పశ్చిమగోదావరి

ఎక్సైజ్ రెవెన్యూ 15 శాతం వృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాగల్లు, అక్టోబర్ 6: రాష్ట్రంలో ఎక్సైజ్ విధానంలో తీసుకొన్న నూతన పద్ధతి వల్ల రెవెన్యూ గతేడాది కంటే 15 శాతం వృద్ధి పొందగలిగామని, లిక్కర్ అమ్మకాలపై వినియోగదారులకు మేలు కలిగేలా పారదర్శకమైన చర్యలు తీసుకొంటున్నట్టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరీస్ కార్పొరేషన్ ఎండి, ఎక్సైజ్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా అన్నారు. గురువారం చాగల్లులోని ఎపిఎస్‌బిసిఐ ఎంఎల్ డిపో పరిశీలనలో భాగంగా డిపోను సందర్శించారు. అనంతరం జరిగిన సమావేశానికి జాయింట్ కమిషనర్ (అడ్మినిస్ట్రేటివ్) చంద్రశేఖర్ నాయుడు అధ్యక్షత వహించి మాట్లాడుతూ జిల్లాలో నాటుసారా నిర్మూలనకు చర్యలు తీసుకున్నామన్నారు. ఎపిఎస్‌బిసిలో 30 మంది ప్రశంసల ధ్రువపత్రాలు పొందటం గర్వకారణమన్నారు. కమిషనర్ మీనా మాట్లాడుతూ డిపో అభివృద్ధికి మేనేజర్ చేపట్టిన చర్యలను ప్రశంసించారు. బీరు నిల్వ చేసేందుకు గొడౌన్ నిర్మాణానికి ప్రతిపాదనలు అందజేస్తే మంజూరు చేస్తానన్నారు. తొలుత డిపో ఆవరణలో రూ. 6 లక్షల నిధులతో నిర్మించిన స్టాకు నిల్వ గొడౌన్లను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మొక్కలు నాటారు. డిపోలోని స్టాకు నిల్వలను ఆయన పరిశీలించారు. లిక్కరు డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జొన్నలగడ్డ సుబ్బారాయచౌదరి కొవ్వూరులో ఎక్సైజ్ సిఐ కార్యాలయ భవనానికి 500 చదరపు గజాల మున్సిపాలిటీ స్థలం డిపార్టుమెంటు కోరిక మేరకు కేటాయిస్తామన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అగ్నిమాపక చర్యలను చేపట్టాలన్నారు. అనంతరం విశిష్ట సేవలందించిన హమాలీలు చింతలపూడి నాగేశ్వరరావు, మట్టా చంటియ్య, గుబ్బల ముసలయ్య, శ్రీరంగం దుర్గారావులను మీనా చేతులమీదుగా సత్కరించారు. అనంతరం సిబ్బంది, హమాలీలు కమిషనర్ మీనాను సత్కరించారు. జాయింట్ కమిషనర్ (డిస్టల్లరీస్) దేవకుమార్, జాయింట్ కమిషనర్ (పరిపాలన) ఎ చంద్రశేఖర్ నాయుడు, ఒఎస్‌డిఎం శ్రీనివాసరావు, డిప్యూటీ కమిషనర్ వైబి భాస్కరరావు, డిపో మేనేజర్ విఆర్‌ఎస్ కృష్ణ, హమాలీల సంఘం, డీలర్ల సంఘం, సేల్స్ రిప్రజెంటేటివ్స్ సంఘం, ఎక్సైజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.