వరంగల్

టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి * విద్యార్థులకు వీసీ సాయన్న పిలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెయు క్యాంపస్, ఫిబ్రవరి 17: కాకతీయ విశ్వవిద్యాలయం మహిళా ఇంజనీరింగ్ కళాశాల అధ్వర్యంలో దూరవిద్యా కేంద్ర నూతన భవనం సెమినార్ హాల్‌లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే అంశంపై రెండురోజుల జాతీయ వర్క్‌షాప్ ప్రారంభమైంది. ఈ వర్క్‌షాప్‌కు ఉపకులపతి ఆచార్య సాయన్న హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ మంజుల అధ్యక్షత వహించగా వరంగల్ నిట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రష్మి రంజన్ రౌత్ కీలకోపాన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఉపన్యసిస్తూ అన్ని రకాల ఎలక్ట్రానిక్ పరికరాలను ఇంటర్నెట్ పరిథిలోకి అనుసంధానం కావించడమే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ముఖ్య ఉద్దేశ్యం అని చెప్పారు. ఈ అనుసంధాన ప్రక్రియ ప్రస్తుతం ప్రారంభదశలో ఉన్నదని, భవిష్యత్తులో అనూహ్యంగా పెరగనున్నదని అన్నారు. ముఖ్యఅతిథిగా కెయు విసి సాయన్న మాట్లాడుతూ కంప్యూటర్ రంగంలో వస్తున్న మార్పులను అవగాహణ చేసుసకోవాల్సిన అవసరం ఎంతైన ఉందని అన్నారు. విద్యార్థులు తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని తాజాగా తెలుసుకోవాల్సి ఉందని, లేనిచో పోటీ ప్రపంచంలో వెనుకబడిపోతారని ఉద్భోదించారు. యుజిసి కో ఆర్డినేటింగ్ ఆఫీసర్ ప్రొఫెసర్ సారంగపాణి మాట్లాడుతూ వ్యవసాయ రంగం మొదలు గృహ అవసరాల వరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. అధ్యక్షత వహించిన ప్రిన్సిపాల్ మంజుల మాట్లాడుతూ ఈ వర్క్‌షాప్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. కార్యక్రమంలో అద్యాపకులు మల్లారెడ్డి, వీణా, స్వాతి, వాణిశ్రీ, దీప్తి, విద్యార్థులు పాల్గొన్నారు.

బ్యాంకర్లు సకాలంలో
ఉపాధి రుణాలు ఇవ్వాలి
నక్కలగుట్ట, ఫిబ్రవరి 17: బ్యాంకర్లు సకాలంలో ఉపాధి రుణాలు ఇవ్వాలని, 2017-18కిగాను బ్యాంకు రుణాల లక్ష్యం 277కోట్లు కాగా 174కోట్ల లక్ష్యం పూర్తి అయ్యిందని, మార్చి చివరి నాటికి 100 శాతం లక్ష్యం పూర్తి కావాలని ఇన్‌చార్జి కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్వయం ఉపాధి రుణాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎస్సీ, బిసి, గిరజన శాఖల ద్వారా 2015-16,2016-17 సంవత్సరానికి మంజూరి చేసిన స్వయం ఉపాధి రుణాలను త్వరితగతిన పూర్తి చేసి యుసిలను ఎంపిడిఓలకు అందించాలని బ్యాంకర్లకు తెలిపారు. ఆర్థిక సంవత్సరం ముగియనుందని సబ్సిడి విడుదల అయిన లబ్దిదారులకు రుణాల వితరణలో జాప్యం చేయకుండా వెంటనే రుణ వితరణ చేయాలని తెలిపారు. శాఖలవారీగా బ్యాంకు బ్రాంచిల వారిగా ఉన్న పెండింగ్‌కు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మహిళా స్వయం సహాయక లింకేజీ రుణాలలో సైతం జాప్యం జరుగుతుందని బ్యాంకర్లు సహకరించాలని తెలిపారు. సంక్షేమ పథకాలలో బ్యాంకర్లు సహకరించాలని కోరారు. సమావేశంలో ఎల్‌డిఎం హరిప్రసాద్, ఎస్సీ, ఎస్టీ, బిసి సంక్షేమ అధికారులు సురేష్, నిర్మల, నర్సింహస్వామి, ఎంపిడిఓలు, బ్యాంకుమేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
