రాష్ట్రీయం

లంక భూముల నోటిఫికేషన్‌పై రైతుల హర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుళ్ళూరు, డిసెంబర్ 6: నెలల తరబడి ఎదురుచూస్తున్న లంక భూముల రైతులకు ప్రభుత్వం నుండి స్పష్టత వచ్చింది. 109 ఎకరాల లంక భూములకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో భూములు అమ్ముకోవాలా? వద్దా అనే సందిగ్ధంలో ఉన్న రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు మండలం రాయపూడి, బోరుపాలెం, లింకాయపాలెం, లంకల్లో రైతులకు పట్ట్భాములు ఉన్నాయి. ఇప్పటి వరకు సిఆర్‌డిఏ నోటిఫికేషన్ జారీ చేయకపోవటంతో పలువురు రైతులు తమ భూములను తక్కువ ధరలకు అమ్ముకుంటున్నారు. నోటిఫికేషన్ జారీ కావటంతో తమ భూములను భూసమీకరణకు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. నెల రోజుల్లోగా భూసమీకరణకు సహకరించాలని 15రోజుల్లోపు అభ్యంతరాలనుకాని సూచనలుగాని తెలియజేయాలని సిఆర్‌డిఎ ఆదేశించింది. ఈ క్రమంలో రాజధానిలో భాగస్వాములు అవుతున్నందుకు లంక భూముల రైతులు సంతోషిస్తున్నారు.