పశ్చిమగోదావరి

శ్రీవారికి రూ. 1.65 కోట్ల హుండీ ఆదాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్వారకాతిరుమల, మే 21: రాష్ట్రంలో ప్రధాన దేవాలయాల్లో ఒకటైన ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి గడచిన 18 రోజులకు హుండీల ద్వారా 1.65 కోట్ల రూపాయల భారీ ఆదాయం సమకూరింది. అలాగే రోజుకు సగటున రికార్డుస్థాయిలో 9,20,883 రూపాయల ఆదాయం సమకూరినట్టు ఆలయ ఈవో వేండ్ర త్రినాధరావు తెలిపారు. ఆలయ ఆవరణలో సోమవారం శ్రీవారి హుండీల లెక్కింపు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి నగదు రూపేణా 1,65,77,868 రూపాయల ఆదాయం సమకూరినట్టు ఈవో త్రినాధరావు వివరించారు. అలాగే భక్తుల కానుకల రూపేణా 445 గ్రాముల బంగారం, 6.760 కిలోల వెండి లభించినట్టు ఆయన పేర్కొన్నారు. అలాగే యుఎస్, కెనడా, సింగపూర్, ఆస్ట్రేలియా, జపాన్, భూటాన్ వంటి 17 దేశాల విదేశీ కరెన్సీ భారీగా సమకూరినట్టు ఈవో తెలిపారు.

మే నెలాఖరుకు అన్ని పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు
*గిరిజన సంక్షేమశాఖ డిడి మల్లికార్జునరెడ్డి
బుట్టాయగూడెం, మే 21: 201819 విద్యాసంవత్సరానికి గిరిజన సంక్షేమ పాఠశాలలకు అవసరమైన పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు మే నెలఖారుకు అందచేయనున్నట్టు గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటి డైరెక్టర్ బి.మల్లికార్జునరెడ్డి తెలిపారు. కోటరామచంద్రపురం ఐటీడీఏ సమావేశ మందిరంలో సోమవారం గిరిజన సంక్షేమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఆశ్రమ పాఠశాలల సంరక్షకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిడి మాట్లాడుతూ పాఠశాలలు తెరిచేనాటికి పాఠశాలల్లో విద్యార్థులకు కావలసిన అన్ని వౌలిక వసతులను ఏర్పాటుచేయాలని, అవసరమైన వాటికి మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఈ ఏడాది మార్చి నెలలో జరిగిన పదవ తరగతి పరీక్షల్లో తక్కువ ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల ఉపాధ్యాయులకు, సబ్జెక్టు ఉపాధ్యాయులకు మెమోలు ఇవ్వనున్నట్టు తెలిపారు.