వర్ధన్నపేట, ఫిబ్రవరి 17: వ్యవసాయం కోసం చేసిన అప్పులతో కుటుంబం సాకలేని స్థితిలో నిరుపేద రైతు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన మండలంలోని నల్లబెల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే నల్లబెల్లి గ్రామానికి చెందిన మల్యాల కుమారస్వామి(43) తనకున్న రెండు ఎకరాల వ్యవసాయ భూమిలో పత్తి, మొక్కజోన్న, వరి పంటలను వేసుకుని కుటుంబాన్ని సాకేవాడు. ఈ క్రమంలో ఈ సంవత్సరం పంటలు దిగుబడి రాకపోవడంతో వేసిన రెండు బోర్లలో నీళ్లు పడకపోవడం వల్ల పెట్టబడులకోసం తెచ్చిన అప్పులు తోడు బోర్ల కోసం చేసిన అప్పులు నాలుగు లక్షలు భారంగా మారి కుటుంబం పోషన కూడ దినదిన గాండంగామారి తెచ్చిన అప్పులు తీర్చలేను అని మనస్థాపం చేంది క్రీమసంహారక మందును ఈ నెల 14 సాయంత్రం సేవించగా హుటహుటిన స్థానికులు 108 ద్వారా వరంగల్ ఎంజి ఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతునికి భార్య కుమారుడు, కుమార్తె కలరు

ఇసుక అక్రమార్కులపై కఠిన చర్యలు
* భూపాలపల్లి ఎస్పీ భాస్కరన్
భూపాలపల్లి, ఫిబ్రవరి 17: జిల్లాలో ఇసుక అక్రమ రవాణా చేసే వ్యక్తులు, వాహనాలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మూడు శాఖల అధికారులను జిల్లా ఎస్పీ ఆర్.్భస్కరన్ ఆదేశించారు. ఇసుక లారీల వల్ల ప్రజలు ప్రమాదాలకు గురవుతున్న నేపధ్యంలో శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో టీఎస్‌ఎండీసీ, రవాణాశాఖ, అటవీశాఖ అధికారులతో ఎస్పీ ఆర్.్భస్కరన్ సమన్వయ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా లారీల వేగనియంత్రణ, ప్రమాదాల నివారణ కోసం తగిన సలహాలు, సూచనలు ఎస్పీ ఇచ్చారు. అంతేకాకుండా కాటారం, భూపాలపల్లి, పరకాల, హన్మకొండ ప్రధాన రహదారికి బదులుగా మరిన్ని ఇతర రూట్లు కొత్త వాటిని, ట్రాఫిక్ నియంత్రణ కోసం, ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. అదే విధంగా నిరంతం డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టి, వాహనాల తనిఖీలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. ప్రమాద రహిత జిల్లా కోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిందిగా పిలుపునిచ్చారు. కొద్ది రోజుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఈసమావేశంలో టీఎస్‌ఎండీసీ జీఎం రాజేందర్ తదితరులు పాల్గొన్నారు

ఇసుక రీచ్‌లో అక్రమాలు
* అధిక లోడ్ ఇసుక లారీలు పట్టివేత
