పశ్చిమగోదావరి

చినవెంకన్నకు 65 గ్రాముల బంగారు హారం బహూకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్వారకాతిరుమల, జూలై 19: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ఇద్దరు మహిళా భక్తులు 65 గ్రాముల బంగారు హారాన్ని సమర్పించుకున్నారు. దీని విలువ సుమారు రూ.2లక్షలు ఉంటుందని ఆలయ అధికారులు భావిస్తున్నారు. గుంటూరుకు చెందిన వెలగలేటి సత్యవతి, వెలగలేటి దుర్గాదేవి స్వామి, అమ్మవార్లను దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. అనంతరం ఈ బంగారు హారాన్ని ఆలయ ఛైర్మన్ రాజా ఎస్‌వి సుధాకరరావుకు అందజేసి, శ్రీవారు, అమ్మవార్లకు వినియోగించాలని కోరారు. ఈ మహిళా భక్తులు గతంలో దేవస్థానానికి అంబులెన్స్ సౌకర్యాన్ని కల్పించారు. అలాగే స్వామి, అమ్మవార్లకు బంగారు నగలు, వీల్ ఛైర్లు తదితర వాటిని అందజేసినట్టు ఛైర్మన్ తెలిపారు. ఈ సందర్భంగా దాతలను అభినందించారు. కార్యక్రమంలో దేవస్థాన ఈవో దంతులూరి పెద్దిరాజు పాల్గొన్నారు.
తాళ్లపూడి మద్యం షాపుపై వైసీపీ దాడి
తాళ్లపూడి, జూలై 19: మద్యం ఎమ్మార్పీ రేట్ల కంటే అదనంగా విక్రయించడంపై నిరసిస్తూ వైసీపీ కొవ్వూరు నియోజకవర్గ కన్వీనర్ తానేటి వనిత తమ పార్టీ కార్యకర్తలతో తాళ్లపూడిలోని బ్రాందీషాపుపై గురువారం రాత్రి ఆకస్మికంగా దాడిచేశారు. ఈ సందర్భంగా తానేటి వనిత మాట్లాడుతూ సాక్షాత్తూ ఎక్సైజ్ శాఖా మంత్రి సొంత నియోజకవర్గంలోనే మద్యాన్ని ఎమ్మార్పీ కంటే 20 నుంచి 80రూపాయల వరకు అదనంగా వసూలు ఆరోపించారు. మిగతా ప్రాంతాల కంటే కొవ్వూరు నియోజకవర్గంలోనే ఈపరిస్థితి ఏమిటని, మంత్రి అండదండలతోనే మద్యం మాఫియా, ఇతర మాఫియాలు చెలరేగిపోతున్నాయని ఆరోపించారు. పేదల కష్టాన్ని అదనపుధరలతో దోచుకుంటున్నారని, సంబంధిత శాఖ అధికారులు వచ్చి దీనిపై సమాధానం చెప్పే వరకు వెళ్లేదిలేదని ఆమె కార్యకర్తలతోపాటు బ్రాందీషాపు వద్దే ఉన్నారు. ఒకపక్క తానేటి వనిత దాడిచేయడాన్ని చూసి మద్యం షాపువారు అదనంగా డబ్బులు వసూలు చేసిన వారికి తిరిగి ఇచ్చేయడం విశేషం.