పశ్చిమగోదావరి

ఇదిగో అభివృద్ధి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లిగూడెం, ఫిబ్రవరి 23 : రాష్ట్రంలో అభివృద్ధి కోసం అనేక సంస్థల ఏర్పాటుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, ఎంపి కంభంపాటి హరిబాబు, జిల్లా అభివృద్ధికి నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు విశేష కృషి చేస్తున్నారని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఉద్ఘాటించారు. శుక్రవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు హరిబాబు, ఎంపీ గంగరాజు ఏం చేశారంటూ జడ్పీ ఛైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు చేసిన విమర్శపై ఘాటుగా స్పందించారు. జాతీయ సాంకేతిక విద్యాసంస్థ (నిట్)ను తరలించేందుకు జరిగిన వ్యవహారంలో మీ పాత్ర ప్రజలందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. నిట్ తరలింపు విషయమై మున్సిపల్ ఛైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ మిమ్మల్ని నిలదీసిన ఘటనను ప్రస్తావించారు. గూడెంలో అభివృద్ధి, నిట్ స్థాపనను అడ్డుకునేందుకు మీరు ప్రయత్నించిన విషయం ప్రజలకు అవగతమేనని పేర్కొన్నారు. నిట్ ప్రహరీ గోడ కూడా కేంద్ర నిధులతో నిర్మించలేదంటూ జడ్పీ ఛైర్మన్ విమర్శించడాన్ని తప్పుబట్టారు. రాష్ట్రం భూమిని సమకూర్చి ప్రహరీ గోడ నిర్మించి ఇస్తే కేంద్ర ప్రభుత్వం గోడకు అయ్యే ఖర్చును తిరిగి చెల్లిస్తుందన్నారు. నాయకులు అవగాహనతో మాట్లాడాలని హితవు పలికారు. ఈ గోడ నిర్మాణం జాప్యం కావడానికి జడ్పీ ఛైర్మన్ పాత్ర ఉందని, ఆ కారణంగానే రెండున్నరేళ్లుగా పూర్తి కాలేదన్నారు. సీఎం చంద్రబాబు సహకారంతో పాత కాంట్రాక్టర్‌ను మార్చి కొత్త టెండర్లు పిలిచి నిర్మాణం చేపట్టామన్నారు.
అందరి ముత్తాతలది...!
వందల కోట్ల విలువైన భూమిని నిట్‌కు ఇచ్చామంటూ జడ్పీ ఛైర్మన్ బాపిరాజు చేసిన వ్యాఖ్యపై మంత్రి మాణిక్యాలరావు తీవ్రంగా స్పందించారు. ఈ ప్రాంతంలో తమ తాత ముత్తాతలు, ఇక్కడి వారందరి ముత్తాతల ఆస్తిని రెండోప్రపంచ యుద్ధ సమయంలో ప్రభుత్వానికి ఇచ్చామన్నారు. నిట్‌కు తొలిదశలో రూ.189కోట్లతో టెండర్లు ఖరారు అయ్యాయని, రెండోదశ నిర్మాణానికి రూ.183కోట్లతో సవివరమైన ప్రాజెక్టు నివేదికను సమర్పించడం జరిగిందన్నారు. ఆరు నెలల్లో తొలిదశ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ప్రీ కాస్టింగ్ టెక్నాలజీతో కృషి జరుగుతుందన్నారు.
విశాఖలో కేంద్రీయ విద్యాసంస్థలు
విశాఖ ఎంపి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు హరిబాబు కృషితోనే అక్కడ ఐఐఎం, ఎంఎస్‌ఎంఇ టెక్నాలజీ సెంటర్, పెట్రో ఎనర్జీ వర్సిటీ, మానసిక ఆరోగ్య ప్రాంతీయ కేంద్రం, రిఫైనరీ విస్తరణ, ఆకాశవాణి, విశాఖ - చెన్నై కారిడార్‌కు వేల కోట్లు మంజూరు, స్టీలు ప్లాంట్ విస్తరణ, మరో 15 విద్యాసంస్థలు త్వరలో ప్రారంభం కానున్నాయన్నారు. రైల్వే జోన్ విషయంలోనూ అడ్డంకులు తొలగిస్తున్నారన్నారు. అలాగే, నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు జిల్లాలో నిట్ ఏర్పాటుకు కృషి చేశారన్నారు. 216 నెంబరు జాతీయ రహదారిని నాలుగు లైన్లకు విస్తరణ, పాస్‌పోర్టు కేంద్రం, ఎన్ ఆర్ ఇజి ఎస్ నిధులు మంజూరు కృషి చేశారన్నారు. ఇకనైనా అభివృద్ధికి కలిసి రావాలని, ఏ సలహాలు ఇచ్చినా స్వీకరిస్తామన్నారు.

కేంద్ర పథకాలను ప్రజలకు వివరించాలి
బీజేపీ జిల్లా అధ్యక్షుడు వర్మ
మొగల్తూరు, ఫిబ్రవరి 23: ప్రజా సంక్షేమం నిమిత్తం కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను పార్టీ కార్యకర్తలు గ్రామస్థాయి నుంచీ ప్రజలకు తెలయజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాస్‌వర్మ అన్నారు. శుక్రవారం మొగల్తూరు గ్రామంలో సినీ నటుడు, రెబల్‌స్టార్ కృష్ణంరాజు స్వగృహంలో నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని శక్తిశాలి భూత్ కమిటీ సభ్యులు సమావేశం బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు దాసరి బాబి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వర్మ మాట్లాడుతూ త్వరలో ప్రతి మండలం బీజేపీ ద్వారా శక్తి మండలాలుగా ఎదగాలనేది కేంద్ర పార్టీ ఆశయమని, అందుకనుగుణంగా పార్టీ బలోపేతానికి ప్రతి సభ్యుడు కృషిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. రానున్న కాలంలో బీజేపీ అధిష్ఠానవర్గం ఆదేశాల మేరకు మనమంతా నడుచుకోవాలన్నారు. రాష్ట్భ్రావృద్ధికి కేంద్రం తగినన్ని నిధులు అందిస్తున్నా ప్రచారం మాత్రం అదంతా టీడీపీ గొప్పగా ప్రచారం జరుగుతోందన్నారు.