పశ్చిమగోదావరి

మహాత్ముని ఆశయాలు దేశానికి శ్రీరామరక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, డిసెంబర్ 12: మహాత్మా గాంధీ ఆశయాలు దేశానికి శ్రీరామరక్ష అని గాంధీ మనుమరాలు ఉషాగోకాని గాంధీ పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు ఆయన ఆశయాలకు ప్రభావితులయ్యాయన్నారు. శాంతి, సహనంతో స్వాతంత్య్రం సాధించి మహాత్ముడు కన్న కలలు నెరవేర్చవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా శనివారం భీమవరం విచ్చేసిన ఆమెకు సర్వోదయ మండలి, వసుధా ఫౌండేషన్, విజ్ఞాన వేదికల సంయుక్త ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డిఎన్నార్ కళాశాల ఆడిటోరియంలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా నేటి యువత నిర్వీర్య వ్యవస్థలో ఉన్నారని, యువత జాతీయ భావాలతో దేశ సమగ్రతకు, పటిష్టతకు పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ పర్యటనలో ఆంధ్రుల ఆదరాభిమానాలు చూశానని, ఆంధ్రుల్లో ఉన్న ఐక్యత సమైక్యభావాలు మిగిలిన వారికి ఆదర్శమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డిఎన్నార్ కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు గోకరాజు వెంకట నర్సింహరాజు, గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు)లు ఉషాగోకాని గాంధీని ఘనంగా సత్కరించారు. డాక్టర్ రత్న, భీమవరం క్యాన్సర్ హాస్పటల్ వ్యవస్థాపకులు డాక్టర్ ఎంఆర్‌కె రాజు, వసుధా కృష్ణంరాజు, ప్రముఖ నేత్ర వైద్యుడు యువి రమణరాజు, కన్వీనర్ ఇందుకూరి ప్రసాదరాజులు ప్రసంగించారు. అనంతరం ప్రతిభావంతులకు స్కాలర్ షిప్‌లు పంపిణీ చేశారు. డాక్టర్ ఎం గోవింద్‌బాబు, కళాశాల ఉపాధ్యక్షులు రామకృష్ణంరాజు, సభ్యులు చెరుకువాడ సుబ్రమణ్యంరాజు, కొత్తపల్లి శివరామరాజు, ప్రిన్సిపాల్ పి రామకృష్ణంరాజు, డాక్టర్ యు రంగరాజు, విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి తదితరులు పాల్గొన్నారు.
అయిభీమవర ం వేదపాఠశాలను పరిశీలించిన డిఎస్పీ
ఆకివీడు, డిసెంబర్ 12: మండలంలోని అయి భీమవరం గ్రామంలో రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీ పర్యటన ఉంటుందనే సమాచారం రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నెల 20న అయి భీమవరం గ్రామంలో టిటిడి ఆధ్వర్యంలో నిర్మించిన వేద పాఠశాలను రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీ చేతులమీదుగా ప్రారంభించనున్నారని సమాచారం. ఈ మేరకు నరసాపురం డిఎస్పీ అమర్‌నాథ్‌నాయుడు ఆయాప్రాంతాలను శనివారం పరిశీలించారు. ఉప్పుటేరు బ్రిడ్జి నుండి మందపాడు రోడ్డు, అయి భీమవరం రహదారులను పరిశీలించారు. అయి భీమవరం, అయి భీమవరం రోడ్డులో గతంలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ ప్రాంతాలను డిఎస్పీ పరిశీలించారు. వేద పాఠశాల ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించారు. భీమవరం టూటౌన్ సిఐ రమేష్, ఆకివీడు ఎస్సై కడియాల అశోక్‌కుమార్, ఉండి ఎస్సై రవివర్మ తదితరులు ఉన్నారు.
రేపటి నుండి బాపు జయంతి వేడుకలు
నరసాపురం, డిసెంబర్ 12: ప్రముఖ దర్శకుడు, చిత్రకారుడు పద్మశ్రీ బాపు జయంతి వేడుకలు ఈ నెల 14, 15 తేదీలలో పట్టణంలో ఘనంగా నిర్వహించనున్నట్టు నరసాపురం శాసనసభ్యులు బండారు మాధవనాయుడు చెప్పారు. శనివారం సాయంత్రం సబ్ కలెక్టర్ దినేష్ కుమార్‌తో కలసి స్థానిక లలితాఘాట్ వద్ద బాపు జయంతి వేడుకల ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. ఈ వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తొందన్నారు. ప్రపంచ ఖ్యాతిపొందిన పద్మశ్రీ బాపు పట్టణానికి చెందినవారు కావడం గర్వకాణమన్నారు. రెండు రోజులు సభలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, కేంద్రమాజీ మంత్రి యువి కృష్ణంరాజు తదితరులు హాజరవుతారన్నారు.సబ్ కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ బాపు జయంతి వేడుకలను అధికారులు సమర్ధవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ రాయుడు శ్రీరాములు, పశ్చిమ డెల్టా ప్రాజెక్టు ఛైర్మన్ పొత్తూరి రామరాజు, టిడిపి నాయకులు బండారు పటేల్ రాజానాయుడు, రెడ్డప్ప ధవేజీ తదితరులు పాల్గొన్నారు.
ద్వారకాతిరుమలలో పోటెత్తిన భక్తులు
ద్వారకాతిరుమల, డిసెంబర్ 12: చిన్న తిరుపతి క్షేత్రం శనివారం భక్తులతో పోటెత్తింది. శ్రీవారికి ప్రీతికరమైన రోజు కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. పలు ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు ఆలయానికి తరలివచ్చారు. తెల్లవారుఝాము నుండి యాత్రికులతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. సుమారు 20వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించినట్టు ఆలయ ఇవో వేండ్ర త్రినాధరావు తెలిపారు. ఇందులో 6,866 మంది స్వామివారికి తల నీలాలు సమర్పించినట్టు ఆయన చెప్పారు. 38,747 లడ్డూ ప్రసాదాలు, 16,615 పులిహోర ప్యాకెట్లు, 7570 చక్ర పొంగలి ప్యాకెట్లు విక్రయించినట్టు తెలిపారు. సుమారు 6వేల మందికి పైగా స్వామివారి ఉచిత అన్న ప్రసాదాన్ని స్వీకరించినట్టు ఇవో వేండ్ర తెలిపారు.