క్రైమ్/లీగల్

మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన యువకుడిపై చర్యలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాళ్ల, మార్చి 14: మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన యువకుడిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల బాలిక కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాళ్ల మండలం దొడ్డనపూడి గ్రామానికి చెందిన కొల్లి వెంకట సత్యనారాయణతోపాటు అతని సోదరుడు నరసింహారావు, తండ్రి మారేశ్వరరావు విలేఖర్ల వద్ద తమ గోడు వెళ్లగక్కారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన తాము గుట్టుచప్పుడు కాకుండా జీవితాన్ని వెళ్లబుచ్చుకుంటున్నామన్నారు. తమ కుమార్తె (14) స్థానిక జడ్పీ హైస్కూల్లో 10వ తరగతి చదువుతుందన్నారు. అయితే గత నెల 20వ తేదీన తమ గ్రామానికి చెందిన యువకుడు వడ్డి సతీష్ ఇంటి నుండి బయటకు తీసుకువెళ్లిపోయాడన్నారు. అయితే ఈ విషయమై కాళ్ల పోలీసులకు ఫిర్యాదు చేశామని బాలిక తండ్రి సత్యనారాయణ వివరాలు తెలిపారు. తమ కుమార్తెను తిరిగి 23వ తేదీన తమకు అప్పగించారన్నారు. బాలికను సతీష్ వివాహం చేసుకున్నాడన్నారు. ఈవిషయంపై కాళ్ల పోలీసులు ఎటువంటి కేసు నమోదు చేయకపోవడంతో యువకుడు సతీష్ తమ ముందే స్పీడ్‌గా బైక్ తోలుతూ మమ్మల్ని హేళన చేస్తున్నాడని వివరించారు. తమ కుటుంబానికి భద్రత కల్పించి తమకు న్యాయం చేకూర్చాలని డిమాండ్ చేశారు. కేసు నీరుగార్చే విధంగా పోలీసులు వ్యవహరించడం పట్ల తండ్రి సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మైనర్ బాలిక జీవితాన్ని అల్లరి పాల్జేసిన యువకుడిపై కేసు నమోదు చేయకుండా తాత్సారం చేస్తున్న పోలీసులపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

కేసు నమోదు
మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన సంఘటనకు సంబంధించి కాళ్ల పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. కాళ్ల మండలం దొడ్డనపూడి గ్రామానికి చెందిన కొల్లి వీర వెంకట సత్యనారాయణ కుమార్తె (14)ను అదే గ్రామానికి చెందిన వడ్డి సతీష్ వేధిస్తుండేవాడని పోలీసులు తెలిపారు. అయితే గత నెల 19వ తేదీ రాత్రి నుండి తమ కుమార్తె కనిపించడం లేదని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై వడ్డి సతీష్‌పై కాళ్ల ఎస్సై రాజ్‌కుమార్ కిడ్నాప్ కేసు నమోదు చేశారు.