పశ్చిమగోదావరి

ఎస్సీల సంక్షేమానికి రూ.29వేల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూలై 19: రాష్ట్రంలో గత నాలుగేళ్లలో ఎస్సీల సంక్షేమానికి సబ్‌ప్లాన్ ద్వారా 29వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనంద్‌బాబు చెప్పారు. దెందులూరు నియోజకవర్గం పరిధిలోని ఏలూరు మండలం జాలిపూడిలో గురువారం నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆనంద్‌బాబు మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం పలు సవాళ్లు, ఆర్ధికసంక్షోభం వంటి క్లిష్టపరిస్దితులు ఎదురైనా వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొని రాష్ట్రం నిలదొక్కుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని అన్ని దళితవాడల్లో సిసి రోడ్లు, ఇతర వౌలిక సదుపాయాలు పెద్దఎత్తున కల్పించామన్నారు. గత నాలుగేళ్లలో రాష్టవ్య్రాప్తంగా 18వేల కిలోమీటర్ల మేర సిమెంట్లు రోడ్లు నిర్మించగా అందులో దళితవాడల్లో 5500 కిలోమీటర్ల మేర సిసి రోడ్లు వేసిన ఘనత టిడిపి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో నూటికి 90శాతం మంది ప్రజలు ప్రభుత్వం ద్వారా ఏదొ ఒక లబ్ది పొందారన్నారు. చదువుకున్న పిల్లలు నిరుద్యోగులుగా ఉండకూడదన్న ఉద్దేశ్యంతో వారికి వృత్తి నైపుణ్య శిక్షణ అందించటంతోపాటు పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం పెద్దఎత్తున చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రపంచంలోనే గొప్పదైన రాజధాని నిర్మాణానికి ముఖ్యమంత్రి అహోరాత్రులు కష్టపడుతున్నారన్నారు. రాష్ట్రంలో అన్ని వనరులు దోచుకుని 12 ఛార్జిషీట్లు నమోదైన వ్యక్తి ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతూ ప్రజల కోసం కష్టపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆరోపణలు చేయటం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రిని విమర్శించే నైతిక హక్కు అతనికి లేదన్నారు. రాష్ట్భ్రావృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న ప్రతిపక్షనాయకుని నిజస్వరూపం ప్రతిఒక్కరూ తెలుసుకోవాలన్నారు. దెందులూరు నియోజకవర్గం పేరుచెపితేనే అభివృద్ధికి మారుపేరుగా రాష్ట్రంలో నిలుస్తుందని, దీనికి స్ధానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు ప్రజాసేవ మీద ఉన్న మక్కువే కారణమన్నారు. ఉపాధి హామీ పధకం అమలులో దెందులూరు దేశంలోనే ప్రధమస్ధానంలో నిలవడం ఆయన పనితనానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామదర్శిని కార్యక్రమం గ్రామవికాసానికి ఉపయోగపడుతుందన్నారు. ఎస్సీలకు ఇళ్ల నిర్మాణానికి రెండులక్షల రూపాయలు, బిసిలకు లక్షా 50వేల రూపాయలు సబ్సిడీగా అందిస్తూ ఆ కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న ఘనత టిడిపి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. నియోజకవర్గంలోని ఎస్సీ,బిసి వాడల్లో 90శాతం రోడ్లు వేశామన్నారు. జాలిపూడి గ్రామంలో వచ్చే శ్రావణమాసంలో భూమిపూజ చేసి అందరికి ఇళ్లు నిర్మిస్తామన్నారు. తొలుత జాలిపూడిలోని దళితవాడలో 30లక్షల రూపాయలతో నిర్మించనున్న వాటర్ ట్యాంకు నిర్మాణానికి మంత్రి నక్కా ఆనంద్‌బాబు శంకుస్ధాపన చేశారు. అనంతరం అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, మంచినీటి పైపులైన్ల పనులు ప్రారంభించారు. ఈసందర్భంగా పలువురు రైతులకు పంపుసెట్లను పంపిణి చేశారు. అనంతరం ఆశా కార్యకర్తలు మంత్రి ఆనంద్‌బాబు, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌లను ఘనంగా సత్కరించారు.
