పశ్చిమగోదావరి

ఘనంగా శ్రీనివాసుని తిరు కళ్యాణ మహోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఏప్రిల్ 20 : స్థానిక రామచంద్రరావుపేటలో కొలువై వున్న శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఈ నెల 17వ తేదీ నుంచి జరుగుతున్న శ్రీవారి 29వ వార్షిక వైశాఖ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీవారి తిరుకళ్యాణ మహోత్సవం ఘనంగా శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. తొలుత ఎదుర్కోలు సన్నాహం జరిపారు. ధర్మకర్తల మండలి ఛైర్మన్ శలా మాణిక్యాలరావు మాట్లాడుతూ శ్రీవారి తిరుకళ్యాణ మహోత్సవాన్ని జరిపారు. ఆలయ అర్చకులు ఇల్లిందల శ్రీనివాసాచార్యులు, కిళాంబి మారుతీ శ్రీనివాస రామానుజాచార్యులు, టిటిడి ప్రధాన అధ్యాపకులు జి ఎవి దీక్షితుల శిష్యబృందం కళ్యాణ మహోత్సవాన్ని, పూజలు జరిపించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి బి కిషోర్‌కుమార్, సిబ్బంది గంగాధర్, సాయి, శ్రీనివాస్‌ల బృందం భక్తులకు తగు సేవలు అందించారు. ధర్మకర్తల మండలి సభ్యులు నల్లా కాశీ విశే్వశ్వరరావు, జంపా సూర్యనారాయణ, బెల్లంకొండ శ్రీలక్ష్మి, ఉంగరాల వీరవెంకట సత్యనారాయణ, ఈతకోట శ్రీనివాసరావు, గుండాల రేణుక, చింతా రాజు, పోకూరి కిషన్‌లు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీకృష్ణ గోవింద సేవా బృందం ప్రతినిధులు కుమార్, బోస్, నాగేశ్వరరావు, రాజు తదితరులు భక్తులకు తగు సేవలు అందించారు. నగరానికి చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు కోలాహలంగా శ్రీవారి తిరుకళ్యాణ మహోత్సవాలకు హాజరై తిలకించి స్వామివారిని దర్శించుకుని, మొక్కుబడులు చెల్లించుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. గోవిందనామస్మరణతో ఆలయ ప్రాంతం మార్మోగింది. తిరుకళ్యాణ మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వేదిక, ఏర్పాట్లు, పంచరంగుల విద్యుద్దీపాలంకరణ, వేద మంత్రోచ్ఛరణ, భాజీభజంత్రీలు భక్తులను ముగ్ధులను చేశాయి.

ఎమ్మెల్యే పులపర్తి దీక్ష
భీమవరం, ఏప్రిల్ 20: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు మద్దతుగా శుక్రవారం నాడు భీమవరంలోని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు దీక్ష చేశారు. ఆయనతో పాటు పార్టీ సీనియర్ నాయకులు, ఆర్టీసి రీజియన్ చైర్మన్ మెంటే పార్ధసారధి దీక్షలో పాల్గొన్నారు. పట్టణ అధ్యక్షులు తోట భోగయ్య, భీమవరం మాజీ ఎంపీపీ, పార్టీ అధ్యక్షులు బర్రె నెహ్రు, వీరవాసరం మండల అధ్యక్షులు సత్యనారాయణ హాజరయ్యారు. జడ్పీటీసీ బర్రె విజయ, మున్సిపల్ చైర్మన్ కోటికలపూడి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.