పశ్చిమగోదావరి

తాడేపల్లిగూడెంలో పశుగణాభివృద్ధి సంస్ధ నూతన భవనం 24న ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మే 21: తాడేపల్లిగూడెంలో కోటి 50 లక్షల రూపాయలతో జిల్లా పశుగణాభివృద్ధి సంస్ధ నూతన భవనాన్ని ఈ నెల 24వ తేదీన ప్రారంభిస్తున్నట్లు జిల్లా పశుగణాభివృద్ధి సంస్ధ ఛైర్మన్ పాకలపాటి గాంధీ చెప్పారు. స్ధానిక కలెక్టరేట్‌లో సోమవారం జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్‌ను ఆయన కలుసుకుని భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలో పశుగణాభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. జిల్లాలో సైలేజ్ యంత్రాలు కొనుగోలుకు 75 శాతం సబ్సిడీ అందిస్తున్నామన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సైలేజ్ యంత్రం ద్వారా గడ్డి తయారుచేసే ఈ యంత్రం కోటి రూపాయలు ఖరీదుకాగా 75లక్షల రూపాయలు సబ్సిడీ రూపంలో అందిస్తున్నామని, ఇప్పటికే ఇటువంటి యంత్రాలు నాలుగు మంజూరు చేశామన్నారు. అదేవిధంగా చిన్నతరహాలో 13 లక్షల రూపాయలకు సైలేజ్ యంత్రాలు కొనుగోలు చేయడానికి ముందుకువస్తే 75 శాతం సబ్సిడీ కూడా రైతులకు అందిస్తామన్నారు. జిల్లాలో ప్రయోగాత్మకంగా 25 ఆవులకు టెస్ట్ ట్యూబ్ బేబీలను కృత్రిమ గర్భోత్పత్తి ద్వారా వెలుగులోనికి తీసుకురావాలని చర్యలు చేపట్టామని, ఈవిధానం విజయవంతమైతే 20 లీటర్లకు తగ్గకుండా పాలు అందించే ఆవులను సమాజంలో పెంపొందించవచ్చునన్నారు. జిల్లాలో 200 గోపాలమిత్రల ద్వారా పశువుల నుండి సెరంను సేకరించి కృత్రిమ గర్భోత్పత్తి ద్వారా ఆధునిక పశుసంపదను పెంపొందిస్తామన్నారు. జిల్లాలో పశువులకు గడ్డి కొరత లేకుండా సైలేజ్ గడ్డిని పెద్దఎత్తున సబ్సిడీపై రైతులకు అందిస్తున్నామని, ఇప్పటివరకు 5వేల మెట్రిక్ టన్నుల సైలేజ్ గడ్డిని అందించామని, మరో 5 వేల టన్నులు రైతులకు అందించనున్నట్లు చెప్పారు. కేజీ 6.80 రూపాయలు ఖరీదు చేసే ఈ గడ్డిని రైతులకు రెండురూపాయలకే అందిస్తున్నామన్నారు. జిల్లాలోని 200 గోపాలమిత్ర పశు ఆసుపత్రులలో 34 భవనాలు మంజూరు చేశామని, త్వరలోనే అన్ని గోపాలమిత్ర పశు ఆసుపత్రులకు పక్కా భవనాలు నిర్మిస్తామన్నారు.

కలెక్టర్ సీసీ ఔదార్యం
*మీకోసం ఫిర్యాదుదారులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ
ఏలూరు, మే 21: మీకోసంకు వచ్చే ఫిర్యాదుదారులకు దప్పిక తీర్చడానికి కలెక్టరు సిసి టి ప్రభాకర్‌మూర్తి 400 మజ్జిగ ప్యాకెట్లను ఉచితంగా పంపిణీ చేశారు. స్ధానిక కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే మీకోసం కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి పెద్దఎత్తున ఫిర్యాదుదారులు వచ్చి కలెక్టరుకు వినతిపత్రాలు సమర్పిస్తూ ఉంటారు. వేసవితాపాన్ని దృష్టిలో ఉంచుకుని ఫిర్యాదుదారులకు తన సొంత సొమ్ముతో మజ్జిగ ప్యాకెట్లు కొనుగోలు చేసి ప్రభాకర్‌మూర్తి పంపిణీ చేశారు. ప్రతియేటా కొంతమంది అధికారులు, ఉద్యోగులు వేసవిలో మజ్జిక ప్యాకెట్లు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందని, ఈ కార్యక్రమం వచ్చేవారం కూడా కొనసాగుతుందని ప్రభాకర్‌మూర్తి చెప్పారు. సమాజంలో ఎవరి పరిధిలో వారు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయటం ఎంతో మంచిదని, భవిష్యత్‌లో ఇదే సంప్రదాయాన్ని కొనసాగించడానికి ఉద్యోగులు ముందుకు రావాలని ఆయన కోరారు.

చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలి
*ఎక్సయిజ్ శాఖ మంత్రి జవహర్
కొవ్వూరు, మే 21: రాష్ట్భ్రావృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిరంతరం శ్రమిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి విజయం చేకూర్చి తిరిగి చంద్రబాబునాయుడిని ముఖ్యమంత్రిని చేయడానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని రాష్ట్ర ఎక్సయిజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ కోరారు. స్థానిక లిటరరీ క్లబ్‌లో సోమవారం కొవ్వూరు నియోజకవర్గస్థాయి మినీ మహానాడు జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జవహర్ తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్‌కు నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబునాయుడును గెలిపిస్తే పోలవరం, అమరావతి పూర్తి చేసుకోగలుగుతామన్నారు. రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రజా సంక్షేమానికి చంద్రబాబు కృషిచేస్తున్నారని, భావితరాలు అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలన్నారు. జిల్లాలో జగన్ పాదయాత్ర పేరుతో ముద్దులు పెడుతున్నారు తప్ప ప్రజా సంక్షేమం పట్టించుకోవడం లేదన్నారు. జగన్ పాదయాత్ర వల్ల ఏం జరుగుతుందోనని అందరూ ఆందోళన చెందుతున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో పొత్తు లేకుండా స్వతంత్రంగా పోటీ చేసి 140 స్థానాలు కైవసం చేసుకుంటామని మంత్రి జవహర్ ధీమా వ్యక్తం చేశారు. కొవ్వూరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దామన్నారు. రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యుడు మాగంటి మురళీమోహన్ మాట్లాడుతూ తిరుపతిలో వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని, రైల్వే జోన్ ప్రకటిస్తామని హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ఆ విషయాన్ని మరిచి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని మభ్య పెడుతున్నారన్నారు. విశాఖలో సింహాద్రి అప్పన్న సాక్షిగా, విజయవాడలో కనకదుర్గమ్మ సాక్షిగా ప్రధాని ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ఆ దేవుళ్లు కూడ ఆయనపై కనె్నర్ర చేస్తారన్నారు. ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బీజేపీని నిలదీయడంతో ఆ పార్టీ ప్లేటు మార్చి జగన్‌కు మద్దతు ఇస్తున్నారన్నారు. అవినీతి పరులైన, జైలుకెళ్లిన నాయకులు మనకు వద్దని, నిజాయితీకి మారుపేరైన చంద్రబాబును గెలిపించాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర హస్తకళల సంస్థ ఛైర్మన్ పాలి ప్రసాద్, పార్టీ పరిశీలకులు రాయపాటి రంగబాబు, జిల్లా ఉపాధ్యక్షులు చెలికాని సోంబాబు, కొవ్వూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్ జె రాధారాణి, టీడీపీ నాయకులు జెవిఎస్ చౌదరి, కెవికె రంగారావు, వేగి చిన్న, అనుపిండి చక్రధరరావు, సూరపని చిన్ని, కాకర్ల బ్రహ్మాజీ, మద్దిపట్ల శివరామకృష్ణ, డి రాజారమేష్, ఆళ్ల హరిబాబు, బూరుగుపల్లి వీర్రాఘవులు తదితరులు పాల్గొన్నారు. స్వామినాధన్ కమిషన్ ఇచ్చిన రిపోర్టును వెంటనే అమలు చేయాలని, రైతులకు పెట్టుబడిగా ఎకరాకు పదివేల రూపాయల సాయం అందించాలని, కొవ్వూరు ప్రభుత్వాసుపత్రిని ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని, కొవ్వూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని తదితర తీర్మానాలను సమావేశంలో ప్రవేశపెట్టగా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ మినీ మహానాడులో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ పి జీవనజ్యోతి టీడీపీలో చేరారు. ఆమెను మంత్రి జవహర్, ఎంపీ మురళీమోహన్ అభినందించారు. అంతకుముందు ఎన్టీఆర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.