పశ్చిమగోదావరి

అనుకున్న సమయానికే వచ్చి... అయదు గంటలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, డిసెంబర్ 11: పోలవారంలో భాగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పరిశీలనకు సోమవారం ఇక్కడకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సుమారు ఐదు గంటలపాటు నిర్మాణ ప్రాంతంలో గడిపారు. ముందుగా ప్రకటించిన విధంగానే ఉదయం 11.50 గంటలకు ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్న ముఖ్యమంత్రి ముందుగా హెలికాఫ్టర్‌లో నిర్మాణ పనులను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం హెలీప్యాడ్ వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి ఏలూరు ఎంపి మాగంటి బాబు, పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. అక్కడినుండి ప్రాజెక్టు వ్యూ పాయింట్‌కు చేరుకున్న ఆయన నిర్మాణ పనులను పరిశీలించారు. రోడ్డు మార్గం ద్వారా డయాఫ్రం వాల్ నిర్మాణ ప్రాంతానికి చేరుకున్న ముఖ్యమంత్రికి నిర్మాణ ప్రగతిని ఇంజనీర్లు మ్యాప్ ద్వారా వివరించారు. డయాఫ్రం వాల్ నిర్మాణ ప్రాంతం నుండి నడుచుకుంటూ గోదావరి నది ఒడ్డుకు చేరుకున్న ముఖ్యమంత్రికి నదిలో డయాఫ్రం వాల్ ఏ విధంగా నిర్మిస్తారో ఇంజనీర్లు వివరించారు. అనంతరం స్పిల్ వే నిర్మాణ ప్రాంతానికి చేరుకుని, అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. అక్కడే మీడియాతో సుమారు 40 నిముషాలు మాట్లాడిన ముఖ్యమంత్రి అనంతరం డ్యాం దిగువన నిర్మిస్తున్న కాఫర్ డ్యాం నిర్మాణ పనులను పరిశీలించారు. ఆ తర్వాత గేట్ల తయారీ కేంద్రం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి జనవరి 20 నాటికి స్పిల్‌వేలో ఒక గేటు అమర్చాలని తయారుచేస్తున్న బేకమ్ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. అనంతరం కాంట్రాక్టు ఏజెన్సీ కార్యాలయంలో అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు హెలికాఫ్టర్‌లో విజయవాడ బయలుదేరి వెళ్లారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్, ఎస్పీ రవిప్రకాష్, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ జడ్పీ ఛైర్మన్ కె జయరాజు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, ఎమ్మెల్యేలు ముప్పిడి వెంకటేశ్వరరావు, నిమ్మల రామానాయుడు తదితరులు ఈ పర్యటనలో పాల్గొన్నారు.

నిడదవోలు ఆర్వోబీ నిర్మాణానికి ఉత్తర్వులు
నిడదవోలు, డిసెంబర్ 11: నిడదవోలు పరిసర గ్రామాల ప్రజల చిరకాల కోరిక అయిన రైల్వేగేట్ వద్ద ఆర్వోబీ నిర్మాణానికి అడ్డంకులు తొలిగాయి. ఎన్నో సంవత్సరాలుగా పాలకులు ఎన్నికల ముందు నిడదవోలులో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక మర్చిపోయేవారు. అదే విధంగా 2014 ఎన్నికల్లో నిడదవోలు నియోజకవర్గ ప్రజలకు ఆర్వోబీ నిర్మిస్తామని హామీ ఇచ్చిన రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్, నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావులు ప్రతి సభ, పలు కార్యక్రమాల్లోనూ తమ పదవీ కాలం ముగిసేలోగా ఆర్వోబీకి శంకుస్థాపన చేస్తామని చెబుతూ వచ్చారు. ఎమ్మెల్యే శేషారావు మాత్రం తన పదవీకాలంలో శంకుస్థాపన చేయకుంటే రాజకీయ సన్యాసం చేస్తానని శపథం కూడా చేశారు. సోమవారం సాయంత్రం తాడేపల్లిగూడెం వెళ్లే రైల్వే గేటు వద్ద (గూడెం గేట్ వద్ద) విలేఖర్ల సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే బూరుగుపల్లి మాట్లాడుతూ ఆర్వోబీ నిర్మాణానికి రూ.201 కోట్లతో నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తూ జీఓ 465ను విడుదల చేసినట్టు ఆయన తెలిపారు. తొలి దఫాలో రూ.21కోట్లతోను, రెండవ దఫాలో రూ.180 కోట్లతో పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ శంకుస్థాపన రానున్న వేసవిలో చేపడతామని, ఆ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబునాయుడు, ఆర్‌అండ్‌బీ మంత్రి సిద్దా రాఘవరావు చేతుల మీదుగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే బూరుగుపల్లి తెలిపారు. నిడదవోలు ప్రజల చిరకాల స్వప్నమైన ఆర్వోబీ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలపడంతో పట్టణ, పరిసర గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ బొబ్బా కృష్ణమూర్తి, శశి సంస్థల అధినేత బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ కొమ్మిన వెంకటేశ్వరరావు, బయ్యే వెంకట్రావు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు గూడపాటి వెంకట్రావు, టీడీపీ మండల శాఖ అధ్యక్షుడు మారిశెట్టి వీరవెంకట సత్యనారాయణ, తిరుపతి సత్యనారాయణ, ఆనందం వెంకటేశ్వర్లు, షేక్ లాల్ బహుదూర్, టీడీపీ శ్రేణులు, నిడదవోలు పట్టణ ప్రజలు పాల్గొన్నారు.