పశ్చిమగోదావరి

ప్రతి పేదకుటుంబానికి సొంతింటి కలను సాకారం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూలై 19: బహుళ అంతస్తు భవనాలు నిర్మించి ప్రతి పేదకుటుంబానికి సొంతింటి కలను సాకారం చేస్తామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి చెప్పారు. ఏలూరు మండలం శనివారపుపేటలో గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన పాదయాత్ర నిర్వహించారు. తమ సమస్యలను వినతిపత్రాల ద్వారా మహిళలు ఆయన దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. పాదయాత్రలో మహిళలు పెద్దఎత్తున పాల్గొని ఎమ్మెల్యే బడేటి బుజ్జిపై పూలవర్షం కురిపించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారపుపేటలో సొంతిల్లు లేని పేదలు 1100మందికి పైగా ఉన్నారని, వారందరికి శనివారపుపేటలోనే 25 ఎకరాల విస్తీర్ణంలో జిఫ్లస్ త్రీ బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి లాటరీ ద్వారా ఇళ్లు కేటాయిస్తామని, ఈవిషయంలో ఎవరి సిఫార్సులకు తావులేదని పేర్కొన్నారు. ఇళ్లు మంజూరు చేయిస్తామని కొంతమంది దళారులు తిరుగుతున్నారని, వారికి ఒకపైసా కూడా ఇవ్వవద్దని, ప్రభుత్వపరంగా పూర్తిసబ్బడితో స్ధలంతోపాటు ఇళ్లు కూడా నిర్మించి పేదలకు ఇవ్వాలన్నదే చంద్రబాబు ధ్యేయమని చెప్పారు. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత ఇల్లు నిర్మాణానికి స్ధలం సాధ్యం కావటం లేదని, ఇటువంటి స్ధితిలో జిఫ్లస్ 5 భవనాలు నిర్మించాలని తొలుత భావించామని, కానీ సాంకేతికంగా ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశ్యంతో జిఫ్లస్ త్రీ బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి పేదలందరికి ఇస్తామన్నారు. అర్హత ఉన్న ప్రతి పేదకుటుంబానికి పెన్షన్ అందిస్తున్నామని, ప్రతినెల మూడుకోట్ల రూపాయలు కేవలం ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని పెన్షన్‌దారులకు అందిస్తున్నామన్నారు. ఏలూరులో మెడికల్ కళాశాల త్వరలోనే ఏర్పాటుకానుందని బడేటి బుజ్జి చెప్పారు. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశ్యంతో దేశచరిత్రలో ఎక్కడాలేనివిధంగా జిల్లాలో మూడులక్షల మరుగుదొడ్లు నిర్మించి ఇచ్చామన్నారు. డ్వాక్రా మహిళలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాయితీలను కల్పిస్తున్నామని, భవిష్యత్‌లో కూడా తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తామన్నారు. శనివారపుపేట గ్రామాన్ని ఏలూరు నగరానికి ధీటుగా తీర్చిదిద్దుతామని, త్వరలోనే డ్రైన్లు, రోడ్లు, వీధిలైట్ల సౌకర్యం కల్పిస్తామన్నారు. 18నెలలు జైలుజీవితం గడిపి వచ్చిన ప్రతిపక్షనేత జగన్ నిత్యం చంద్రబాబును తిట్టడమే పనిగా పెట్టుకున్నారని, ఆయనకు రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. 2019లో జరగనున్న ఎన్నికలు ఎంతో కీలకమని, అభివృద్ధిని చూసి ఓటు వేయాలి తప్ప మోసపూరిత మాటలకు ప్రజలు ఆకర్షితులు కావద్దని ఆయన హితవు పలికారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మట్టా రాజేశ్వరి, సర్పంచ్ లూర్ధమ్మ, ఇన్‌ఛార్జి ఎంపిపి లంకలపల్లి మాణిక్యాలరావు, టిడిపి నేతలు వేమూరి శ్రీ్ధర్, సోమిశెట్టి రామ్మోహన్, ఆళ్ల మోహనరావు, కొట్టు మనోజ్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు దాసరి ఆంజనేయులు, కార్పోరేషన్ కోఆప్షన్ సభ్యులు ఎస్‌ఎంఆర్ పెదబాబు తదితరులు పాల్గొన్నారు.
ప్రక్కిలంకలో ఇసుక ఎగుమతులు నిలిపివేత
తాళ్లపూడి, జూలై 19: మండలంలో ఉచిత ఇసుకను అందించే ఏకైక రీచ్ ప్రక్కిలంకలో గురువారం ఇసుక ఎగుమతులు నిలిపివేశారు. ఎగుమతి ఛార్జీలు పెంచాలని కూలీలు కోరటంతో దాదాపుగా 30కుపైగా పడవలను వడ్డునే నిలిపివేశారు. పడవలు తిరగకపోవటంతో ఇసుకలేక వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదిలా ఉంటే..నిన్నటి వరకూ ఇసుక రీచ్‌లో కేవలం ఒక ట్రాక్టర్‌కు ఒక యూనిట్ ఇసుక మాత్రమే ఇస్తామని చెప్పారు. గురువారం నుంచి తిరిగి లారీలకు కూడా ఇసుక సరఫరా చేయాలని అధికారులు ఆదేశాలు జారీచేయటంతో లారీలు కూడా ఎక్కువ సంఖ్యలోనే రీచ్‌ల వద్దకు చేరాయి. ఇసుకను తవ్వి తెచ్చే పడవ యజమానులకు, కూలీలకు మధ్య చర్చలు విఫలం కావటంతో గురువారం ఇసుక రీచ్‌కు సెలవు ప్రకటించారు. అయితే రీచ్‌లో ఇసుకను సరఫరా నిరాటంకంగా జరిపేలా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మాత్రం పట్టించుకోలేదు.