసిన గొంతు భార్గవిది..
ల్యాప్‌టాప్‌ను వదిలి ఒక్క అంగలో వ్యాన్ దూకాడు. కేక వినిపించిన వైపు పరుగెత్తాడు.
* * *
సమీర్ చెవులు షార్ప్‌గా పని చేస్తున్నాయి. భార్గవి కేక వినిపించిన వైపు పరుగెత్తాడు. అర్ధరాత్రి రెండు దాటింది. అతని పాదాల కింద ఎండుటాకుల శబ్దం భయంకరంగా వినిపిస్తోంది. కొద్దిగా పరుగెట్టగానే అక్కడ భార్గవి స్పృహ తప్పి పడి వుంది. భార్గవి దగ్గరికి వెళ్లి ఆమె భుజాలు పట్టి కుదుపుతూ ‘్భర్గవి భార్గవి’ అని పిలిచాడు. భార్గవి పక్కనే వాటర్ బాటిల్ పడి వుంది. వెంటనే ఆ వాటర్ బాటిల్ తీసుకుని వాటర్ బాటిల్ ఓపెన్ చేసి అందులో నుంచి నీళ్లు తీసుకుని మొహమీద చిలకరించాడు.
మెల్లిగా నెమ్మదినెమ్మదిగా కళ్లు తెరిచింది భార్గవి. ఆమె కళ్లు భయంతో పెద్దవయ్యాయి. చుట్టూ చూసింది. ఇంకా భయం తాలూకు హ్యాంగోవర్ పోలేదు. అదే భయంతో సమీర్‌ను గట్టిగా పట్టుకుంది.
‘్భయపడవలసింది ఏమీ లేదు.. చీకట్లో ఏదో చూసి భయపడి ఉంటావ్’ అన్నాడు.
వ్యాన్ దగ్గరి నుంచి ఆమె ఇంత దూరం ఎందుకు వచ్చిందో అర్థమైంది.
‘నేను ఏదో చూసి భయపడలేదు.. ఒక వ్యక్తిని చూసి భయపడ్డా’ అంది ఇంకా భయపడుతూనే.
‘వ్యక్తిని చూసి భయపడ్డావా? ఎవరిని? అతను ఎలా ఉంటాడు?’ భార్గవి కేక వినడానికి ముందు తాను ల్యాప్‌టాప్‌లో చూసింది గుర్తొచ్చింది అడిగాడు.
‘నేనెప్పుడూ చూడలేదు. పొడవుగా వున్నాడు.. నన్ను చూసి వడివడిగా వెళ్లిపోయాడు.. నేను వెంబడించేలోగా వెనక్కి తిరిగాడు.. ఒకేసారి అతను వెనక్కి తిరగడంతో భయపడి అరిచాను’ చెప్పింది భార్గవి.
‘ఓకె.. ముందు నువ్వు వ్యాన్‌లోకి పద’ అంటూ చుట్టూ చూశాడు. ఎవరూ కనిపించలేదు. భార్గవిని జాగ్రత్తగా వ్యాన్ దగ్గరికి తీసుకెళ్లాడు.
వ్యాన్ దగ్గరికి వెళ్లి అక్కడి దృశ్యం చూసి షాకయ్యాడు.. ల్యాప్‌టాప్ ముక్కలు ముక్కలు అయ్యింది. వ్యాన్ బయటకు వచ్చి చుట్టూ చూశాడు. తరువాత వ్యాన్‌కు ఎదురుగా వున్న చెట్టు వైపు చూశాడు. మెల్లిగా చెట్టు దగ్గరికి వెళ్లి చెట్టుకు ఫిక్స్ చేసిన కెమెరా తీశాడు.
* * *
భార్గవి సమీర్ వైపు చూసింది. ఆమె ఇంకా షాక్‌లో నుంచి కోలుకోలేదు. పైగా వ్యాన్ దగ్గరికి రాగానే ల్యాప్‌టాప్ ముక్కలు అయి ఉండడం...
