పశ్చిమగోదావరి

పొగాకు రైతులకు 18వేల టన్నుల ఎరువుల సరఫరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరపల్లి, అక్టోబర్ 17: ఎపిలో గల పొగాకు రైతులకు 18వేల టన్నుల ఎరువులను పొగాకు వేలం కేంద్రాల ద్వారా సరఫరా చేస్తున్నామని బోర్డు ఆక్షన్ మేనేజర్ బిఎన్ మిత్ర పేర్కొన్నారు. స్థానిక పొగాకు వేలం కేంద్రంలో సోమవారం రైతులకు ఎరువులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ ప్రస్తుతం 13,700 టన్నుల ఎరువును రైతులకు అందజేసేందుకు సిద్ధంగా ఉంచినట్టు చెప్పారు. మరో పది రోజుల్లో మిగిలిన ఎరువును కూడా సరఫరా చేస్తామన్నారు. రైతులకు కంపెనీ ప్రకటించిన రేట్లకే డిసిఎంఎస్ ద్వారా పొగాకు వేలం కేంద్రానికి చేరతాయన్నారు. రైతు ఎరువు కొనుగోలు చేసిన తర్వాత సబ్సిడీ అందుతుందని, ఆధార్ కార్డు వెంట తెచ్చుకోవాలన్నారు. పొగాకు బోర్డు రీజనల్ మేనేజర్ శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ రైతులు సిటిఆర్‌ఐ, పొగాకు బోర్డు అధికారుల సూచనల మేరకే ఎరువులు వినియోగించాలని, అనవసరం ఎక్కువ ఎరువులు వాడి నష్టపోవద్దన్నారు. డిసిఎంఎస్ ఛైర్మన్ వర్మ మాట్లాడుతూ ఎన్‌ఎల్‌ఎస్ ఏరియాలోగల 5 పొగాకు వేలం కేంద్రాల ద్వారా డిసిఎంఎస్ ద్వారా ఎరువులు అందించనున్నట్టు తెలిపారు. డిసిఎంఎస్ డైరెక్టర్ గద్దే వెంకట్రామారావు, పొగాకు వేలం నిర్వహణాధికారి ప్రసాద్, రైతు నేతలు ఆచంట గోపాలకృష్ణ, యాగంటి సాయిబాబు, అనుసూరి శ్రీనివాసు తదితరులు మాట్లాడారు. దేవరపల్లి పొగాకు వేలం కేంద్రం పరిధిలోగల రైతులకు ఎరువులు అందజేశారు. ఎరువులతోపాటు ఒక్కొక్క కొబ్బరి మొక్కను కూడా పంపిణీ చేశారు.