పశ్చిమగోదావరి

లారీ డ్రైవరును బెదిరించి నగదు అపహరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, అక్టోబర్ 18: పోలీసు కానిస్టేబుల్ పరీక్షలకు సిద్ధమవుతున్న ఇద్దరు యువకులు రెండ్రోజుల క్రితం దారికాచి లారీ డ్రైవర్‌ను పోలీసులమని బెదిరించి డబ్బును అపహరించారు. తమిళనాడుకు చెందిన మర్రిముత్తు దేవదాసు అనే లారీ డ్రైవర్ జూట్ లోడును లారీపై వేసుకుని శ్రీకాకుళం వెళుతున్నాడు. మార్గమధ్యంలో స్థానిక రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల వద్దకు వచ్చే సరికి ఉండి మండలం కలిగొట్ల గ్రామానికి చెందిన శోడదాసి రాకేష్, కృష్ణాజిల్లా ముసునూరు మండలం గుడిపాడు గ్రామానికి చెందిన లాగు బాబూరావులు లారీని నిలుపుదల చేశారు. తాము పోలీసులమని చెప్పి రికార్డు చూపించాలని హడావిడి చేశారు. అయిదు వేల రూపాయలు డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లారీ డ్రైవర్ తన వద్ద డబ్బు లేదని తెలిపే సరికి జేబులు తనిఖీ చేసి అతని వద్ద వున్న రూ. 500 లాక్కుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. లారీ డ్రైవర్ త్రీటౌన్ పోలీసులకు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. త్రీటౌన్ ఎస్‌ఐ ఎం సాగర్ బాబు నిందితులను అరెస్టు చేశారు.

దాళ్వాకు పూర్తి ఆయకట్టుకు నీరివ్వాలి

తాడేపల్లిగూడెం, అక్టోబర్ 18: దాళ్వాకు పూర్తి ఆయకట్టుకు నీరందించి రైతులను ఆదుకోవాలని టిడిపి తాడేపల్లిగూడెం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ ఈలి నాని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం స్థానిక గమిని ఫంక్షన్ హాలులో తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం ఈలి నాని అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఏడు తీర్మానాలు ఆమోదించారు. వాణిజ్య బ్యాంకులు, సహకార సంఘాల ద్వారా జీరో శాతం వడ్డీకి రైతులకు రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కృషిచేయాలన్నారు. ఎల్‌టి లోనుకు 6.5 శాతం వడ్డీ రిబేటు ఇవ్వాలన్నారు. గృహనిర్మాణాలకు రుణాలు అందజేసి మంజూరు చేయాలన్నారు. ఇసుక విధానం మరింత సులభతరంగా ఉండేలా, మరింత చౌకగా ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజాప్రతినిధులు, కార్యకర్తల ద్వారా ప్రజలకు అందించేలా రూపొందించాలన్నారు. పింఛన్లు ఇచ్చే సమయంలో జన్మభూమి కమిటీలు విధిగా హాజరుకావాలని పార్టీ ఆదేశించాలన్నారు. సమావేశంలో పట్టణ అధ్యక్షుడు తాటికాయల వీరన్న, టిడిపి నాయకులు దాసరి అప్పారావు, కోరశిఖ వీరమునేశ్వరరావు, గన్నమని దొరబాబు, పసల అచ్యుతం, కిలాడి ప్రసాద్, పాలూరి వెంకటేశ్వరరావు, బడుగు వెంకటేశ్వరరావు, దాట్ల జగన్నాథరాజు తదితరులు పాల్గొన్నారు.