పశ్చిమగోదావరి

వేసవిలో తాగునీటి ఎద్దడి రానివ్వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఏప్రిల్ 13: వేసవి దృష్ట్యా తాగునీటి ఎద్దడి రానివ్వద్దని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ మున్సిపల్ అధికార్లను ఆదేశించారు. భీమవరం మున్సిపాల్టీని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు మున్సిపల్ ఛైర్మన్ కొటికలపూడి గోవిందరావు, కమిషనర్ సిహెచ్ నాగనర్సింహరావు స్వాగతం పలికారు. కౌన్సిల్ సభ్యులతో కలెక్టర్ మాట్లాడారు. అభివృద్ది ఎలా జరుగుతుందో తెలుసుకున్నారు. పురపాలక సంఘం పురోగతి సాధించాలన్నారు. కమిషనర్ సిహెచ్ నాగనరసింహారావుతో పట్టణ అభివృద్ధి గురించి చర్చించారు. ఏలూరు తర్వాత జిల్లాలో భీమవరం పురపాలక సంఘంలో అత్యధిక నిధులతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో చుట్టుపక్కల గ్రామాలకు నీటిని అందివ్వాల్సిన అవసరముందన్నారు. బైపాస్‌లోని రైల్వేగేటు సమస్య పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఛైర్మన్ చినబాబు కోరారు.

మోడల్ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగుపెట్టాలి
సమీక్షా సమావేశంలో కలెక్టర్ భాస్కర్
ఆకివీడు, ఏప్రిల్ 13: మోడల్ నియోజకవర్గంగా ఎంపికైన ‘ఉండి’ని అభివృద్ధివైపు పరుగులు పెట్టించండని జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ అధికారులకు సూచించారు. స్థానిక ఎఎంసి కార్యాలయంలో గురువారం ఉండి నియోజకవర్గ అభివృద్ధిపై వివిధ శాఖలకు చెందిన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఒక్కో జిల్లాకు ఒక నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా ఎంపిక చేశారన్నారు. నియోజకవర్గంలోని విద్యుత్, మరుగుదొడ్లు, మంచినీరు, పారిశుద్ధ్యం, తాగునీరు, సాగునీరు, రహదారులు తదితర విభాగాల్లో సమస్యలు లేకుండా చూడాల్సిన బాధ్యత ఆయా శాఖల అధికారులపై ఉందన్నారు. వీటి అభివృద్ధికి అవసరమైనన్ని నిధులు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రాధాన్యతాక్రమంలో వీటి అభివృద్ధి పనులు ఏడాదిలో పూర్తయ్యేలా చూడాల్సిన బాధ్యత ఆయా శాఖాధికారులపై ఉందన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధికి బాటలు వేయాలన్నారు. ఎమ్మెల్యే శివరామరాజు మాట్లాడుతూ గ్రామాల్లో పేదరికం లేకుండా ప్రతీ గ్రామాన్ని అభివృద్ధిపరిచేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూపకల్పన చేశారన్నారు. దానిలో భాగంగా నియోజకవర్గంలో 70 గ్రామాల్లో పుంతరోడ్లు, అంగన్‌వాడీ భవనాలు. సబ్ స్టేషన్ల నిర్మాణం, పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ వంటి వాటిని పూర్తిస్థాయిలో ప్రజలకు అందిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్‌లు పడుతున్న శ్రమకు ఫలితం ఉంటుందన్నారు. మోడల్ నియోజకవర్గంగా చేయడానికి దాతల సహకారంతో ముందుకు సాగుదామన్నారు. నియోజకవర్గంలో 400 కిలోమీటర్లు పుంతరోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. వీటిలో 200 కిలోమీటర్లు ప్రతిపాదనలు దశలో ఉన్నాయన్నారు. వీటి నిర్మాణానికి నిధులు సమకూర్చాలన్నారు. దీనిపై కలెక్టర్ భాస్కర్ మాట్లాడుతూ నియోజకవర్గానికి నిధులు ఎంతైనా ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఎఎంసి ఛైర్మన్ మోటుపల్లి ప్రసాద్, సర్పంచ్ గొంట్లా గణపతి, జడ్పీటీసీ మనె్న లలితాదేవి, పిన్నమరాజు వాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.