‘నువ్వు చూసిన వ్యక్తి ఎలా ఉంటాడో గుర్తు చేసుకోగలవా?’ అడిగాడు భార్గవిని సమీర్.
‘వాని మొహం స్పష్టంగా చూడలేదు. కానీ అతను నా దగ్గరకి వచ్చినప్పుడు స్మెల్...’ గుర్తుకు చేసుకుంటూ అంది.
‘డ్రింక్ చేసి ఉన్నాడా?’ అడిగాడు సమీర్.
‘కాదు పెర్‌ఫ్యూమ్ స్మెల్.. చాలా కాస్ట్‌లీ పెర్‌ఫ్యూమ్ అది’ అంది గుర్తుకు చేసుకుంటూ.
సమీర్‌కు చంద్రలేఖ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. వాళ్ల నాన్నను తానెలా గుర్తు పట్టిందో చెప్పిన మాటలు... చంద్రలేఖ తండ్రి ఉపయోగించే పెర్‌ఫ్యూమ్ స్మెల్.
పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్స్ బయటకు పంపించారు.
సమీర్ భార్గవి కానిస్టేబుల్ వహీద్ తప్ప అక్కడ.. ఎవరూ లేరు.
ఆ సెల్ మధ్యలో కుర్చీకి తాళ్లతో కట్టివేయబడి ఉన్నాడు సిఐ దుర్జన్‌కుమార్.
* * *
‘చెప్పండి మిస్టర్ సిఐ దుర్జన్‌కుమార్.. ఏమిటీ కథ..’ తాపీగా అడిగాడు సమీర్.
‘ఎవర్నువ్వు నేనెవరో తెలుసా? ఈ స్టేషన్‌కు సిఐని.. నా స్టేషన్‌లో ననే్న బంధించి బెదిరిస్తావా?’ అని వహీద్ వైపు తిరిగి ‘రేయ్ మెంటల్.. నువ్వేం చేస్తున్నావో తెలుసా? నేను నీ బాస్‌ను.. ముందు కట్లు విప్పి వాడిని లోపల వేసేయ్.. పోలీస్ పొగరు అరువు తెచ్చుకుని అరిచాడు...’
వహీద్ స్ట్ఫిగా సెల్యూట్ చేసి ‘సారీ సర్’ అన్నాడు.
‘లాభం లేదు దుర్జన్. నువ్వు నిజం చెప్పకపోతే నీ స్టేషన్‌లో.. నీ పోలీస్ బెల్ట్‌తోనే నిన్ను టార్చర్ చేయవలసి వస్తుంది’ అంటూ కొక్కానికి వేలాడదీసి వున్న దుర్జన్ ఖాకీ పాయింట్‌కు వున్న తోలు బెల్ట్ బయటకు తీశాడు.
డ్రాయర్ బనియన్‌తో వున్నాడు దుర్జన్‌కుమార్.
‘టార్చర్ చేయడానికి ఒక చేయి చాలు మిస్టర్.. అయినా అన్యాయంగా అమాయకులకు థర్డ్ డిగ్రీ రుచి చూపించడంలో నువ్వు నంబర్ వన్ అట కదా.. నీ మీద ఇప్పటికే బోల్డు కేసులు, కంప్లైంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా చంద్రప్రభను రేప్ చేసిన కేసు.. చంద్రలేఖ మీద అత్యాచారం చేయబోయిన కేసు.. ఆ కుటుంబానికి పిచ్చి ఉందని ప్రచారం చేసి డాక్టర్‌కి లంచం ఇచ్చి రిపోర్టు తారుమారు చేయించిన కేసు...’ చెబుతూ బెల్ట్‌ను గాల్లోకి లేపాడు.
‘నా ఒంటి మీద బెల్ట్ పడితే మా హయ్యర్ అఫీషియల్స్‌కు కంప్లైంట్ చేస్తాను.. నేనెవరో తెలుసా?’ కోపంగా అన్నాడు.
