పశ్చిమగోదావరి

నరసాపురంలో నడిరోడ్డుపై ప్రసవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసాపురం, జనవరి 21: గోదావరి మాత సాక్షిగా నడి రోడ్డుపై ఓ నిండు గర్భిణి ప్రసవించింది. నిత్యం రద్దీగా ఉండే ఆ రహదారిలో పండంటి బిడ్డకు జన్మమిచ్చిన ఆమె ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆదివారం స్థానిక పడవల రేవు వద్ద చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం రామేశ్వరం గ్రామానికి చెందిన నల్లి రోజా నెలలు నిండటంతో ప్రసవం కోసం ప్రభుత్వాసుపత్రిలో చేరేందుకు పట్టణం వచ్చింది. పంటుపై వశిష్ఠ గోదావరి నది దాటి వచ్చిన ఆమెకు పంటు దిగిన వెంటనే పురిటి నొప్పులు ఆరంభమయ్యాయి. దీంతో ఆమె భర్త శ్రీను 108 అంబులెన్సు కోసం ఫోన్ చేశాడు. అయితే అంబులెన్స్ అక్కడికి రాకముందే రోజాకు నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో గోదావరి ఏటిగట్టు రహదారి పక్కనే ఆమె ఆడ శిశువుకు జన్మనిచ్చింది. రోజాకు సహాయకులుగా వచ్చిన తల్లి పాకెర్ల కుమారి, తండ్రి మోషేను, భర్త శ్రీను రోజ, శిశువును ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో తల్లి, శిశువులకు వైద్యులు తక్షణ వైద్య సేవలు అందించారు. ప్రస్తుతం తల్లి, శిశువు ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

కారులో మంటలు!
ఆకివీడు, జనవరి 21: జాతీయరహదారిపై ఆదివారం శాంత్రో కారులో మంటలు రేగి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసింది. ఆకివీడుకు చెందిన కాశీవిశే్వశ్వరరావు తన కారులో భీమవరం వెళ్లి తిరిగి ఆకివీడు వస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఆకివీడులోని ఆంధ్రాబ్యాంకు సమీపానికి వచ్చేసరికి కారులో మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా కారు ఆపి దిగారు. చుట్టుపక్కల వారు వచ్చి మంటల్ని అదుపులోకి తెచ్చారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.