పశ్చిమగోదావరి

50 ఆలయాల్లో ఆన్‌లైన్ సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్వారకాతిరుమల, సెప్టెంబర్ 27: రాష్ట్రంలోని 50 దేవాలయాల్లో ఆన్‌లైన్ ద్వారా భక్తులకు సేవలందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ వైవి అనూరాధ తెలిపారు. ద్వారకాతిరుమల మాధవ కల్యాణ మండపంలో నిర్వహించిన అసిస్టెంట్ కుక్ భర్తీల నిమిత్తం విచ్చేసిన ఆమె విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విజయవాడలోని గొల్లపూడిలో దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయాన్ని త్వరలో ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో భక్తులకు వౌలిక వసతులు కల్పించి పచ్చని పరిశుభ్ర వాతావరణం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె చెప్పారు. దేవాలయాల్లో భక్త్భివన పెంపొందించి యువతను భక్తిమార్గంవైపు నడిపించేలా దేవాలయాలను తీర్చిదిద్దుతున్నట్లు కమిషనర్ తెలిపారు. ఆలయ ప్రాంగణాలను పచ్చదనంతో ఉంచేలా వివిధ రకాల చెట్లను పెంచనున్నట్టు ఆమె చెప్పారు. అనంతరం ఆమె వంట స్వాముల ఎంపికపై నిపుణుల కమిటీ సభ్యులు పద్మజ, డాక్టర్ బబిత, డాక్టర్ శాంతిశ్రీలతో చర్చించి అభ్యర్థుల పనితనాన్ని పరిశీలించి ఎంపిక నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఇవో వేండ్ర త్రినాధరావు పాల్గొన్నారు.