పశ్చిమగోదావరి

ప్రపంచ తెలుగు మహాసభలకు రంగరాజు కార్టూన్లు ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉండి, డిసెంబర్ 13: ఈ నెల 15 నుండి హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు సందర్భంగా ప్రదర్శించబోయే కార్టూన్లకు ఉండికి చెందిన రచయిత, సాహితీవేత్త గాదిరాజు రంగరాజు రూపొందించిన మూడు కార్టూన్లు ఎంపికైనట్టు నిర్వాహకుల నుండి సమాచారం అందింది. ఎంపికైన కార్టూన్లకు వెయ్యి రూపాయలు నగదుతో పాటు పురస్కారం కూడా లభించనుందన్నారు. నేటికీ ఇంగ్లీష్ భాష మధ్య మాతృభాష నలిగిపోతోందని స్ఫురణకు వచ్చే మూడు కార్టూన్లను ఆయన వేశారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో తన కార్టూన్ల ప్రదర్శనకు అనుమతి రావటం పట్ల రంగరాజు ఆనందం వ్యక్తంచేశారు.

రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి చర్యలు
-కార్మిక శాఖ మంత్రి పితాని
యలమంచిలి, డిసెంబర్ 13: నూతన సాంకేతిక విధానం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ఐటి రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నామని రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ, ఉపాధి కల్పనా శాఖ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. 18 రోజుల విదేశీ పర్యటన ముగించుకుని బుధవారం సాయంత్రం పోడూరు మండలం కొమ్ము చిక్కాల చేరుకున్న ఆయన స్వగృహంలో విలేఖర్లతో మాట్లాడారు. తాను అమెరికాలోని నాలుగు రాష్ట్రాల్లో పర్యటించానని, ప్రధానంగా అమెరికాలో భారతీయులు ఐటి రంగంలో అనేక సంస్థలు నెలకొల్పారని, 650 ఐటి సంస్థలతో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో తాను పాల్గొని ఐటి రంగం అభివృద్ధిపై చర్చించినట్టు చెప్పారు. అమెరికాలో తెలుగువారికి ఐటి రంగంలో అనేక ఉద్యోగాలు లభించడంపట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆమెరికాకు సంబందించి హెచ్1బి ఉద్యోగ వీసాపై ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయని, ఆ సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో చర్చించి, ప్రధాని నరేంద్ర మోదీ ద్వారా ట్రంప్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, నాయకులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి అభినందించారు. కార్యక్రమంలో పోడూరు ఎంపీడీవో కాత్యాయని ప్రసన్న, పెనుగొండ ఏఎంసీ ఛైర్మన్ సానబోయిన గోపాలకృష్ణ, డీసీసీబీ వైస్ ఛైర్మన్ కండిబోయిన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

రైతులకు ఏ లోటూ రానివ్వద్దు
ఏలూరు, డిసెంబర్ 13: రైతుసంక్షేమమే ప్రధాన ధ్యేయంగా గుర్తించి రైతుల విషయంలో నిధులు లేవని, ఈ పని జరగదనే మాట ఏ అధికారి నోటి నుండి రాకూడదని జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ అన్నారు. స్ధానిక కలెక్టరేట్‌లో బుధవారం ప్రాధమికరంగ మిషన్స్‌పై వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, పట్టుపరిశ్రమ, మార్కెటింగ్, మత్స్య శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో రైతుల సమస్యలను పరిష్కరిస్తూ వారికి ఏలోటు రాకుండా