వెంకటాపురం (నూగూరు), ఫిబ్రవరి 17: మండల పరిధిలో సూరవీడు పంచాయతీ కొండాపురం గోదావరి ఇసుక ర్యాంపులో అనుమతికి మించిన అదనపు బరువుతో వెళుతున్న లారీలను తాడ్వాయి వద్ద శుక్రవారం రాత్రి విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించి పట్టుకున్నారు. 11 లారీలను స్వాధీనం చేసుకుని తాడ్వాయి పోలీస్టుషన్‌కు తరలించారు. ఇసుక రీచ్‌లో టీఎస్‌ఎండీసీ చలానా ప్రకారం అనుమతించిన క్యూబిక్ మీటర్ల ఇసుక కంటే రైజింగ్ కాంట్రాక్టర్లు ఒక్కొక్క లారీకి మూడు నుండి నాలుగు బకీట్లు అదనంగా ఇసుక పోసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇసుక మాఫీయా కనుసన్నల్లో అధికారులను ప్రసన్నం చేసుకుని ఒక్కొక్క బకీట్‌కు ఐదు వందల నుండి ఎనిమిది వందల వరకు డ్రైవర్ల వద్ద నుండి వసూలు చేసి లక్షలాది రూపాయలు మాఫీయా దండుకుంటున్నారు. కొండాపురం ఇసుక రీచ్‌లో కొండాపురం గిరిజన మహిళ ఇసుక సొసైటీకీ ప్రభుత్వ పరంగా రెండు లక్షల క్యూబిక్ మీటర్లు గోదావరి నది నుండి తరలించేందుకు అనుమతులు ఉన్నాయి. గతంలో 30వేల క్యూబిక్ మీటర్లు ఇసుక ర్యాంప్‌కు తరలించగా ఈ ఏడాది ఇప్పటి వరకు 20వేల క్యూబిక్ మీటర్లు గోదావరి ఒడ్డు వద్ద నిల్వ చేశారు. ఆ ఇసుక నిల్వలను అధికారుల పర్యవేక్షణలో రవాణా చేయాల్సి ఉంది.

పునశ్చరణ తరగతులతో నైపుణ్యం
పోలీసులకు సీపీ సుధీర్‌బాబు హితవు * బాధ్యతాయుతంగా పనిచేయాలి
ఆంద్రభూమి బ్యూరో
వరంగల్, ఫిబ్రవరి 17: పోలీసులు వృత్తిపరమైన నైపుణ్యం సాధించాలంటే పునశ్చరణ శిక్షణ తరగతలు అవసరమని వరంగల్ పోలీస్ కమిషనర్ జీ. సుధీర్‌బాబు సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆర్మ్‌డ్ రిజర్వ్ సిబ్బంది ఐదురోజుల పునశ్చరణ శిక్షణ తరగతులను శనివారం వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రారంభించారు. ఆర్మ్‌డ్ రిజర్వ్ సిబ్బంది తమ విధి నిర్వహణలో రాణించడంతో పాటు మరింత నైపుణ్యం సాధించడం కోసం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్‌లో ఈ పునశ్చరణ శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణ తరగతులల్లో భాగంగా సిబ్బంది యోగా, డ్రిల్, పరేడ్, అయుధశిక్షణ, ఫైరింగ్, ఆరోగ్య పరిరక్షణ మొదలైన అంశాలపై సిబ్బందికి శిక్షణ అందజేయడంతో పాటు సిబ్బందికి చెందిన శాఖపరమైన సమస్యలను ఈ శిక్షణ తరగతుల్లో అధికారుల దృష్టికి తీసుకవెళ్లడం జరుగుతుంది. ఈ శిక్షణ తరగతులను ప్రారంభించిన పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ విధి నిర్వహణలో భాగంగా వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహించే ఆర్మూడ్ సిబ్బంది ఈ పునశ్చరణ శిక్షణ తరగతుల ద్వారా తిరిగి అందరు ఒక్కచోటుకి చేరుకొని శిక్షణ తరగతులకు హాజరు కావడం ఆటవిడువుగా వుండడంతో పాటు, సిబ్బంది తమ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకునే అవకాశం దొరుకుతుందని అన్నారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలందించాలంటే సిబ్బంది తమ వృత్తిలో నైపుణ్యం సాధించాలని, ప్రతి పోలీస్ భాధ్యతగా విధులు నిర్వర్తించడంతో పాటు పోలీసులు సమాజ క్షేమం కోసం వ్యక్తిగతంగా కొన్ని త్యాగాలు చేయాల్సి వుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్, ఈస్ట్‌జోన్ డిసిపిలు వెంకట్ రెడ్డి, వెంకటేశ్వర్లు, ఏసిపిలు విధ్యాసాగర్, సదానందం, శ్రీనివాస్, ఆర్‌ఐలు నాగయ్య, సతీష్, శశిధర్, భాస్కర్, హతీరాంతోపాటు ఆర్‌ఎస్‌ఐలు పాల్గొన్నారు.

