పశ్చిమగోదావరి

మహనీయుల త్యాగాలకు సార్ధకత కలిగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఆగస్టు 14: భారతదేశ ప్రజలకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 77వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలను మంగళవారం చెప్పారు. నేటి స్వాతంత్య్ర సంబరం ఎందరో మహనీయులు, వీరుల త్యాగాల ఫలం. సమరయోధుల పోరాట పటిమతో మనకు స్వేచ్ఛా సాతంత్య్రాలు లభించాయి, జీవితాలను తృణప్రాయంగా భావించి తెల్లవారిపై పోరుసల్పిన ఎందరో విప్లవవీరుల ప్రాణ త్యాగాలు మన స్వాతంత్య్ర పోరాట చరిత్రలో ప్రతీ అధ్యాయంలో కనిపిస్తాయన్నారు. మహనీయుల త్యాగాలకు సార్ధకత కల్పించాల్సిన బాధ్యత భారతీయులందరి పైనా ఉందని తెలిపారు. శాసనకర్తల స్థానాల్లో ఉన్నవారు కొద్దిమంది క్షేమం కోసం కాదు.. సువిశాల భారతాన్ని మదిలో ఉంచుకుని కోట్ల మంది ప్రజల ప్రయోజనాలను కాపాడాలని వివరించారు. కానీ అందుకు భిన్నంగా వర్తమానం ఉందన్నారు. ఏడు దశాబ్దాలు పైబడిన మన స్వాతంత్య్ర భారతంలో అభివృద్ధి ఫలాలు అతి కొద్ది మందికే అందుతున్నాయి. ఆర్థికంగా బలమైన వారు మరింత బలపడుతుంటే, పేదవాడు మరింత పేదగా మారడాన్ని అభివృద్ధి అనగలమా అని ప్రశ్నించారు. కుల, మత ప్రాంత వివక్షలతో కునారిల్లే పరిస్థితులు సమాజానికి శ్రేయస్కరం కాదన్నారు. గాంధీజీ, భగత్‌సింగ్, ఆజాద్, అంబేద్కర్, ప్రకాశం పంతులు, అల్లూరి సీతారామరాజు లాంటి మహనీయులు అందించిన స్ఫూర్తిని మనందరం నరనరాన నింపుకోవాలన్నారు. పాలకుల కుటుంబాలు మాత్రమే వెలుగొందితే అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు, మా కుటుంబం, మా వాళ్ళు అనే కుత్సిత ధోరణితో పాలన చేసే వారి నుంచి మనం విముక్తులం కావాలని, అప్పుడే అట్టడుగు స్థాయి వరకూ సంక్షేమ ఫలాలు అందించగలం. అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని, ఇది మనందరి ఆకాంక్ష కావాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

ప్రాణసంకటంగా మారిన జాతీయ రహదారి
జీలుగుమిల్లి, ఆగస్టు 14: జీలుగుమిల్లిలో ఫారెస్ట్ చెక్‌పోస్టు వద్ద నుండి మెయిన్ సెంటర్ వరకు శిధిలమయిన రహదారి వాహనదారులకు ప్రాణసంకటంగా మారింది. ఎప్పుడు ఏ వాహనం గోతిలో పడి తిరగబడుతుందో తెలియక రహదారిపై వెళుతున్న పాదచారులు, ఇతర వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రహదారి మరింత ఛిద్రమై, భారీ గోతులు పడటంతో ఫారెస్ట్ చెక్‌పోస్టు వద్ద తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారిపై ఒకేచోట, వేర్వేరు సమయాల్లో రెండు ట్రాక్టర్లు బోల్తాపడ్డాయి. కూలీలతో జీలుగుమిల్లి నుండి ఆశ్వారావుపేట వైపు వెళుతున్న ట్రాక్టర్ మంగళవారం ఉదయం ఫారెస్ట్ చెక్‌పోస్టు వద్ద భారీ గోతిలో పడి అదుపు తప్పి ఎదురుగా వస్తున్న భద్రాచలం నుండి రాజమండ్రి వెళుతున్న ఆర్టీసి బస్‌పై పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌లో ఉన్న కూలీలు బస్ కింద పడడంతో, బస్ డ్రైవర్ అప్రమత్తతో బతికి బయటపడ్డారు. ఈ ప్రమాదం కారణంగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. స్థానికుల సహాయంతో పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. తిరిగి అంతలోనే అదే గోతిలో పామాయిల్ గెలల లోడుతో వెళుతున్న ట్రాక్టర్ బోల్తాపడటంతో స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ఆంధ్రప్రదేశ్‌తెలంగాణా సరిహద్దు నుండి జీలుగుమిల్లి వరకు జాతీయ రహదారి పూర్తిగా శిథిలమయినప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో స్థానికులు మండిపడుతున్నారు.