పశ్చిమగోదావరి

పేద బ్రాహ్మణుల సంక్షేమమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఏప్రిల్ 1: సమాజంలోని పేదబ్రాహ్మణుల కుటుంబాలకు చేయూతను అందిస్తూ వారి సంక్షేమానికి కార్యక్రమాలను రూపొందించటమే తమ కార్పోరేషన్ లక్ష్యమని రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టరు చంగవల్లి వెంకట్ తెలిపారు. స్ధానిక శ్రీరామ్‌నగర్‌లోని శ్రీశ్రీ విద్యాసంస్ధలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్రాహ్మణవర్గంలోని విద్యార్ధులకు, మహిళలకు, యువతకు వారి ఆర్ధికపురోభివృద్ధికి పాటుపడతామని చెప్పారు. సొసైటీ ద్వారా అందించే సహకారం తిరిగి చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈసందర్భంగా కార్పోరేషన్ ద్వారా అమలుచేస్తున్న వివిధ పధకాలను ఆయన వివరించారు. రానున్న కొద్దిరోజుల్లో కొన్ని పధకాల పేర్లను కూడా మార్పు చేసే అవకాశం ఉందని చెప్పారు. 11126మంది పేద బ్రాహ్మణులు ఇంతవరకు తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు ఆయన చెప్పారు. 120కోట్ల రూపాయలు పెళ్లిళ్లకు, ఉన్నత విద్యను అభ్యసించడానికి రుణసౌకర్యంగా అందిస్తామని చెప్పారు. క్రెడిట్ సొసైటీలో రుణం పొందాలంటే 600 రూపాయలు చెల్లించి సభ్యులుగా చేరాలని పేర్కొన్నారు. బ్రాహ్మణ సంక్షేమ కార్పోరేషన్‌కు త్వరలోనే టోల్‌ఫ్రీ నెంబర్‌ను కూడా ఏర్పాటుచేస్తామని, ఒక నెలలో ఇది అమలులోకి వస్తుందని చెప్పారు. సమావేశంలో బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ డైరెక్టరు ఎంబిఎస్ శర్మ, అఖిలభారత బ్రాహ్మణ సంఘం నాయకులు కోట శంకరశర్మ, రాష్ట్ర యువత అధ్యక్షులు సూరంపూడి కామేష్ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా చంగవల్లి వెంకట్‌ను శ్రీశ్రీ విద్యాసంస్ధల తరపున సంస్ధ అధినేత ఎంబిఎస్ శర్మ ఘనంగా సత్కరించారు.