కారు డ్రైవ్ చేసిన మంత్రి
ఎన్‌ఎస్‌ఎఫ్‌డిసి కింద ఎస్సీ కార్పోరేషన్ మంజూరు చేసిన అయిదు ఇన్నోవా కార్లను మంత్రి నక్కా ఆనంద్‌బాబు, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ లబ్దిదారులకు అందజేశారు. ఈసందర్భంగా లబ్దిదారులను కారులో ఎక్కించుకున్న మంత్రి ఆనంద్‌బాబు స్వయంగా కొంతదూరం నడిపారు. కార్యక్రమంలో దెందులూరు ఎఎంసి ఛైర్మన్ మాగంటి సురేంధ్రనాధ్‌చౌదరి, గ్రామసర్పంచ్ దాసరి నాగమల్లేశ్వరి, ఎంపిపి లంకపల్లి మాణిక్యాలరావు, పి సుశీల, దేవరపల్లి బక్కయ్య, జడ్పీటీసీ ముమ్మిడి సక్కుకుమారి, ఎంపిటిసి కనక నాగలక్ష్మి, టిడిపి నేతలు దాసరి ఆంజనేయులు, నేతల రవి, అట్లూరి రమేష్, చుక్కా నాగేశ్వరరావు, పి సుబ్బారావు, కోనేరు సతీష్, మిల్లుబాబు, రవి, ఎస్సీ కార్పోరేషన్ ఇడి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ హయాంలోనే అభివృద్ధి
* ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్
తాళ్లపూడి, జూలై 19: టీడీపీ ప్రభుత్వ హయాంలో మునుపెన్నడూ జరగనంత అభివృద్ధిని సాధించామని, కొవ్వూరు నియోజకవర్గంలో రూ.1266 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్టు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ తెలిపారు. గ్రామ దర్శిని, గ్రామ వికాసం కార్యక్రమంలో భాగంగా మండలంలోని వేగేశ్వరపురం గురువారం వచ్చిన మంత్రి కొద్దిసేపు గ్రామస్థులతో మాట్లాడారు. అనంతరం గ్రామంలో పర్యిటించారు. ప్రధానంగా రైతులకు అవసరమైన ఎత్తిపోతల పథకం అభివృద్ధి, రహదారుల అభివృద్ధి వంటి ఎన్నో కార్యక్రమాలు వేగేశ్వరపురానికి సుమారు రూ.18 కోట్లతో పూర్తిచేసినట్టు చెప్పారు. గ్రామంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ మహిళలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎదురైన ఒక వికలాంగుడిని పలుకరించి పెన్షన్ అందుతోందా లేదా అని మంత్రి ప్రశ్నించారు. ఆయన పర్యటనలో పలువురు మహిళలు తమ ప్రాంతాల్లో మురుగునీరు పోయేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. వేగేశ్వరపురం కళాశాల ప్రాంగణంలో క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మంత్రితోపాటు నాయకులు జెవిఎస్ చౌదరి, టీడీపీ మండల శాఖ అధ్యక్షుడు ఎన్ హనుమంతురావు, జడ్పీటీసీ సభ్యురాలు కె మంగాభవాని, పలువురు నాయకులు పాల్గొన్నారు.

పాత నివేదికలతో మొక్కుబడిగా హాజరైతే ఎలా!
*విద్యాశాఖాధికారుల సమీక్షా సమావేశాలపై కలెక్టర్ భాస్కర్
ఏలూరు, జూలై 19: సమీక్షా సమావేశాలకు పాత నివేదికలతో మొక్కుబడిగా హాజరైతే ప్రగతి ఎలాసాధ్యమవుతుందని విద్యాశాఖాధికారులను జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ ప్రశ్నించారు. స్ధానిక కలెక్టరేట్‌లో గురువారం విద్యాశాఖ ప్రగతిపై ఆయన అధికారులతో సమీక్షిస్తూ విద్యాప్రగతిపై ప్రతివారం సమీక్షించుకుంటూ మంచి ఫలితాలు సాధించాలని లక్ష్యంగా వెళుతుంటే సమావేశాలకు గత సమావేశాల్లో చర్చించిన అంశాలనే తిరిగి నివేదించటం ఎంతమాత్రం మంచి పద్దతి కాదన్నారు. విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంటే కార్యక్రమాలను క్షేత్రస్ధాయిలో అమలుచేయటంలో అధికారుల్లో జవాబుదారీతనం కనపడటం లేదన్నారు. జిల్లాలో విద్యాభివృద్ధికి గుంటూరు జిల్లాలో ఖర్చు చేయకుండా మురిగిన నిధులను జిల్లాకు మళ్లిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసినా వాటి విషయంలో జిల్లా విద్యాశాఖాధికారులు ఏచర్యలు తీసుకోకపోవటం తగదన్నారు. ఈవిషయంలో డిఇఓ నిర్లక్ష్యం కనపడుతోందని, దీనిపై విద్యాశాఖ కమిషనర్‌కు లేఖ రాయనున్నట్లు తెలిపారు. ప్రతి పాఠశాలలో విద్యార్ధుల బోధనకు సంబంధించి డైరీలు ఏర్పాటుచేసి అందించేందుకు చర్యలు తీసుకోవాలని సర్వశిక్షాభియాన్ పిఓను ఆదేశించారు. మధ్యాహ్న భోజన పధకం నిర్వాహకులకు ప్రతినెల జాప్యం లేకుండా వేతనాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టరు ఆదేశించారు. సమావేశంలో డిఇఓ సివి రేణుక, సర్వశిక్షాభియాన్ పిఓ డాక్టరు బ్రహ్మనందరెడ్డి, డిఎఫ్‌ఓ రామకృష్ణ, డివైఇఓలు పాల్గొన్నారు.