అన్నిచర్యలు తీసుకోవాలన్నారు. రైతాంగానికి అవసరమైన అన్ని అవసరాలను తీర్చిదిశగా అయా రంగాల అధికారులు పనిచేయాలన్నారు. జిల్లాలో భూసారపరీక్షలకు సంబంధించి 73582 మంది రైతులకు సంబంధించి వారి ఆధార్ నెంబరు, ఇతర వివరాలు సమగ్ర సమాచారాన్ని స్ధానిక వ్యవసాయాధికారి, ఎంఇఎఓల వారీగా జాబితాలను సిద్ధం చేసి వారి ద్వారా మట్టి నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపాలన్నారు. ఇందుకు జిల్లాలో ఉన్న మూడు ప్రధాన భూసారపరీక్షా ప్రయోగశాలల్లో ఉండాల్సిన అన్ని రసాయనాలు, ఇతర పరికరాలను సిద్ధంగా ఉంచాలన్నారు. వ్యవసాయానికి సాంకేతికతను జోడించి సాగుసంక్షోభాన్ని నివారించడమే లక్ష్యంగా నూరుశాతం వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా జిల్లాలో పెద్దఎత్తున వ్యవసాయ ఆధునీకరణ యంత్రాలు అందించేందుకు 20శాతం ప్రభుత్వ సబ్సిడీ కొరకు రూ. 25.60కోట్లను కోరుతూ వ్యవసాయ కమిషనర్‌కు పంపిన ప్రతిపాదనలు త్వరితగతిన ఆమోదం పొందేందుకు చర్యలు తీసుకోవాలని ఆశాఖ జెడిని కలెక్టరు ఆదేశించారు. ప్రకృతి వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహించే దిశగా సంబంధిత అధికారులకు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలలో ఎఫ్‌పిఓలుగా నియమించినవారిని వారు ఏడాది పొడవునా వారు నిర్వర్తించే కార్యక్రమాలను నిర్దేశించే కార్యాచరణ రూపొందించాలన్నారు. పాడిపరిశ్రమాభివృద్ధిలో భాగంగా పశుగ్రాస క్షేత్రలేర్పాటుకు ప్రత్యేకచొరవ తీసుకోవాలన్నారు. దీనిలోభాగంగా 5వేల ఎకరాల్లో పశుగ్రాస క్షేత్రాలు ఏర్పాటుచేయాలని లక్ష్యం కాగా ఇందులో 50శాతం పూర్తి చేశారని, మిగిలినది కూడా త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. జిల్లాలో ఆక్వాజోన్ రీవెరిఫికేషన్ ప్రక్రియను వచ్చేవారం నాటికి పూర్తిచేయాలని మత్స్యశాఖాధికారులను ఆదేశించారు. ఏలూరులోని మత్స్యశాఖ కార్యాలయం వద్ద ఏర్పాటుచేయనున్న మోడల్‌ఫిష్ రిటైల్ కియోస్కోను నెలాఖరులోపు పూర్తిచేసి జనవరి, ఫిబ్రవరి నెలల్లో ప్రాజెక్టుగా విక్రయాలను పరిశీలించి అనంతరం జిల్లాలోని మిగిలిన 9పట్టణాల్లో ఇదే మాదిరి ఏర్పాటుచేయాలని, అక్కడ కూడా స్పందన వస్తే జిల్లావ్యాప్తంగా మిగిలిన ప్రాంతాల్లో ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. బియ్యపుతిప్ప ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటికే పూర్తయిన 12 మినీ రైతుబజార్లను డిసెంబర్ నెలాఖరునాటికి ప్రారంభించాలన్నారు. జాయింట్ కలెక్టరు-2 ఎంహెచ్ షరీఫ్ మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి వచ్చే ఆర్ధికసంవత్సరంలో కార్యక్రమాల కార్యాచరణ ప్రణాళికను ఫిబ్రవరి నెలాఖరునాటికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే జనవరి 2వ తేదీ నుండి 10వరకు నిర్వహించే జన్మభూమి కార్యక్రమానికి సంబంధించి వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులు జిల్లా నివేదికలను సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో వ్యవసాయశాఖ జెడి గౌసియాబేగం, సిపిఓ బాలకృష్ణ, మార్క్‌ఫెడ్ డిఎం నాగమల్లిక తదితరులు పాల్గొన్నారు.

