పశ్చిమగోదావరి

భీమవరంలో ఫ్లెక్సీ వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, డిసెంబర్ 30: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్-బాహుబలి ప్రభాస్‌ల ఫ్లెక్సీల వివాదం తర్వాత ప్రశాంతంగా ఉన్న భీమవరంలో మళ్ళీ ఫ్లెక్సీల వివాదం ప్రారంభమైంది. నూతన సంవత్సర, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని భీమవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ఇన్‌చార్జి గ్రంధి శ్రీనివాస్ ఫొటోలతో ఆయన అభిమానులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకుంటున్నారు. వీటిని మున్సిపల్ అధికారులు సిబ్బందితో తొలగిస్తున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కేవలం వైసీపీకి చెందిన ఫ్లెక్సీలను మాత్రమే తొలగిస్తున్నారని గ్రంధి శ్రీనివాస్ అభిమానులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. శనివారం భీమవరం మున్సిపాల్టీలో బడ్జెట్ సమావేశానికి ముందు భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు మున్సిపాల్టీలోని కమిషనర్ సిహెచ్.నాగనర్సింహరావు కార్యాలయాన్ని ముట్టడించారు. సరిగ్గా ఇదే సమయంలో పోలీసులు కూడా రంగప్రవేశం చేశారు. కమిషనర్ డౌన్ డౌన్ అని నానాదాలు చేస్తుండగా మరోపక్క బడ్జెట్ సమావేశానికి హాజరైన మున్సిపల్ వైస్ ఛైర్మన్ ముదునూరి సూర్యనారాయణరాజు, మెంటే గోపి, తదితర టీడీపీ కౌన్సిలర్లు చూస్తూ ఉండిపోయారు. ఇంతలో కౌన్సిల్ ఛాంబర్‌కు మున్సిపల్ ఛైర్మన్ కొటికలపూడి గోవిందరావు చేరుకుని కమిషనర్‌ను రావాలని ఆదేశించారు. అయితే వైసీపీ నేతల వలయంలో కమిషనర్ చిక్కుకుపోవడంతో కౌన్సిల్ హాలుకు రావడానికి ఆయనకు వీలుకాలేదు. పట్టణంలో ఉన్న అన్ని ఫ్లెక్సీలను తొలగిస్తామని కమిషనర్ ప్రకటించినా వైసీపీ శ్రేణులు మాత్రం తమ బ్యానర్లు తొలగించారన్న ఆగ్రహంలో ఉన్నారు. ఇంతలో కౌన్సిలర్ నందమూరి ఆంజనేయులు వివాదంలో తలదూర్చారు. ఇది కాస్తా రెండు వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణాన్ని తీసుకువచ్చింది. వెంటనే సీఐ దేశంశెట్టి వెంకటేశ్వరరావు రెండు వర్గాలను నిలువరింపచేశారు. మధ్యాహ్నం వరకు ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. జనవరి మాసంలో కౌన్సిల్ సమావేశాన్ని ముట్టడిస్తామని వైసీపీకి చెందిన మున్సిపల్ విపక్ష నేత గాదిరాజు సుబ్రహ్మణ్యంరాజు, జిల్లా కార్యదర్శి పేరిచర్ల సత్యనారాయణరాజు, కోడే యుగంధర్, గోగురాజు ప్రకటించారు.