పశ్చిమగోదావరి

చిన అమిరంలో సంపద సృష్టి కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఏప్రిల్ 10: ఇది చెత్తకాదు.. సంపద సృష్టించే కేంద్రాలని ప్రజలు దీనిపై అవగాహన పెంచుకోవాలని రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. ప్రభుత్వం ఇటువంటి కేంద్రాలను ఏర్పాటుచేసి భవిష్యత్తులో పల్లెలను ప్రగతిపథంలో నడిపించేందుకు సన్నాహాలు చేస్తుందన్నారు. భీమవరం మండలంలోని చినఅమిరం గ్రామంలో సుమారు రూ.20 లక్షలతో సంపద సృష్టించే కేంద్రాన్ని నిర్మించారు. దీని ద్వారా గ్రామాల్లో సేకరించిన తడి, పొడి చెత్తలను ఇక్కడకు తీసుకువచ్చి వేరుచేసి వాటి ద్వారా వానపాములను పెంచి వాటి ద్వారా ఎరువులను తయారుచేస్తారు. వాటిని మొక్కలకు వినియోగించడంతోపాటు రైతులకు కూడా అతి తక్కువ ధరలకు అందివ్వనున్నట్టు తెలిపారు. జిల్లాలో ఇటువంటి కేంద్రం ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసినప్పటికీ చినఅమిరంలో దీన్ని తొలి కేంద్రంగా ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రారంభించారు. రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, గ్రామ సర్పంచ్ బుద్దరాజు అన్నపూర్ణ, ఉప సర్పంచ్ బుద్దరాజు శ్రీనివాసరాజు, జడ్పీ డిప్యూటీ సిఇఒ వై పరదేశీకుమార్ తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో గ్రామీణ ప్రజలు చైతన్యవంతులు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో జిల్లాలోని 48 మండలాల్లో ఈ సంపద సృష్టించే కేంద్రాలు ఏర్పాటుచేసి, ఆ తరువాత ప్రతీ గ్రామాల్లో వీటిని ఏర్పాటుచేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ చెప్పారు. చినఅమిరం గ్రామం జిల్లాకే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఇప్పటికే పారిశుద్ధ్య నిర్వహణ, సిసి రహదారుల నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రెయినేజి ఏర్పాటుచేసి అభివృద్ధిలో ముందుందన్నారు. ఈ సందర్భంగా గ్రామ ఉప సర్పంచ్ బుద్దరాజు శ్రీనివాసరాజు చేస్తున్న సేవలను గుర్తించి ఎంపి, ఎమ్మెల్యే, కలెక్టర్‌లు అభినందించారు.