జనవరిలో జిల్లాకు స్వచ్ఛ సర్వేక్షణ్ బృందం
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, డిసెంబర్ 13: దేశంలోని నగరాలు.. పట్టణాలు సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్-2018కి సమయం దగ్గరపడింది. వచ్చే జనవరి మాసంలో జిల్లాకు స్వచ్ఛ సర్వేక్షణ్ బృందం రానుంది. ఈ బృందం జిల్లాలోని అన్ని పురపాలక సంఘాల్లో పర్యటిస్తుంది. ఆ బృందం పర్యటనలో 1400 మార్కులకు కేటాయించిన ప్రజాభాగస్వామ్యంతో సేవల్లో నాణ్యత, 1200 మార్కులకు కేటాయించిన ప్రత్యక్ష పరిశీలన, 1400 మార్కులకు కేటాయించిన ప్రజాభిప్రాయంను పరిశీలించి మార్కులు ఇస్తుంది. ఈ బృందం ఇచ్చిన మార్కుల ఆధారంగా జాతీయ స్థాయిలో ర్యాంకులు కేటాయిస్తారు. గత ఏడాది నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భీమవరం పట్టణానికి జాతీయ స్థాయిలో 87వ ర్యాంకు రాగా మిలిగిన అమృత్ పట్టణాలుగా ఉన్న ఏలూరు, తాడేపల్లిగూడెంకు ర్యాంకులు వచ్చాయి.
మున్సిపాల్టీల పరుగు
2017 స్వచ్ఛ సర్వేక్షణ్‌లో కేవలం నగరాలు, పట్టణాలు అదీ కూడా కేవలం అమృత్ పట్టణాలకే ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో ఆ పట్టణాలు మాత్రమే స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో పాల్గొన్నాయి. ఈసారి దేశంలోని అన్ని నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీలు స్వచ్ఛ సర్వేక్షణ్‌లో పాల్గొనాలని కేంద్రం ప్రకటించింది. దీంతో దేశంలో అన్ని స్థాయిల్లో ఉన్న నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీలు పోటీల్లో నిలిచాయి. 2017లో ఆంధ్రప్రదేశ్‌కు ర్యాంకుల పంట పండింది. దీంతో దేశ స్థాయిలో ఏపీకి పేరు ప్రఖ్యాతులు కూడా పెరిగాయి. ఈసారి కూడా మంచి ర్యాంకు సాధించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆదేశించారు. దీంతో కమిషనర్లంతా మంచి ర్యాంకు సాధించేందుకు పరుగులు తీస్తున్నారు. సంపూర్ణ పారిశుద్ధ్య నిర్వహణ, బహిరంగ మలమూత్ర విసర్జన నివారణ, పురసేవ యాప్, పట్టణం సుందరీకరణ, ప్రజల భాగస్వామ్యంపై ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలు అధికారులు చేపడుతున్నారు. ప్రతీ రోజు ఉదయానే్న పారిశుద్ధ్య నిర్వహణ అంటే ఇంటింటికీ వెళ్ళి చెత్త సేకరించడం, ఆ చెత్తను రీసైక్లింగ్ చేయడం, తడి పొడి చెత్తను వేరు చేయడం, దాన్ని తరలించడం, స్వచ్ఛ భారత్‌లో భాగంగా నిర్మించిన మరుగుదొడ్ల ఉపయోగం, సుందరీకరణ, మొక్కలు నాటడం తదితర కార్యక్రమాలను వేగంగా చేస్తున్నారు. ఇక ప్రజలకు ప్రభుత్వం ఏం చేస్తుంది, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండటం, పాలకులు ప్రజల కోసం ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో కూడా అవగాహన కల్పిస్తున్నారు. వార్డుల్లోకి వెళ్ళి ఇంటింటికి ప్రచార కార్యక్రమాలను విజయవంతంగా చేస్తున్నారు. ఈ పనులను పూర్తి చేసుకుని విద్యార్థి పరీక్షలకు వెళ్ళినట్లుగా మున్సిపాల్టీలు పరీక్షలకు సిద్ధంగా ఉన్నాయి. జనవరి మాసంలో స్వచ్ఛ సర్వేక్షణ్ బృందాలు పరిశీలించి ర్యాంకులు ఇవ్వడమే ఆలస్యం.
