పశ్చిమగోదావరి

గ్రామసభలు బహిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, ఏప్రిల్ 20: ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు ఆయా గ్రామాల్లో జరిగిన గ్రామసభలను నిర్వాసితులు బహిష్కరించారు. శుక్రవారం తూటిగుంట, కురుటూరు పంచాయతీల్లో జరగాల్సిన గ్రామసభలు జరగలేదు. నిర్వాసితులకు ఇవ్వాల్సిన ఇళ్లు, చెట్లకు సంబంధించిన నష్టపరిహారం రెండేళ్ల క్రితమే అవార్డు పాసైనా ఇప్పటివరకు చెల్లించలేదనేది నిర్వాసితుల ప్రధాన సమస్య. అలాగే 18 ఏళ్లు నిండిన యువతులకు ప్యాకేజీ అమలు, పోడు భూములతో పట్టాల్లాంటి సమస్యలపై గతంలో జరిగిన గ్రామసభల్లో వినతిపత్రాలు ఇచ్చినా ఇప్పటివరకు ఆ సమస్యలపై అధికారులు దృష్టిపెట్టలేదని నిరసన వ్యక్తం చేస్తూ గ్రామసభలను నిర్వాసితులు బహిష్కరించారు. సభలు నిర్వహించేందుకు వెళ్లిన ఆర్డీవో కె మోహన్‌కుమార్, తహసీల్దార్ సీహెచ్ రవికుమార్, ఇతర శాఖల అధికారులు వెనుదిరిగారు.

జగన్ పాదయాత్రలో ఉండి నాయకులు
ఆకివీడు, ఏప్రిల్ 20: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఆకివీడుకు చెందిన ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు. జగన్ పాదయాత్ర 1800 కిలోమీటర్లకు చేరుకున్న సందర్భంగా కృష్ణాజిల్లా మైలవరం గ్రామంలో ఆకివీడు వైసీపీ జిల్లా యువజన విభాగం కన్వీనర్ అంబటి రమేష్, మండల మహిళా అధ్యక్షురాలు మోరా జ్యోతి, మండల యువజన కార్యదర్శి కేశిరెడ్డి దిలీప్‌లు వైఎస్ జగన్‌ను కలిశారు. ఉండి నియోజకవర్గ సమన్వయకర్త పివియల్ నర్సింహరాజు నియోజకవర్గంలో చేపడుతున్న పల్లెనిద్ర, రచ్చబండ కార్యక్రమాలను వివరించినట్లు తెలిపారు.

నమ్మకాన్ని నట్టేట ముంచిన కేంద్రం
కొవ్వూరు, ఏప్రిల్ 20: నవ్యాంధ్రప్రదేశ్ నమ్మకాన్ని కేంద్ర ప్రభుత్వం నట్టేట ముంచిందని రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్ అన్నారు. శుక్రవారం సీఎం చంద్రబాబు చేబట్టిన ధర్మపోరాట దీక్షకు మద్దతుగా కొవ్వూరు నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు స్థానిక ఆర్టీసీ డిపో వద్ద రిలే దీక్ష చేబట్టారు. ఈ దీక్షలో పాల్గొన్న ఎంపీ మురళీమోహన్ మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే వరకూ ధర్మపోరాటం కొనసాగుతుందన్నారు. రాష్ట్రానికి బీజేపీ తీరని అన్యాయం చేసిందని, ప్రజలంతా టీడీపీ చేసే పోరుకు సంపూర్ణ మద్దతునీయాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు జెవిఎస్ చౌదరి, కంఠమని రామకృష్ణ, పి శ్రీనివాస్, ఎ చక్రధరరావు, ఎం శివరామకృష్ణతోపాటు కొవ్వూరు పట్టణ, మండలానికి చెందిన టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.