పశ్చిమగోదావరి

పోలవరం ప్రాజెక్టుకు వెళ్లే మార్గంలో వరదనీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, ఆగస్టు 17: గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రాజెక్టు వద్దకు వెళ్లే మార్గంలోని వంతెన సమీపంలో నీరు చేరింది. అలాగే కొత్తూరు కాజ్‌వేపై 9 అడుగుల ఎత్తున నీరు ప్రవహిస్తుండటంతో గిరిజన గ్రామాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే వివిధ జిల్లాల నుండి ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు రైతులతో వచ్చిన బస్సులను వెనక్కి మళ్లించారు. వర్షాలకు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన కాంక్రీట్ పనులు నెమ్మదించాయి. పోలవరం నుండి టేకూరు వెళ్లే ఆర్టీసీ సర్వీసును రద్దు చేశారు. స్పిల్ ఛానల్ నిర్మాణ ప్రాంతంలోకి గోదావరి వరద నీరు భారీగా వచ్చి చేరింది. మండలంలోని 19 గ్రామాల ప్రజలు ఏ అవసరాలున్నా పోలవరం రావల్సి ఉంటుంది. దాంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటూ రెవెన్యూ వారు ఏర్పాటు చేసిన పడవపై కాజ్‌వే దాటి ప్రయాణాలు సాగిస్తున్నారు. పోలవరం సిడబ్ల్యుసి వద్ద 13.5 మీటర్లుగా నీటిమట్టం నమోదైంది. వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
పోలవరం ప్రాజె క్టును సందర్శించిన డిఐజి
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని డిఐజి రవికుమార్‌మూర్తి శుక్రవారం సందర్శించారు. ముందుగా డిఐజి కాంట్రాక్టు ఏజెన్సీ కార్యాలయం వద్ద నుండి స్పిల్‌వే నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణంలో సిసి కెమెరాల పనితీరు గురించి డిఎస్పీ రవికుమార్ డిఐజికి వివరించారు. డిఐజి రవికుమార్‌మూర్తి గోదావరి వరదను టూరిజం పాయింట్ వద్ద పరిశీలించి, వరద ఇంకా పెరిగితే ఏయే గ్రామాలు ప్రభావితమవుతాయి, ఏమి చర్యలు తీసుకుంటున్నారని అధికారులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట సిఐ ఎం రమేష్‌బాబు, ఎస్‌ఐ కె శ్రీహరిరావు తదితరులు ఉన్నారు.