పర్యావరణ హిత సమాజానికి కృషి చేయాలి
ఏలూరు, డిసెంబర్ 13 : ఆరోగ్యకరమైన, పర్యావరణహిత సమాజ ఆవిర్భావానికి ప్రతీ ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ అన్నారు. స్థానిక సెయింట్ థెరిస్సా కళాశాల వద్ద బుధవారం ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం, సిహెచ్‌ఎస్‌డి థెరిస్సా మహిళా కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఓడీఎఫ్ (బహిరంగ మల విసర్జన రహితం) పై నిర్వహించిన అవగాహనా ర్యాలీని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్, ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ ముత్యాలనాయుడుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ నీరులేని, అభివృద్ధి చెందని పేద దేశాల్లో సైతం బహిరంగ మల విసర్జన అనేది కనపడడంలేదన్నారు. నాగరికత పెరిగి అభివృద్ధి చెందుతున్న మనదేశంలో ఇంకా బహిరంగ మల విసర్జన ఉండడం సభ్యసమాజం హర్షించదగినది కాదన్నారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ముత్యాలనాయుడు మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి ఆరోగ్యకరమైన వాతావరనాన్ని కల్పించడంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. బహిరంగ మల విర్జన రహిత సమాజాభివృద్ధికి ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ పరిధిలోని అన్ని కళాశాలల్లోని ఎన్‌సిసి, ఎన్‌ఎస్ ఎస్ యూనిట్లతోపాటు విద్యార్ధులు, అధ్యాపక బృందం కృషిచేస్తాయని చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్సీ రాము సూర్యారావు, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లా ల ఎన్‌సీసీ కో-ఆర్డినేటర్ ఎన్ కిరణ్ చంద్ర, కళాశాల ప్రిన్సిపల్ సిస్టర్ మెర్సీ, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ అమరేశ్వరరావు, సెట్‌వెల్ సీఈవో సుబ్బిరెడ్డి, డిఎస్‌పి ఈశ్వరరావు, ఐసీడీఎస్ ఏపీడీ విజయకుమారి, జిల్లా బాలల సంక్షేమాధికారి సూర్యచక్రవేణి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సెయింట్ థెరిస్సా మహిళా కళాశాల విద్యార్దినులు, ఆదిత్య జూనియర్ కాలేజీ, డిపాల్ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, సిఆర్ రెడ్డి కళాశాల, కెపిడిటి పాఠశాలలకు చెందిన విద్యార్ధినీ విద్యార్థులతోపాటు ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్ బృందాలు రామచంద్రరావుపేట, పవరుపేట మీదుగా ఫైర్ స్టేషన్ వరకు ప్రదర్శనగా చేరుకున్నారు. అనంతరం ఆయా కళాశాలలు, విద్యాసంస్థల విద్యార్ధినీ విద్యార్దులు ఫైర్ స్టేషన్ నుంచి వారికి కేటాయించిన బస్సులలో గ్రామాలు, మురికివాడలకు తరలివెళ్లి బహిరంగ మల విసర్జన వల్ల కలిగే నష్టాలపై గ్రామీణ ప్రజలకు అవగాహన కలిగించారు.
రైతుల్లో మళ్లీ కలవరం
ద్వారకాతిరుమల, డిసెంబర్ 13: పులి సంచారంతో భీతిల్లుతున్న రైతులకు ఒక లేగదూడ మృత్యువాత పడడంతో మరింత భయభ్రాంతులకు గురయ్యారు. గుర్తుతెలియని జంతువు దాడి చేయడంతో ఒక లేగదూడ మృత్యువాత పడింది. ఈ సంఘటన రైతుల్లో కలకలం రేపింది. మండలంలోని ఎం నాగులపల్లి పంచాయితీ మత్తేవారిగూడెంలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. వివరాల ప్రకారం గ్రామానికి చెందిన రైతు పూర్ణచంద్రరావు యధావిధిగా మంగళవారం రాత్రి ఆయన పొలంలో నెల వయస్సున్న జెర్సీ ఆవుదూడను మిగిలిన పశువులతో కలిపి కట్టేశాడు. బుధవారం తెల్లవారుజామునే పొలానికి వచ్చి చూసిన ఆయన రక్తపు మడుగులో దూడ పడి ఉండడాన్ని గమనించాడు. దీంతో స్థానిక రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ ఏలూరు రేంజి అధికారి పి సూర్యప్రకాశరావు, ఎండి మెహబూబ్, కె వెంకటేశ్వరరావు, చల్లా శ్రీనివాసరావు దూడ మృత కళేబరాన్ని, దాడికి పాల్పడిన జంతువు జాడలను పరిశీలించారు. అలాగే దూడ కుడి డొక్కలో గాయం చేసిన జంతువు రక్తం తాగినట్టు గుర్తించారు. దూడపై దాడికి పాల్పడిన తీరు, దాని జాడలను బట్టి అది హైనా అయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
