పశ్చిమగోదావరి

పోలవరం నిర్వాసితులకు 27 ఇళ్ల కాలనీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మార్చి 25 : పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని 27 ఇళ్ల కాలనీలను కొత్తగా నిర్మించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాస కార్యక్రమాల అమలు తీరుపై కలెక్టర్ గృహ నిర్మాణ శాఖ పిడి ఇతర అధికారులతో చర్చించారు. పోలవరం ప్రాజెక్టు ముంపు వలన నిర్వాసితులయ్యే 6271 కుటుంబాలకు 27 కొత్త ఇళ్ల కాలనీలను నిర్మించడానికి 430 కోట్ల రూపాయల వ్యయంతో 27 ఇళ్ల కాలనీల్లో వౌలిక వసతులను కల్పించి నిర్వాసితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని ఆదేశించారు. జిల్లాలో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో 19 ఇళ్ల కాలనీలు వేగవంతంగా చేపట్టాలని అదే విధంగా ఐటిడి ఏ ఆధ్వర్యంలోనాలుగు వేల కుటుంబాలకు సంబంధించి 280 కోట్ల రూపాయల వ్యయంతో 8 ఇళ్ల కాలనీలను ఈ సీజన్‌లో పనులు చేపట్టి పూర్తి చేసేలా నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకోవాలని ప్రతీ ఇళ్ల కాలనీలో జరుగుతున్న పనుల ప్రగతిని పరిశీలించి తగు చర్యలు తీసుకునేందుకు వివిధ శాఖల అధికారులను ఆయా కాలనీలకు నియమించడం జరుగుతుందని ప్రతీ కాలనీలో ఒక మెడల్ హౌస్‌ను నిర్మించి అందరికీ చూపాలని ఆ ఇంటి నిర్మాణంలో మార్పులు చేర్పులు చేసుకోదలచుకున్న లబ్ధిదారులు తమ ఇష్టానుసారం పనులు చేయించుకోవచ్చునని ఇందుకు అయ్యే అదనపు వ్యయాన్ని లబ్ధిదారులు భరించుకోవాల్సి వుంటుందని చెప్పారు. ప్రతీ ఇళ్ల కాలనీలో తాగునీరు, రోడ్లు, డ్రైన్లు, విద్యుద్దీకరణ, డంపింగ్ యార్డు, గిరిజన ఉత్పత్తుల విక్రయశాల, గ్రామ పంచాయితీ భవనం, కమ్యూనిటీ హాలు, అంగన్‌వాడీ, పాఠశాల భవనం, చర్చి, దేవాలయం ఖచ్చితంగా ఉండి తీరాలని ఆదేశించారు. ఐటిడి ఏ పివో షాన్ మోహన్ మాట్లాడుతూ పునరావాస కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యతిచ్చామని, నిర్వాసితులు కోరిన మేరకు అనువైన స్థలాలను ఎంపిక చేసి ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో జెసి పి కోటేశ్వరరావు, డి ఆర్‌వో కె హైమావతి, గృహ నిర్మాణ శాఖ పిడి ఇ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.