పశ్చిమగోదావరి

వేదంలోనే భవిష్యత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జనవరి 21: వేదాల్లో సర్వవిజ్ఞానం నిక్షిప్తమై ఉందని, అలాంటి వేదంలోనే భవిష్యత్ దాగి ఉందని ఎఫ్‌డిసి ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ పేర్కొన్నారు. వేదం చదువుకుంటే భవిష్యత్ బంగారుమయం అవుతుందని, ఇప్పుడున్న పరిస్దితులన్నీ దానికి అనుకూలంగానే ఉన్నాయని చెప్పారు. వేదం నేర్చుకోవడాన్ని చిన్నచూపు చూడవద్దని, దానిలో ఎంతో భవిష్యత్ దాగి ఉందని గుర్తించాలని హితవు పలికారు. ఏలూరు నగర బ్రాహ్మణ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం స్ధానిక విజయగార్డెన్స్‌లో ఉన్న హేలాపురి బ్రాహ్మణ సేవా సంఘ కళ్యాణమండపంలో రాష్టస్ధ్రాయి బ్రాహ్మణ ఉచిత వధూవరుల పరిచయ వేదిక నిర్వహించారు. దీనికి రాష్ట్రం నలుమూలల నుంచి 523 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరి తల్లిదండ్రులు, బంధువులు హాజరుకావటంతో సభాప్రాంగణం కిటకిటలాడిపోయింది. ఈసందర్భంగా ఏర్పాటుచేసిన సభకు ముఖ్యఅతిధిగా హాజరైన అంబికా కృష్ణ మాట్లాడుతూ వేదం చదువుకున్నవారిని కూడా వివాహం చేసుకోవడానికి ముందుకు వస్తేనే మన సంస్కృతి, సంప్రదాయం విలసిల్లుతుందని, ఆ కుటుంబాలు కూడా శోభాయమానంగా వెలుగుతాయని చెప్పారు. కేవలం కొన్నిరంగాలకు చెందినవారిని మాత్రమే ఎంచుకోవటం సరికాదని, అన్నిరంగాల్లోనూ ప్రతిభ ఉన్నవారు, ఎంతో భవిష్యత్ ఉన్నవారు అధికసంఖ్యలో ఉన్నారని, ఆదిశగా ఆలోచిస్తేనే తల్లిదండ్రులకు, వధూవరులకు మంచిదని హితవు పలికారు. ఈసందర్భంగా ఇంత భారీస్ధాయిలో వధూవరుల పరిచయ వేదిక ఏర్పాటుచేసిన సమితి అధ్యక్షులు సత్యవాడ దుర్గాప్రసాద్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈసందర్భంగా వధూవరుల వివరాలతో ప్రచురించిన బుక్‌లెట్‌ను ప్రముఖ ఆడిటర్ సోమసుందర్‌సాయి దంపతులు ఆవిష్కరించారు. ఈసందర్భంగా హాజరైనవారికి హైదరాబాద్‌కు చెందిన వైష్ణవి క్యాటరర్స్ అధినేత పెండ్యాల శేషసాయివరప్రసాద్ భోజన సదుపాయం ఉచితంగా కల్పించారు. కార్యక్రమంలో అఖిలభారత బ్రాహ్మణ ఫెడరేషన్ ఛైర్మన్ కొప్పారపు బాలరామకృష్ణమూర్తి, బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ డైరెక్టరు ఎంబిఎస్ శర్మ, నగర బ్రాహ్మణ ఐక్య కార్యాచరణ సమితి అధ్యక్షులు సత్యవాడ దుర్గాప్రసాద్, కార్యదర్శి తోలేటి శ్రీనివాస్, ఆర్గనైజింగ్ కార్యదర్శి ద్రోణంరాజు వెంకటరమణ, మహిళా విభాగం అధ్యక్షురాలు కొంపెల్ల తాయారు, కార్యదర్శి కొడాలి హిమబిందు, డాక్టరు ఎఎస్ రామ్, డాక్టరు ఎ అపర్ణాదేవి, డాక్టరు డి సుబ్బారావు, డి సరస్వతి, కొచ్చర్లకోట సత్యమూర్తి, గరికిపాటి సీతారామశర్మ, మైలవరపు వెంకట రామనరసింహశర్మ, మంత్రిప్రగడ శ్రీహరిరావు తదితరులు పాల్గొన్నారు.
జన్మభూమితో ప్రభుత్వంపై సంపూర్ణ విశ్వాసం

పాలకొల్లు, జనవరి 21: ‘జన్మభూమి’ కార్యక్రమం ద్వారా టీడీపీ ప్రభుత్వంపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం కల్గిందని పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్వహించిన ఆ పార్టీ రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశంలో తాము మాట్లాడినట్టు ఎమ్మెల్యే నిమ్మల తెలిపారు. సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రభాబు నాయుడు అధ్యక్షత వహించారని స్థానిక విలేఖర్లకు చెప్పారు. ఉండవల్లిలో ముఖ్యమంత్రి నివాసంలో ఈ సమావేశం జరిగిందన్నారు.
జంట హత్యల కేసులో నిందితులు అరెస్టు
పోలవరం, జనవరి 21: తల్లీకూతుళ్లను హత్యచేసిన వారి భర్తలను అరెస్టుచేసినట్టు పోలవరం డీఎస్పీ ఏటీవీ రవికుమార్ తెలిపారు. ఆదివారం ఉదయం స్థానిక పోలీసు స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ సుమారు రెండు నెలల క్రితం అదృశ్యమైన తల్లీకూతుళ్ల కేసును సీఐ ఎం రమేష్‌బాబు, ఎస్సై కే శ్రీహరిరావులు ఛేదించినట్టు తెలిపారు. గత సంవత్సరం నవంబర్ 2న ఇళ్ల సావిత్రి (38), పులిబోయిన మంగతాయారు (18) కనిపించకుండా పోయినట్లు సావిత్రి తల్లి కొండ గంగాయమ్మ నవంబర్ 28న ఫిర్యాదుచేసినట్టు తెలిపారు. మహిళా మిస్సింగ్ కేసుగా కేసు నమోదుజేసి, దర్యాప్తులో ఏ విధమైన ఆధారాలు లేకపోవడంతో దర్యాప్తు ముందుకు సాగలేదన్నారు. అయితే కాల్‌డేటా ఆధారంగా మంగతాయారు భర్త నాగరాజును అదుపులోనికి తీసుకుని విచారించగా తల్లీకూతుళ్లను మామ ఆంజనేయులతో కలిసి హత్యచేసినట్టు నాగరాజు అంగీకరించినట్టు డీఎస్పీ తెలిపారు. దీంతో మిస్సింగ్ కేసును మర్డర్ కేసుగా మార్చామన్నారు. మామ, అల్లుడిని హత్యచేసిన బుట్టాయగూడెం మండలం యర్రాయగూడెం గ్రామ సమీపంలో జీడిమామిడి తోటలోనే హత్యచేసి, అక్కడే పాతిపెట్టిన విషయాన్ని వారి ద్వారా తెలుసుకుని, ఎస్పీ రవిప్రకాష్ ఆదేశాల మేరకు పూడ్చిన మృతదేహాలను బయటకుతీసి, అక్కడే పోస్టుమార్టం నిర్వహించి, బంధువులకు అప్పగించినట్టు డీఎస్పీ తెలిపారు. హంతకులను రిమాండు నిమిత్తం న్యాయమూర్తి వద్దకు తీసుకువెళుతున్నట్టు డీఎస్పీ రవికుమార్ తెలిపారు.