మద్యం దుకాణం వద్దంటూ మహిళల ఆందోళన
ఆకివీడు, డిసెంబర్ 13: ఆకివీడు శివారు సమతానగర్ ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటును నిరసిస్తూ మహిళలు బుధవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సమతానగర్‌లోని రైల్వేగేటు సమీపంలో మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు రంగం సిద్ధం చేశారు. విషయం తెలుసుకున్న మహిళలు, సీపీఎం, వైఎస్సార్ పార్టీ నాయకులు అక్కడకు చేరుకుని నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. ఈ ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటుచేస్తే విద్యార్థులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడతారని ఆందోళనకు దిగారు. మద్యం దుకాణం వద్దంటూ సీపీఎం నాయకులు, మహిళలు నినాదాలు చేశారు. కేవలం అధికారుల వైఖరి వల్లే ఈ పరిస్థితి ఎదురైందని ఆందోళనకారులు విమర్శించారు. మద్యం దుకాణం ఏర్పాటుచేస్తున్న ప్రాంతంలో ఆందోళనకారులు టెంట్ వేసి నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంతో ఆకివీడు ఎస్సై సుధాకర్‌రెడ్డి, ఎక్సైజ్ ఎస్సై టి.దుర్గాప్రసాద్ అక్కడికి చేరుకుని ఆందోళనకారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మద్యం దుకాణం పెడితే తమ సంసారాలు పాడవుతున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. వివరాలు తెలుసుకున్న అధికారులు విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించి తదుపరి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీపీఎం నాయకులు సందా కేశవరావు, గేదెల అప్పారావు, సందక సూరిబాబు, డి.కళ్యాణి, కె.తవిటినాయుడు, ఎ.రమేష్, షేక్ హుస్సేన్, దొడ్డి పద్మ, గూడాల మరియమ్మ తదితరులు నాయకత్వం వహించారు. అధికారుల తీరు సక్రమంగా లేకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని ఆందోళనకారులు హెచ్చరించారు.
ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా రమేష్
ఏలూరు, డిసెంబర్ 13 : జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కె రమేష్ బుధవారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఆచార్య ఎన్‌జి రంగ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తూ బదిలీపై వచ్చినట్లు పేర్కొన్నారు. ఎస్‌సి కార్పొరేషన్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని, నిబంధనల ప్రకారం వ్యవహరిస్తామని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బాధ్యతగా వ్యవహరిస్తానని తెలిపారు. తమ విధుల నిర్వహణకు కార్యాలయ సిబ్బంది, ఉద్యోగులు సహకరించాలని కోరారు. కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పెండింగ్‌లో వున్న సమస్యలన్నీ కూడా దశల వారీగా పరిష్కరిస్తామన్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోని, అన్ని మండలాల్లోను ఎస్‌సి కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేసేందుకు తగు ప్రణాళిక రూపొందిస్తామని, కేటాయించిన బడ్జెట్‌ను వాటికే వినియోగిస్తామని స్పష్టం చేశారు. ఇడిగా బాధ్యతలు స్వీకరించిన రమేష్‌కు కార్యాలయంలో వివిధ విభాగాల సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. తొలుత ఆయన జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
గిరిజనుల ఐటిడిఎ ముట్టడి
