పశ్చిమగోదావరి

మారుస్తారా... వ్యాపారం ఆపేస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, మార్చి 16: జాతీయ రహదారి, రాష్ట్రీయ రహదారులతో పాటు వాహనాల రద్దీ అధికంగా ఉన్న రహదారుల పక్కన మద్యం దుకాణాలు ఉండరాదంటూ వచ్చిన నిబంధనల మేరకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు మద్యం దుకాణదారులపై కొరడా ఝుళీపిస్తున్నారు. కొత్త నిబంధనల ప్రకారం రహదారులకు 500 మీటర్ల దూరంలో దుకాణాలను ఏర్పాటుచేసుకోవాలని, లేకుంటే వ్యాపారాలు మానుకోవాలని ఆదేశాలు జారీచేశారు. దీంతో వ్యాపారులు నిబంధనల మేరకు దుకాణాలు రద్దీ, రహదారులకు 500 మీటర్లు దూరంగా ఉండాలనే విధానం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావడంతో జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణదారుల నుంచి దుకాణాల మార్పిడికి సంబంధించిన ఒప్పంద పత్రాలు అధికారులు తీసుకుంటున్నారు. భీమవరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం పరిధిలోని జాతీయ రహదారి 165, 214, 214ఎ తదితర జాతీయ రహదారులు, రాష్ట్రీయ రహదారులు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 230 మద్యం దుకాణాలు ఉండగా, 187 దుకాణాలు రహదారికి ఆనుకునే ఉన్నాయని గుర్తించారు. ఈ దుకాణాలన్నింటినీ మార్పుచేసుకోవాలంటూ నోటీసులు జారీ చేశారు.
దుకాణాలు లేక సర్వే నెంబర్లు ఇస్తున్న వ్యాపారులు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం రహదారులకు 500 మీటర్ల దూరంలో దుకాణాలను ఏర్పాటుచేయడానికి వ్యాపారులు అష్టకష్టాలు పడుతున్నారు. దుకాణానికి వెళ్లేందుకు రహదారి ఉండేలా చూసుకొంటున్నారు. రహదారిపై ఉన్న వాటిని దూరంగా మార్చేందుకు భవనాలు దొరక్క కొంత మంది కొత్తగా నిర్మాణాలు చేస్తామంటూ అధికారుల నోటీసులకు సమాధానంగా సర్వే నెంబర్లు ఇస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వ్యాపారులకు కేవలం మూడు మాసాల వ్యవధి మాత్రమే ఉండటంతో కొత్తగా భవనాలు నిర్మించేందుకు సంకోచిస్తున్నారు. గ్రామాల్లో అద్దెకు ఇళ్లు లభించక అవస్థలు పడుతున్నారు. కొత్త మద్యం విధానంలో ఎలాంటి నిబంధనలు వస్తాయోనని, ప్రభుత్వం విధానాలు మార్చేంత వరకు కొంతమంది వేచి చూస్తున్నప్పటికీ తక్షణమే తమకు సమాధానం ఇవ్వాలని అధికారులు ఒత్తిడి తీసుకువస్తున్నారు.
రోడ్డు పై నుంచి సందుల్లోకి..
ప్రస్తుతం రహదారి పక్కన ఉన్న దుకాణాలు రహదారి పై నుంచి ఇరుకుగా ఉండే సందుల్లోకి మార్చేందుకు దుకాణదారులు ముందుకొస్తున్నారు. భీమవరం, పాలకొల్లు, నరసాపురం పట్టణాల్లో ఉన్న మద్యం దుకాణాలు మార్చుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఇందులో భీమవరం, పాలకొల్లుకు బైపాస్‌లు ఉండటంతో ఆ బైపాస్ లెక్కల్లోకి రాకపోవడంతో దుకాణాలు ఆ ప్రాంతాలకు మార్పుచేస్తున్నారు. కాగా మూడు నెలల కోసం ఇన్ని ప్రయాసలు పడాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు.
రెండేళ్లు..రెండు సార్లు
మద్యం దుకాణాల వేలం గతంలో ఒక మారు జరిగింది. అప్పటి నుంచి రెండేళ్ల పాటు మద్యం అమ్మకాలకు దుకాణ యజమానులు అనుమతులను తెచ్చుకున్నారు. ఈ ఏడాది న్యాయస్థానం ఆదేశాల మేరకు దుకాణాలను మార్పుచేస్తున్నారు. అంతే కాకుండా రెండవసారి దుకాణాల వేలం నిర్వహించనున్నారు. ఒక వేళ వేలానికి ఎవ్వరూ స్పందించకపోయినా..ప్రభుత్వం ఆదాయం మాత్రం తగ్గదని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఆర్టీసీ ఆదాయాభివృద్ధికి చర్యలు
ఆర్‌ఎం ధనంజయరావు
ఏలూరు, మార్చి 16 : ఎపి ఎస్ ఆర్‌టిసి ఆదాయం అభివృద్ధి చెందే విధంగా తగు చర్యలు తీసుకున్నామని ఏలూరు రీజనల్ మేనేజర్ ఎస్ ధనంజయరావు తెలిపారు. గురువారం తన కార్యాలయంలో వివిధ యూనియన్ల నాయకులు, డి ఎంలు తదితర సిబ్బందితో వేర్వేరుగా సమీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్ ఎం మాట్లాడుతూ ఆర్‌టిసిని ప్రజలు ఆధరించే విధంగా ప్రతీ ఉద్యోగి, కార్మికుడు వ్యవహరించాలని సూచించారు. సురక్షితమైన ప్రయాణం కోసం ఆర్‌టిసిని ప్రజలు ఆదరించే విధంగా ఉద్యోగులు విధులు నిర్వహించాలన్నారు. బస్సులకు ఎప్పటికప్పుడు మరమ్మత్తులు నిర్వహిస్తున్నామని, పరిశుభ్రత పాటిస్తున్నామని చెప్పారు. సకాలంలో ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చేందుకు సిబ్బంది కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రధాన సెంటర్లలో బస్సులను నిలుపుదల చేసి ప్రయాణీకులను ఆహ్వానించాలని పేర్కొన్నారు. ఆర్‌టిసి బస్టాండ్‌లో ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశామని, టాయిలెట్స్, నిరీక్షించేందుకు ఫర్నీచర్, ఎప్పటికప్పుడు బస్సుల రాకపోకల వివరాలను మైక్ ద్వారా తెలియజేయడం నిర్వహిస్తున్నామన్నారు. గతంలో కంటే పరిశుభ్రతను కూడా మెరుగుపర్చామని పేర్కొన్నారు. డ్రైవర్, కండక్టర్లు అంకితభావంతో పనిచేయాలని చెప్పారు. డ్రైవర్లు ఆయిల్ ఆదాయం వచ్చే విధంగా కండక్టర్లు ప్రయాణీకుల యెడల సత్ప్రవర్తనతో వ్యవహరించాలని సూచించారు. సమావేశంలో ఎన్ ఎంయు నాయకులు ఏ సూర్యచంద్రరావు, బివి రావు, రామకృష్ణ తదితరులున్నారు.