పకడ్బందీగా టెన్త్ పరీక్షలు
* విద్యార్థులకు ఇబ్బందిలేకుండా చూడాలి
* జాయింట్ కలెక్టర్ దామోదర్‌రెడ్డి
మహబూబాబాద్,్ఫబ్రవరి 17: మార్చి 15నుండి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరుగనున్న పదవ తరగతి పరీక్షలను పకడ్భందీగా నిర్వహించాలని అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ దామోదర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం ఎస్‌ఎస్‌సి పరీక్షల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్‌ఎస్‌సి పబ్లిక్ పరీక్షల్లో జిల్లా నుండి 9575మంది రెగ్యులర్, 849మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారన్నారు. జిల్లాలో 51పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని అందులో 48రెగ్యులర్, 3ప్రైవేట్ విద్యార్థుల కోసం కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షలు సజావుగా జరుగడానికి 51మంది చీఫ్ సూపరింటెండెంట్‌లను, 51మంది వివిధ శాఖల అధికారులను, ఐదుగురిని అదనపు శాఖ అధికారులను, 850మంది ఇన్విజిలెటర్లను నియమిస్తూ నాలుగు రూట్లుగా విభజించడం జరిగిందన్నారు. విద్యాశాఖ, రెవెన్యూ, పోలీస్ శాఖల నుండి మూడు ఫ్లైయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశామన్నారు. ఎప్పటికప్పుడు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయడం జరుగుతుందన్నారు. పరీక్షలు వ్రాసే విద్యార్థులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా మార్చి 1 నుండి ఏప్రిల్ 2వరకు నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్‌శాఖ ఈఈ బిక్షపతిని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఉదయం 9నుండి మధ్యాహ్నాం 12.30గంటల వరకు 144సెక్షన్ విధించాలని, పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఆ సమయంలో జీరాక్స్ సెంటర్‌లు మూసివేయించాలని ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా ఒఆర్‌ఎస్ పాకెట్‌లు, ఫస్ట్ ఎయిడ్‌చికిత్స, టీఎస్ ఆర్టీసీ ద్వారా విద్యార్థులు సకాలంలోపరీక్షా కేంద్రాలకు హాజరయ్యే విధంగా బస్సులు నడపాలని కోరారు. మంచినీటి సౌకర్యం కల్పించాలన్నారు.

దేశ భవితకు భరోసా కావాలి
సమాజాన్ని మార్చగలిగే శక్తి యువతకే ఉంది * మహబూబాబాద్ ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి
మహబూబాబాద్, ఫిబ్రవరి 17: క్రమశిక్షణ, సమాజ సేవాగుణం ఉన్న యువత దేశ భవితకు ఆసరా అవుతుందని, అలాంటి యువత అభివృద్ధి చెందాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అన్నారు. బయ్యారం మండలకేంద్రంలో శనివారం పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో 2కె రన్ నిర్వహించారు.