బుట్టాయగూడెం, డిసెంబర్ 13: ఏజన్సీలో గిరిజనుల ఇళ్లకు 75 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని సీపీఐ (ఎంఎల్) జిల్లా నాయకుడు ధర్ముల సురేష్ డిమాండ్ చేశారు. ఏజన్సీలో గిరిజనుల ఇళ్లకు ఉచితంగా కొత్త విద్యుత్ మీటర్లు ఇవ్వాలని, విద్యుత్ అధికారుల దాడులు ఆపాలని డిమాండ్ చేస్తూ ఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం కోటరామచంద్రపురం ఐటీడీఏ కార్యాలయాన్ని గిరిజనులు ముట్టడించారు. ముందుగా ఐటీడీఏ కార్యాలయం వద్ద ప్రదర్శన నిర్వహించి, కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా ధర్ముల సురేష్, తదితర నేతలు మాట్లాడుతూ గిరిజనుల ఇళ్లకు 75 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వవలసి ఉండగా, వేలాది రూపాయల బిల్లులు వేసి గిరిజనులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. కొత్త మీటర్లు బిగించకుండా, పాత మీటర్లలో రీడింగ్‌లు తీసి ఒకేసారి వేలల్లో బిల్లులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. బిల్లులు చెల్లించలేని గిరిజనులకు పెనాల్టీలు వేసి మరింత ఆవేదనకు గురిచేయడం దారుణమన్నారు. గిరిజన గ్రామాల్లో విద్యుత్ అధికారుల దాడులు ఆపాలన్నారు. ప్రతి గిరిజన గ్రామానికి విద్యుత్ సరఫరా అంటూ గొప్పలు చెప్పి, వేలాది రూపాయల్లో బిల్లులు, పెనాల్టీలు వేసి గిరిజన గ్రామాలను చీకటిమయం చేస్తున్నారని ఆరోపించారు. గిరిజనులు ఎదుర్కొంటున్న విద్యుత్ బిల్లుల సమస్యలను ఐటీడీఏ పీవో హరీంద్ర ప్రసాద్‌కు వివరించి, వినతిపత్రం అందించారు. దీనిపై స్పందించిన పీవో విద్యుత్ శాఖ అధికారులతో చర్చించి, సమస్యను పరిష్కరిస్తానని హామీయచ్చారు. వెట్టి సుబ్బన్న, కెవి రమణ, పి.శ్రీనివాస్, అరగంటి చిన్నబ్బాయి, టి.బాబూరావు, వెట్టి భారతి, కె.పోతిరెడ్డి, సర్పంచ్‌లు కొవ్వాసి గోవిందరాజు, కోర్స కన్నపరాజు తదితరులు నాయకత్వం వహించారు.
భూగర్భ జలాల పెంపునకు చర్యలు
ఏలూరు, డిసెంబర్ 13 : జిల్లాలో భూగర్భజలాలు పెంపొందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లో ఎన్‌టి ఆర్ జలసిరి కార్యక్రమంలో ట్రాన్స్‌కో, డ్వామా, నెడ్‌క్యాప్ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చెక్‌డ్యామ్‌లు, ఫామ్‌పాండ్స్ త్వరితగతిన పూర్తి చేసి భూగర్భజలాలు పెంపొందించేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో మెట్ట ప్రాంతంలో 55 చెక్‌డ్యామ్‌లు పూర్తి చేయవలసి వుండగా 11 చెక్ డ్యామ్‌లు మాత్రమే పూర్తిచేయడం పట్ల సంబంధితాధికారులను ప్రశ్నించారు. నిర్ధేశించిన కాలంలో చెక్‌డ్యామ్‌లు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టరు సంబంధిత అధికారులను ఆదేశించారు. రానున్న సంవత్సరంలో జిల్లాను అత్యంత సుందరంగా తీర్చిదిద్దేందుకు గ్రీనరీ ఏర్పాటు చేయాలని ఇందునిమిత్తం 936 నర్సరీలు ఏర్పాటు చేసి 40 లక్షల మొక్కలను పెంచేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ డ్వామా పిడి, అటవీ శాఖాధికారులను ఆదేశించారు. జిల్లాలో గ్రామాల్లో నాటిన మొక్కలు రక్షణ కొరకు ట్రీగార్డులు ఏర్పాటుచేసేందుకు టెండరు షెడ్యూలు త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. మొక్కనాటిన తరువాత పశువులు మొక్కలను పాడు చేయకుండా ట్రీగార్డు చాలా అత్యవసరమన్నారు. జిల్లాలో చెక్‌డ్యామ్‌లు, ఫామ్ పాండ్లు ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని, ఎన్‌టిఆర్ జలసిరి ఫేజ్-2లో పూర్తి కావాల్సిన సోలార్ విద్యుత్తు బోర్లు త్వరితగతిన రైతులకు అందుటులోనికి తేవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నెడ్‌క్యాప్ ద్వారా నిర్ధేశించిన సోలార్ విద్యుత్తు మోటార్లను త్వరితగతిన పూర్తి చేయాలని నెడ్‌క్యాప్ అధికారిని ఆదేశించారు. కార్యక్రమంలో ట్రాన్స్‌కో ఇ ఇ సత్యనారాయణరెడ్డి, డ్వామా పిడి గణేష్‌రావు, అటవీ శాఖ అధికారి, నెడ్‌క్యాప్ అధికారి తదితరులు పాల్గొన్నారు.
