పశ్చిమగోదావరి

దళారులకు ధాన్యం అమ్మవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లిగూడెం, నవంబర్ 8: రైతులు దళారులకు ధాన్యం అమ్మవద్దని, ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఐకెపి కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించాలని జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం మార్కెట్ యార్డులో ఉన్న ఐకెపి కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ వ్యవసాయ భూముల నుంచి ఐకెపి కేంద్రం వరకూ అయ్యే రవాణా ఖర్చులు, సంచులను ప్రభుత్వం అందజేస్తుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దళారుల మాటలు నమ్మవద్దని ఆయన కోరారు. మూడు రోజుల్లో అమ్మిన ధాన్యానికి సంబంధించి సొమ్ము ఆన్‌లైన్‌లో బ్యాంకు అకౌంట్‌లో పడుతుందన్నారు. అనంతరం పట్టణంలో 17వ వార్డు నరసింహారావుపేట కనకదుర్గ ఆలయం వద్ద జరుగుతున్న సాధికార సర్వేను ఆయన పరిశీలించారు. రూరల్ మండలం కృష్ణాయపాలెంలో జరుగుతున్న సాధికార సర్వేను కూడా పరిశీలించారు. కార్యక్రమాల్లో ఎఎంసి ఛైర్మన్ పాతూరి రాంప్రసాద్ చౌదరి, తహసీల్దార్ పాశం నాగమణి, ఆర్‌ఐ బి దుర్గాప్రసాద్, సిఎస్‌డిటి అల్లాడి రమణ తదితరులు పాల్గొన్నారు.