ఇల్లందు ఎమ్మెల్యే కొరం కనకయ్య పచ్చజెండా ఊపి 2కె రన్ ప్రారంభించారు. జాయింట్ కలెక్టర్ దామోదర్‌రెడ్డి, మహబూబాబాద్ డీఎస్పీ నరేష్‌కుమార్‌తో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ 2కె రన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి సాదిస్తుందన్నారు. అలాంటి మంచి మార్పు రావాలంటే యువత చేతుల్లోనే ఉందన్నారు. మానసిక దారుఢ్యం, శారీరక దారుఢ్యం గల యువత సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. చెడు వ్యసనాలకు, చెడు ఆలోచనలకు దూరంగా ఉంటూ వ్యక్తిగత అభివృద్ధితోపాటు సమాజ అభివృద్ధికి సాయపడాలని సూచించారు. నేరప్రవృత్తికి దూరంగా ఉండాలని, ఎలాంటి చట్టవ్యతిరేక శక్తుల సమాచారం ఉన్నా తక్షణమే పోలీస్‌శాఖకు అందజేయాలని తెలిపారు.
ఎలాంటి సహకారం కావాల్సి వచ్చినా అందించడానికి మహబూబాబాద్ జిల్లా పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉంటుందని, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో ముందుకు సాగేందుకు కృషిచేస్తున్నామన్నారు. 2కె రన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గార్ల, బయ్యారం పోలీస్ సర్కిల్ సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన అభినదించారు. పెద్ద సంఖ్యలో యువతి యువకులు, విద్యార్థులు ఈ 2కె రన్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ప్రజా సమస్యలను విస్మరిస్తున్న ప్రభుత్వం
టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా నిలువనున్న బీజేపీ * పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా. లక్ష్మణ్
జనగామ టౌన్, ఫిబ్రవరి 17: రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కే. లక్ష్మణ్ ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌నుండి సూర్యపేట వెళ్తు ఆయన జనగామ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పాల్గొని వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక పోరాటాలు, త్యాగాల పునాదులపై ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీ ఆర్ అవకాశవాద రాజకీయలు చేస్తూ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కొత్తకొత్త పథకాలను ప్రవేశపెడుతున్నానని గొప్పగా ప్రకటించుకుంటున్నాడే తప్పా, అవి అమలుకు నోచుకోవడం లేదని అన్నారు. ఉద్యమ సమయంలో ప్రాణాలను తెగించి పోరాడిన ఉద్యమ కారులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్ని అవినీతి మయమయ్యాయని అన్నారు. మద్య దళారులకు తమ పార్టీ నాయకులకు మాత్రమే అవి ఉపయోగ పడుతున్నాయని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ పట్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వం నమ్మక ద్రోహం చేస్తుందని అన్నారు. బీజేపీ ఇచ్చిన మాట ప్రకారం వర్గీకరణ కోసం కట్టుబడే ఉందని పునరుద్ఘాటించారు. ఈ అంశంపై జాతీయ పార్టీ పూర్తిగా అవగాహనతో ముందుకెళుతుందని తెలిపారు. రాష్ట్రంలో రానున్న రోజుల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా నిలువనుందని అన్నారు. ఇప్పటివరకు అన్ని జిల్లాలో పార్టీని పటిష్టం చేయడానికి సభలు, సమావేశాలు నిర్వహించామని, అలాగే త్వరలో కార్యకర్తల్లో రాజకీయ చైతన్యాన్ని పెంపొందించేందుకు శిభిరాలు ఏర్పాటుచేస్తామని వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు విద్యాసాగర్‌రెడ్డి, అంజన్‌గౌడ్, జిల్లా అధ్యక్షుడు కేవీ ఎల్ ఎన్‌రెడ్డి, నియోజక వర్గ కన్వీనర్ సౌడ రమేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ నాగారపు వెంకట్, కౌన్సిలర్ అనురాధ, నాయకులు హరిశ్చంద్రగుప్త, పొంతం శ్రీనివాస్, శివరాజ్ యాదవ్, పిట్టల సత్యంలు పాల్గొన్నారు.