‘అతనెవరో తెలుసా?’ అన్న మాటలు వినిపించాయి...
స్టేషన్‌లోకి ఎంటర్ అయ్యాడు డిసిపి అవినాష్.
‘సర్..’ ఏదో చెప్పబోయాడు సిఐ దుర్జన్‌కుమార్.
‘సమీర్.. సిబిఐ.. ఈ కేసు పరిశోధిస్తున్న స్పెషల్ ఆఫీసర్.. అవసరమైతే ఎన్‌కౌంటర్ చేయడానికి కూడా అతనికి ప్రత్యేక అధికారం ఇవ్వబడింది..’ చెప్పాడు డిసిపి అవినాష్.
సిఐ మొహంలో రక్తపుచుక్క లేదు.
‘నీకు వేరే ఛాయిస్ లేదు... నాకు టైం వేస్ట్ చేయడం అసలు ఇష్టం ఉండదు’ అని డిసిపి హోల్‌స్టర్ వంక చూశాడు.
తన పోలీస్ జీవితంలో మొదటిసారిగా భయమేసింది సిఐ దుర్జన్‌కుమార్‌కు.. ఎందరినో బెదిరించి థర్డ్ డిగ్రీ అంటే వణికిపోయేలా చేసిన అతనికి మొదటిసారి వణుకు పుట్టింది. చాలా కూల్‌గా మాట్లాడుతూనే తనేం చేస్తాడో.. అది చెబుతున్నాడు.
‘ఓకే మిస్టర్ దుర్జన్‌కుమార్ నువ్వెలాగూ నిజం చెప్పేలా లేవు. నిన్ను నేను టార్చర్ చేసేలా లేను.. ఎంతైనా నువ్వు పోలీస్ వాడివే కదా.. ఓకే.. వెళ్లు.. నినె్నలా డీల్ చేయాలో అలాగే చేస్తాను..’ అంటూ వహీద్ వైపు తిరిగి
‘వహీద్ అతడిని వదిలిపెట్టు.. అన్నట్టు చంద్రప్రభకు పిచ్చి కదూ.. అలా అని డాక్టర్ కూడా సర్ట్ఫికెట్ ఇచ్చాడు కదా.. అన్నట్టు ఆ డాక్టర్ ఎక్కడ వహీద్’ అని అడిగాడు.
వహీద్ బయటకు వెళ్లి రెండు నిమిషాల్లో ఆ డాక్టర్‌తో వచ్చాడు.
డాక్టర్ అవతారం చూసి షాకయ్యాడు. అతని శరీరం అంతా రక్తమయం.. నడవలేకపోతున్నాడు.
‘అఫ్‌కోర్స్.. చంద్రప్రభకు పిచ్చి లేదని నీ ప్రోద్బలం వల్లనే నువ్విచ్చిన డబ్బుల వల్లే.. నీకు భయపడి నీ డబ్బులకు ఆశపడి అలా సర్ట్ఫికెట్ ఇచ్చానని చెప్పాడు. అఫ్‌కోర్స్... లిఖితపూర్వక వాంగ్మూలం కూడా ఇచ్చాడు’ అంటూ తన ప్యాంటు జేబులో నుంచి ఓ కాగితం తీసి చూపించాడు.
‘అయినా నాకెందుకో ఈ వాంగ్మూలాన్ని చించేయాలనిపిస్తుంది.. ఎందుకంటావ్ వహీద్?’ వహీద్ వైపు చూసి అడిగాడు.
‘ఎందుకంటే ఏం చెప్పాలి సాబ్.. డాక్టర్ సాబ్‌కు మా సిఐ సాబ్‌కు శిక్ష పడాలంటే కోర్టులో చాలా టైం తీసుకుంటుంది. ఈలోగా బెయిల్ వస్తుంది.. సింపుల్‌గా సిఐ సాబ్‌ను డాక్టర్ సాబ్‌ను షూట్ చేస్తే..’ అని ఆగి సిఐ దుర్జన్ కుమార్ వంక.. సమీర్ వంక చూశాడు.
