పశ్చిమగోదావరి

-విషాదం నింపిన తిరంగా యాత్ర-

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొగల్తూరు, ఆగస్టు 22: మొగల్తూరు మండలంలో సోమవారం నిర్వహించిన తిరంగా యాత్రలో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతానికి గురై ఒక వ్యాయామోపాధ్యాయుడు మృతిచెందారు. ఈ సమాచారం తెలుసుకున్న పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు షాక్‌కు గురై స్పృహ కోల్పోయారు. చికిత్స అనంతరం వారు కోలుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. మొగల్తూరు మండలం కాళీపట్నం తూర్పు గ్రామంలో సోమవారం ఉదయం 10 గంటలకు నరసాపురం ఎంపి గోకరాజు గంగరాజు నాయకత్వంలో స్థానిక ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు తదితరులు వందలాది బైకులతో తిరంగా యాత్ర నిర్వహించారు. యాత్ర మొగల్తూరు మండలం ముత్యాలపల్లి, మొగల్తూరు, రామన్నపాలెం గ్రామాల మీదుగా సాగేలా నిర్వాహకులు ఏర్పాట్లుచేశారు. మార్గంమధ్యంలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆయా పాఠశాలల ఎదుట ఎంపి గంగరాజు, ఎమ్మెల్యే బండారు మాధవనాయుడుతో జాతీయ జెండాలు ఆవిష్కరింపజేసేలా సన్నాహాలుచేశారు. కొత్తోట, ముత్యాలపల్లి, మొగల్తూరులో విద్యార్థులు జాతీయ పతాకాలను చేతబూని యాత్రకు స్వాగతం పలుకుతున్నారు. తిరంగా యాత్ర రామన్నపాలెం గ్రామంలో ముగిసేలోపు ఆ గ్రామంలోని పిప్పళ్లవారితోట ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఉన్న జెండా స్థూపాన్ని మరోచోట అమర్చి, అక్కడ జాతీయ పతాకాన్ని ఆవిష్కరింపజేయాలనే ఉద్దేశంతో పాఠశాల పిఇటి కురెళ్ల వెంకట పురుషోత్తం (32) మరో ఇనుప రాడ్డుతో పెకలిస్తూ రాడ్డు పైకి లేపగా పైన ఉన్న హైటెన్షన్ విద్యుత్తు వైర్లు తగిలి విద్యుదాఘాతానికి గురై, సంఘటనా స్థలంలో పడిపోయారు. వెంటనే పాఠశాల హెచ్‌ఎం శ్రీరామచంద్రమూర్తి, సహచర ఉపాధ్యాయులు పురుషోత్తంను నరసాపురం వైద్యశాలకు తీసుకువెళ్లగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ వార్త తెలుసుకున్న పాఠశాలలోని నలుగురు విద్యార్థులు స్పృహతప్పి పడిపోయారు. స్థానిక పిహెచ్‌సి వైద్య సిబ్బంది వచ్చి వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఇళ్లకు పంపించివేశారు. భీమవరం డివైఇఒ ఎం సూర్యనారాయణమూర్తి, ఇన్‌ఛార్జి ఎంఇఒ సిహెచ్ ప్రభాకరరావు సమాచారం తెలియగానే ఆ గ్రామానికి వెళ్లి ఆరా తీశారు.
విషయం తెలుసుకున్న వెంటనే యాత్రలో ఉన్న ఎంపి గంగరాజు, ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు తదితర నాయకులు రామన్నపాలెం గ్రామం పిప్పళ్లవారితోట ఉన్నత పాఠశాలకు వచ్చి జరిగిన సంఘటనపై ఆరాతీశారు. తిరంగా యాత్రలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే ప్రయత్నంలో విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయిన పిఇటి ఉపాధ్యాయుడు కుటుంబానికి నరసాపురం ఎంపి గోకరాజు గంగరాజు తక్షణం రూ.5 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. సంతాప సూచకంగా పాఠశాలకు సెలవు ప్రకటించారు. పాఠశాల హెచ్‌ఎం శ్రీరామచంద్రమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొగల్తూరు ఎస్సై డిజె రత్నం కేసు నమోదు చేశారు.