పశ్చిమగోదావరి

పేదల సంక్షేమమే చంద్రబాబు లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, సెప్టెంబర్ 21: చంద్రబాబు ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు చేరుతున్నాయని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. గురువారం భీమవరంలో ఆమె విలేఖరులతో మాట్లాడుతూ ఇంటింటికీ టిడిపిలో భాగంగా జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో తాను పర్యటిస్తున్నానని తెలిపారు. ప్రతీ ఇంటి తలుపు తట్టి ఏం కావాలో అడుగుతుంటే భిన్నమైన సమాధానాలు వినిపించాయన్నారు. ఒక్కసారిగా తాను ఆశ్చర్యానికి గురయ్యాన్నారు. తాను ఇప్పటివరకు పర్యటించిన ప్రాంతాల్లో ఏం కావాలో అడిగేవారే కనిపించలేదన్నారు. జిల్లాలోని ఉంగుటూరు, తణుకు, నరసాపురం నియోజకవర్గంతో పాటు భీమవరం, ఏలూరు, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పర్యటించానని తెలిపారు. ఇంటింటికి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద ప్రజల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి అడుగుతున్నాం, ఏమైనా అందకపోతే ఫిర్యాదు చెయ్యవచ్చునని మరీ చెబుతున్నాం. కానీ గృహిణుల నుంచి ఒక్కటే స్పందన, సిఎం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తరఫున అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలను అందుకుంటున్నామని పదేపదే చెబుతున్నారని, ఇది చాలా సంతోషంగా ఉందన్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ కార్యక్రమాలు ప్రతీ ఇంటికి చేరుకున్నాయని వెల్లడించారు. పింఛన్లు, రేషన్‌కార్డులు అన్నీ ఉన్నాయని చెప్పడంతో ఆనందానికి అవధుల్లేవన్నారు. దీనిని బట్టి తమ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తోందని స్పష్టమైందన్నారు. కేవలం కొన్ని ప్రాంతాల్లో రహదారులు కావాలని కోరారని, వెంటనే ఆ సమస్యను ఎమ్మెల్యేల దృష్టికి తీసుకువెళ్ళామని చెప్పారు. ఇంకా ఇళ్ళు లేని నిరుపేదలు ఉన్నారని, వారందరికి తెలుగుదేశం ప్రభుత్వం ఇళ్ళు ఇస్తుందన్నారు. జిల్లాలోని 1200 ప్రాంతాల్లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం పూర్తిచేసేందుకు ఎమ్మెల్యేలందరూ నడుం బిగించారని, ప్రస్తుతం ఇప్పటివరకు 260 గ్రామాలు/వార్డుల్లో పూర్తిచేశామని ఎంపీ తోట సీతారామలక్ష్మి తెలిపారు.
భూవివాదాల్లో సామూహిక దౌర్జన్యాలు, చొరబాట్లు సహించేది లేదు
*పోలవరం డిఎస్పీ రవికుమార్
బుట్టాయగూడెం, సెప్టెంబర్ 21: భూవివాదాల్లో సామూహిక దౌర్జన్యాలు, చొరబాటులను ఉపేక్షించేది లేదని పోలవరం డిఎస్పీ ఎ.రవికుమార్ స్పష్టం చేశారు. బుట్టాయగూడెం పోలీసుస్టేషన్‌ను గురువారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ భూవివాదాలపై రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి, పరిష్కార చర్యలు తీసుకోవాలని కోరారు. భూవివాదాలు తలెత్తినపుడు ఇరువర్గాల భూరికార్డులను పరిశీలించి, చట్టాలకు లోబడి, న్యాయమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. నిర్వాసితులకు అమలవుతున్న ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి భూవివాదాలు విఘాతం కలిగించే అవకాశం ఉన్నందున, వివాదాలు ఉత్పన్నం కాకుండా చూడాలని సూచించారు. భూవివాదాల్లో దౌర్జన్యాలకు దిగకుండా, పంటలు నాశనం చేయకుండా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని చెప్పారు. వివాదాల్లో అసలైన భూయజమానులను గుర్తించడంలో రెవెన్యూ యంత్రాంగం చురుకుగా వ్యవహరించాలని అన్నారు. భూవివాదాల్లో దళారుల ప్రమేయంపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక ఎస్సై జి.కాళీచరణ్ కూడా ఉన్నారు.
టిడిపి అంటే ప్రజా ప్రభుత్వం

ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్
ఏలూరు, సెప్టెంబర్ 21 : తెలుగుదేశం పార్టీ విధానం ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక అని రాష్ట్ర ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేశారు. గురువారం పెదపాడు మండలం నాయుడుగూడెం, వీరమ్మకుంట గ్రామాల్లో పాదయాత్రలు నిర్వహించి ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను నేరుగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి, ప్రగతిని వివరించి తమ గ్రామాలకు ప్రభుత్వం నుంచి ఇంకా ఏ విధమైన సేవలు కోరుకుంటున్నారని ప్రశ్నించారు. పలువురు సమాధానమిస్తూ ఇళ్లు, ఇళ్ల స్థలాలు కావాలని, పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు. 2018లో పెన్షన్లు మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారని ఆయన ప్రకటించారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక జరిగిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రానున్న ఎన్నికల్లో కూడా తెలుగుదేశానికే పట్టం కట్టాలని కోరారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్న ప్రభుత్వాన్ని ఆదరించడం ప్రతీ పౌరుడి ధర్మమని అన్నారు. రాష్ట్రం ఎంతో ఆర్ధిక ఇబ్బందుల్లో వున్నప్పటికీ 200 రూపాయలు పెన్షన్‌ను వెయ్యి రూపాయలు చేయడం, వ్యవసాయ రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అమలు చేయడం, సంక్షేమ కార్యక్రమాలు సమర్ధవంతంగా ముందుకు తీసుకువెళ్లడం, మరోవైపు పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని నిర్మాణాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా ప్రజలు ముక్తకంఠంతో టిడిపికే తమ మద్దతంటూ చింతమనేనిని ఉత్సాహ పరిచారు. కార్యక్రమంలో దెందులూరు, ఏలూరు, పెదవేగి, పెదపాడు మండలాలకు చెందిన జడ్పీటిసిలు, ఎంపిపిలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాడవాడలా చింతమనేనికి ప్రజలు పూలమాలలతో, తీన్‌మార్ వాయిద్యాలతో బ్రహ్మరధం పట్టారు.