పశ్చిమగోదావరి

విషాద యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొవ్వూరు/నిడదవోలు, ఏప్రిల్ 17: ఆనందంగా తీర్థయాత్రలకు వెళ్లిన రెండు కుటుంబాలు నిండు శోకంలో మునిగిపోయాయి. ఒక్కో కుటుంబంలో ముగ్గురు వంతున మొత్తం ఆరుగురు అందని లోకాలకు తరలిపోయారు. ఎక్కడో బీహార్ రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జిల్లాలో ప్రకంపనలు సృష్టించింది. ఆదివారం తెల్లవారుజామున బీహార్‌లోని కౌమార్ జిల్లా కౌండి గ్రామం వద్ద వీరు ప్రయాణిస్తున్న వాహనం ఆగివున్న మరో వాహనాన్ని ఢీకొన్నట్టు ఇక్కడకు సమాచారం అందింది. ఈ ప్రమాదంలో నిడదవోలుకు చెందిన అత్తిలి శ్రీరామ్ (70), ఆయన భార్య సరస్వతి (60), సోదరి రుక్మిణి (75), కొవ్వూరు మండలం పంగిడి గ్రామానికి చెందిన మాచవరపు సత్యనారాయణ (59), ఆయన తల్లి పద్మావతి (80), కుమారుడు పవన్‌కుమార్ (23) మృతి చెందారు. సత్యనారాయణ భార్య లక్ష్మీ కళావతి తీవ్రంగా గాయపడ్డారు. బీహార్‌లోని గయ క్షేత్రానికి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించినట్టు సమాచారం.
నిడదవోలుకు చెందిన శ్రీరామ్ రిటైర్డ్ పంచాయతీ కార్యదర్శి. భార్యతో కలిసి స్థానిక రాయపేట మడిపల్లివారి సత్రం ఎదురుగా సొంతింట్లో నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె. కుమార్తెకు వివాహం అయ్యింది. కుమారుడు హైదరాబాద్‌లో ఒక ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు. దైవభక్తి పరాయణులైన ఈ దంపతులు నిత్యం తీర్థయాత్రలకే ప్రాధాన్యత ఇచ్చేవారు. తొమ్మిదిసార్లు కాశీ వెళ్లాలని వారి కోరిక. ఇప్పటికే అయిదుసార్లు వెళ్లివచ్చిన వారు ఆరోసారి యాత్ర కోసమని ఈ నెల 9న బయలుదేరారు. నిడదవోలు నుండి రైలులో బయలుదేరిన వీరు కాశీయాత్ర పూర్తిచేసుకుని, బీహార్‌లోని గయ క్షేత్రాన్ని కూడా దర్శించుకోవాలనే తలంపుతో తమతో వచ్చిన పంగిడి గ్రామానికి చెందిన సత్యనారాయణ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక వాహనం మాట్లాడుకున్నట్టు సమాచారం. వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురై ముందుభాగమంతా ధ్వంసమవ్వడంతో ఆరు మరణాలు సంభవించాయి. శ్రీరామ్ నిడదవోలు పట్టణ సీనియర్ సిటిజన్స్ సంఘం గౌరవాధ్యక్షునిగా పనిచేస్తున్నారు. సినీ నటుడు చంద్రమోహన్ సతీమణి శ్రీరామ్‌కు దగ్గరి బంధువు అని సమాచారం. సౌమ్యునిగా పేరుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకునేవారని స్థానికులు తెలిపారు.
ఇక ప్రమాదంలో మృతిచెందిన సత్యనారాయణ చాగల్లు మండలం బ్రాహ్మణగూడెం గ్రామ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. గతంలో పంగిడి, సీతంపేట, పెనకనమెట్ట, వాడపల్లి గ్రామ కార్యదర్శిగా పనిచేశారు. పంగిడి గ్రామ కార్యదర్శిగా పనిచేసిన సమయంలో ఆ గ్రామానికి నిర్మల్ పురస్కార్ అవార్డు లభించింది. 1982లో బిల్లు కలెక్టరుగా ఉద్యోగంలో చేరిన సత్యనారాయణ క్రమంగా గ్రామ కార్యదర్శిగా పదోన్నతి పొందారు. ఏ గ్రామ కార్యదర్శిగా పనిచేసినా ఆ గ్రామాల్లోని సర్పంచులు, ప్రజాప్రతినిధులు కలిసి మెలసి పనిచేసి, గ్రామాల అభివృద్ధికి కృషి చేశారు. కొవ్వూరు మండలం పెనకనమెట్ట గ్రామంలో గ్రామ కార్యదర్శిగా 10 సంవత్సరాలపాటు ఆయన సేవలందించారు. సత్యనారాయణ గత తొమ్మిది నెలలుగా బ్రాహ్మణగూడెం కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన చాగల్లు జడ్పీ హైస్కూలు పూర్వ విద్యార్థి, పంగిడి పోస్టుమాస్టరు కుమారునిగా అందరికీ సుపరిచితుడు. సత్యనారాయణ స్వస్థలం పంగిడి కావటం, నివాసం కొవ్వూరు కావటంతో పంగిడిలో బంధువులు, మిత్రులు, కుటుంబ సభ్యులు దుఃఖసాగరంలో మునిగారు. సత్యనారాయణ మృతి తీరని లోటని సహ ఉద్యోగులు, సర్పంచులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
సత్యనారాయణ మృతికి రాష్ట్ర స్తీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత, కొవ్వూరు ఎమ్మెల్యే కెఎస్ జవహర్, ఐ పంగిడి గ్రామ సర్పంచ్ పొట్రు సుజాత, మాజీ ఎంపిపి పికె రంగారావు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.