పశ్చిమగోదావరి

రాష్ట్రంలో మిగిలేది టిడిపి ఒక్కటే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లజర్ల, ఏప్రిల్ 19: వైసిపిపై నమ్మకం పోయిందని, అందువల్ల ఆ పార్టీని వీడి ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారని, భవిష్యత్తులో రాష్ట్రంలో మిగిలేది టిడిపియేనని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్రనాథ్ పేర్కొన్నారు. స్థానిక టిడిపి నాయకత్వ శిక్షణ శిబిరానికి మంగళవారం ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన శిక్షణ పూర్తిచేసుకున్న వారికి సర్ట్ఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అసమర్ధ ప్రతిపక్షం ఉందని విమర్శించారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమానికి అడ్డుతగులుతూ ఇబ్బందులు సృష్టిస్తుందన్నారు. ప్రజలు మన పక్షాన ఉన్నారని, తెలుగు ప్రజలకు సేవచేయడానికి స్వర్గీయ ఎన్టీరామారావు పార్టీని స్థాపిస్తే ఇదే ఆశయాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు కొనసాగిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అమలుచేసే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదేనన్నారు. ఆంధ్రాను కరవురహిత రాష్ట్రంగా చేయాలనే సంకల్పంతో అన్ని ప్రాజెక్టులు పూర్తిచేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. వ్యవసాయ రంగంలో అధునాతన విధానాలను అవలంబిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి, శిక్షణా శిబిరం సంచాలకులు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, జడ్పీటీసీ సభ్యురాలు కొఠారి అనంతలక్ష్మి, ఎంపిపి జమ్ముల సతీష్, శిక్షకులు దారపు నాగిరెడ్డి, శివశ్రీ తదితరులు పాల్గొన్నారు.