ఐటిఐ విద్యార్ధులకు పాలిటెక్నిక్ అవకాశం
ఏలూరు, డిసెంబర్ 13: ఐటిఐ విద్యార్దులు రెండు సంవత్సరాలు చదివి 65 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్ధులకు నేరుగా పాలిటెక్నిక్ కోర్సులో రెండవ సంవత్సరంలో చేరేటట్లు అవకాశం కల్పించినట్లు ప్రభుత్వ ఐటిఐ ప్రధాన అధికారి డి భూషణం తెలిపారు. ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేటు ఐటిఐలలో 2018 జనవరి 9వ తేదీ నుంచి ఫిబ్రవరి 8వ తేదీ వరకు బ్రిడ్జి కోర్సు నిర్వహిస్తారన్నారు. 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఆయా సంస్థల్లో ప్రాక్టికల్ పరీక్షలు వుంటాయని తెలిపారు. ఏప్రిల్‌లో స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ట్రైనింగ్ ప్రవేశ పరీక్షలకు హాజరుకావాల్సి వుందన్నారు. ఆసక్తి గల ఐటిఐ రెండు సంవత్సరాల కోర్సు చదివిన విద్యార్ధులు దగ్గరలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటిఐల ప్రధానాధికారులను సంప్రదించాలని ఆయన కోరారు. 2018 సంవత్సరంలో బ్రిడ్జి కోర్సు ట్రైనింగ్ అయిన విద్యార్ధులు ఎస్‌బి టెట్‌కు వారు నిర్వహించు ప్రవేశపరీక్ష రాసి పాలిటెక్నిక్ కోర్సు రెండవ సంవత్సరంలో చేరేందుకు అర్హత వుందని పేర్కొన్నారు.
శ్రీవారి సేవలో డీఈవో రేణుక
ద్వారకాతిరుమల, డిసెంబర్ 13: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయాన్ని బుధవారం డీఈవో సివి రేణుక తొలిసారిగా దర్శించుకున్నారు. పదోన్నతిపై జిల్లాకు వచ్చిన ఆమె బాధ్యతలు స్వీకరించిన అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ ముఖమండపంలో అర్చకులు ఆమెకు స్వామివారి శేషవస్త్రాన్ని కప్పి వేదాశీర్వచనం పలికారు. ఆ తరువాత శ్రీవారి చిత్రపటం, ప్రసాదాలు అందించారు.

మైనర్ బాలిక వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
ఆకివీడు, డిసెంబర్ 13: ఆకివీడులో బుధవారం మైనర్ బాలిక వివాహాన్ని స్ర్తి శిశు సంక్షేమ శాఖాధికారులు అడ్డుకున్నారు. మండలంలోని గుమ్ములూరు గ్రామానికి చెందిన చొప్పల చినసోమన్న కుమార్తె మరియమ్మ (15)కు మాదివాడకు చెందిన మద్దిరాల యోనా కుమారుడు వినయ్‌బాబుతొ వివాహం నిశ్చయమైంది. బుధవారం మాదివాడలోని చర్చి వద్ద వివాహం జరుగుతుండగా విషయాన్ని గుర్తుతెలియని వ్యక్తి ఉన్నతాధికారులకు సమాచారమిచ్చాడు. స్ర్తి శిశు సంక్షేమ శాఖ పీడీ ఆదేశాలతో ఐసీడీఎస్, పోలీసు అధికారులు రంగంలోకి దిగారు. ఇరువర్గాల పెద్దలతో ఐసీడీఎస్ సీడీపీవో సరస్వతి, ఆకివీడు స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ జయరాజ్ మాట్లాడి పెళ్లి నిలుపుదల చేశారు. పెళ్లి కుమార్తెకు వయస్సు నిండని కారణంగా నిలుపుచేయాలని, లేని పక్షంలో బాల్య వివాహ నిరోధక చట్టం కింద కేసులు పెడతామని హెచ్చరించారు. ఇరువర్గాల పెద్దల నుండి హామీ పత్రాన్ని తీసుకున్నారు.