‘చెప్పు వహీద్.. మన సిఐకి కూడా అర్థం కావాలి కదా.. అయినా ఇలాంటివి మీ సిఐ సాబ్ ఎన్ని చూడలేదు..’ అన్నాడు సమీర్.
‘అంటే ఇప్పుడు చంద్రప్రభ మేడంను పిలిచి ఆవిడ చేతికి రివాల్వర్ ఇచ్చి వీళ్లిద్దరిని షూట్ చేయమని చెబుతారు.. అంతే కదా సాబ్’ అన్నాడు వహీద్.
‘అప్పుడు నేరం చంద్రప్రభ మీదికి వెళ్తుంది కదా వహీద్’ అన్నాడు సమీర్.
‘చంద్రప్రభ మేడం పిచ్చిది కదా సాబ్.. డాక్టర్ సిఐ సాబ్ కూడా చెప్పారు.. పైగా సిఐ సాబ్ రివాల్వర్‌తోనే మేడం చంపుతుంది.. పిచ్చివాళ్లు చంపితే కేసు ఉండదు కదా సర్..’ వహీద్ అన్నాడు.
‘వెరీగుడ్ వహీద్ బాగా క్యాచ్ చేశావు.. మరింకేమిటి వెళ్లి చంద్రప్రభ మేడంను తీసుకురా’ అన్నాడు.
ఇదంతా డిసిపి అవినాష్ ముందే జరుగుతోంది.
సిఐ దుర్జన్ కుమార్ వెన్నులో చలి మొదలైంది. చాలా ప్లాన్డ్‌గా చేస్తున్నారు. తాను చావడం ఖాయం.. ఒక్కటే మార్గం.. అప్రూవర్‌గా మారడం.. బ్రతికుంటే మళ్లీ లూప్ లైన్‌లోకి రావచ్చు..’ అతను పశ్చాత్తాపంతో కాదు.. విధిలేని పరిస్థితిలో రియలైజ్ అయ్యాడు.
అతని మొహంలో కదలికలు సమీర్‌కు అర్థం అవుతున్నాయి.
‘నువ్వు ల్యాప్‌టాప్‌ను ముక్కలు చేశావని తెలుసు మిస్టర్ దుర్జన్‌కుమార్.. చంద్రప్రభ ఇంట్లో.. మూడవ నంబర్ కెమెరా వున్న చంద్రకళ గదిలోకి వెళ్లావు.. నిన్ను పోల్చుకోలేదన్నది నిజం.. నేను గుర్తు పట్టేలోగా నన్ను డైవర్ట్ చేయడానికి మరో డ్రామా ఆడావు.. భార్గవిని బెదిరించడానికి ప్లాన్ చేసావు.. భార్గవిని బెదిరించింది నువ్వు కాదని అర్థం అయ్యింది.. ఎందుకంటే నువ్వు అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే విడిచిపెట్టే మనిషివి కావు.. నేను భార్గవిని వెతికి తీసుకువచ్చేలోగా వ్యాన్ దగ్గరికి వచ్చి ల్యాప్‌టాప్‌ను ధ్వంసం చేశావ్.. కానీ ఆ వ్యాన్‌కు ఎదురుగా చెట్టుకు ఒక సీక్రెట్ కెమెరా ఉందన్న విషయం నీకు తెలియలేదు. ఆ కెమెరాలో నీ ఫేస్ క్లియర్‌గా ఉంది.. ఇప్పుడు చెప్పు.. నిజం చెబుతావా?’ అన్నాడు సమీర్.
‘నిజం చెబుతాను’ ఇంక ఆలోచించి ప్రయోజనం లేదని అర్థమై అన్నాడు.
‘వెరీ గుడ్ చెప్పు’ అని అవినాష్‌కు సైగ చేశాడు.
ఆ గదిలో అతను చెప్పే మాటలు వీడియోలో రికార్డు అవుతున్నాయి.
(ఇంకా ఉంది)