పశ్చిమగోదావరి

చెరువులను అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే మొడియం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, జూలై 15: పోలవరం మండలంలో చెరువులను అభివృద్ధి చేసి వ్యవసాయానికి నీటి కొరత లేకుండా చేస్తానని పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం ప్రాజెక్టు కుడికాల్వ నుండి కొత్తూరు చెరువులోకి నీరు వెళ్లేందుకు 32 లక్షలతో నిర్మించిన రెగ్యులేటరును ఆయన ప్రారంభించి రైతులతో మాట్లాడారు. రెగ్యులేటరు ద్వారా డిసెంబరు వరకు నీటిని చెరువులోకి పంపుకొనే అవకాశం ఉందని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే సంవత్సరం పొడవునా నీటిని చెరువులోకి మళ్లించవచ్చన్నారు. దాంతో కొత్తూరు చెరువు ఆయకట్టులోని రెండువేల ఎకరాల్లో మూడు పంటలు పండించుకోవచ్చన్నారు. అలాగే కొత్తూరు చెరువు నుండి పాతపట్టిసం, కొత్తపట్టిసం, గూటాల గ్రామాల పరిధిలో ఉన్న చెరువులను అనుసంధానం చేయడం ద్వారా మండలంలోని పొలాలకు నీటి సరఫరాకు లోటు ఉండదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తున్నారని, రైతులు అడిగిన వెంటనే రెగ్యులేటరు నిర్మాణానికి 32 లక్షలు మంజూరు చేశారన్నారు. అలాగే కొత్తూరు చెరువును అభివృద్ధి చేయడంతో పాటు రైతులు కోరిక మేరకు చెరువు విస్తీర్ణంపై సర్వే చేయించి ఆక్రమణలో ఉన్న భూములను స్వాధీనం చేసుకునేందుకు కృషిచేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ ఎం సోంబాబు, వైస్ ఛైర్మన్ కుంచే దొరబాబు, మండల టీడీపీ అధ్యక్షుడు పాబోలు రత్తయ్య, చెరువు అధ్యక్షుడు జల్లేపల్లి బ్రహ్మయ్య, బొరగం శ్రీనివాసరావు, జల్లేపల్లి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
బస్‌షెల్టర్ నిర్మాణం అభినందనీయం: ఎమ్మెల్యే గన్ని
భీమడోలు, జూలై 15 : ప్రయాణీకుల సౌకర్యార్ధం జాతీయ రహదారిపై గల భీమడోలు వంతెన వద్ద దాతల సహకారంతో బస్సు షెల్టరు నిర్మించడం అభినందనీయమని ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు అన్నారు. భీమడోలుకు చెందిన గోనుగుంట పాండురంగారావు కుటుంబ సబ్యులు ఆయన జ్ఞాపకార్ధం 1.50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన బస్‌షెల్టర్‌ను ఎమ్మెల్యే ఆదివారం ప్రారంభించారు. నిర్మాణానికి సహకరించిన దాతలు పాండురంగారావు కుటుంబ సభ్యులను అభినందించారు. సత్కరించారు. కార్యక్రమంలో భీమడోలు సర్పంచ్ శిరీష యుగంధర్, జన్మభూమి కమిటీ సభ్యులు పి యుగంధర్, ఎ ఎంసి మాజీ ఛైర్మన్ డి పుల్లయ్యనాయుడు, యర్రంశెట్టి ఏడుకొండలు పాల్గొన్నారు.