పశ్చిమగోదావరి

సంస్కరణవాది వాజపేయ: కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఆగస్టు 17: భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి గొప్ప దార్శనికుడు, సంస్కరణవాది అని జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ అన్నారు. స్ధానిక కలెక్టరేట్‌లో శుక్రవారం వాజ్‌పేయి చిత్రపటానికి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఆయన మృతికి రెండునిముషాలు పాటు వౌనం పాటించారు. అనంతరం కలెక్టరు భాస్కర్ మాట్లాడుతూ వాజ్‌పేయి ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉండేవారన్నారు. జీవితాంతం దేశానికి సేవ చేసిన అసాధారణమైన పాలనదక్షుడు అని పేర్కొన్నారు. ఆయన మృతి దేశానికి తీరనిలోటు అన్నారు. కార్యక్రమంలో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టరు ఆదిత్య ప్రవీణ్, డిఆర్వో ఎన్ సత్యనారాయణ, జడ్పీ సిఇఓ వి నాగార్జునసాగర్, గృహనిర్మాణసంస్ధ పిడి ఇ శ్రీనివాసరావు, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ అమరేశ్వరరావు, కలెక్టరేట్ ఎఓ సిహెచ్ రాజశేఖరరాయుడు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.

గోడ కూలి మహిళ మృతి
ఆకివీడు, ఆగస్టు 17: ఆకివీడులోని మార్కెట్ ప్రాంతం వద్ద శుక్రవారం తెల్లవారుఝామున గోడ కూలి పేరం పెద్దింట్లు (45) అనే మహిళ మృతిచెందింది. తెల్లవారుఝామున ఇంటి ముందు ముగ్గువేసిన పెద్దింట్లు ఇంటి వెనుక భాగానికి వెళ్లేసరికి సిమెంటు గోడ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో పెద్దింట్లు అక్కడికక్కడే మృతిచెందింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోడ నానిపోయి ఉండటంతో ఈ ప్రమాదం సంభవించిందని బంధువులు తెలిపారు. మృతురాలికి ముగ్గురు సంతానం. మృతురాలి భర్త రామకృష్ణప్రసాద్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మృతదేహం వద్ద బంధువుల రోదనలతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వీఆర్వోలు సత్యనారాయణ, రత్నరాజు సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు.