పశ్చిమగోదావరి

ద్వారకాతిరుమలలో వడ ప్రసాద విక్రయాల ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్వారకాతిరుమల, ఆగస్టు 17: శ్రీవారి దేవస్థానం నూతనంగా వడ ప్రసాద విక్రయాలను శుక్రవారం క్షేత్రంలో ప్రారంభించింది. 60 గ్రాముల బరువున్న వడ ధరను రూ.20లుగా ఆలయ అధికారులు నిర్ణయించారు. ముందుగా ఆలయ ఈవో దంతులూరి పెద్దిరాజు తూర్పు రాజగోపుర ప్రాంతంలోని ప్రసాదాల కౌంటర్లో ఈ వడ విక్రయాలను ప్రారంభించి, భక్తులకు ఆయనే స్వయంగా అందించారు. ట్రయల్ బేసిస్‌లో ముందుగా 104 వడలను మాత్రమే తయారు చేసి, విక్రయాలను జరిపింది. అవి మొత్తం అరగంట లోపే అమ్ముడయ్యాయి. వడ ప్రసాదం ఎంతో రుచిగా ఉందంటూ భక్తులు వాటిని కొనుగోలు చేసేందుకు బారులు దీరారు. దీంతో సిబ్బంది అప్పటికప్పుడు మళ్లీ వాటిని తయారు చేసి, భక్తులకు అందించారు. ఇలావుండగా శనివారం క్షేత్రానికి వచ్చే భక్తుల రద్దీ దృష్ట్యా వాటి తయారీని అధికంగా చేయాలని ఆలయ అధికారులు యోచిస్తున్నారు. తిరుమల తిరుపతిలో ఎప్పటి నుంచో వడ విక్రయాలు జరుగుతున్నాయని, అటువంటి రుచికరమైన ప్రసాదాన్ని చిన వెంకన్న భక్తులకు సైతం అందించాలన్న ఉద్దేశంతోనే వాటి విక్రయాలను ఇక్కడ ప్రారంభించినట్టు ఈవో పెద్దిరాజు తెలిపారు. ఇద్దరు వంట స్వాములను తిరుమల పంపి వడ తయారీలో ప్రత్యేక శిక్షణ ఇప్పించినట్టు ఆయన పేర్కొన్నారు.
వరద నీటిలో పంటచేలు
కుకునూరు, ఆగస్టు 17 : కుకునూరు మండలంలో గోదావరి వరద ఉధృతి పెరగడంతో శుక్రవారం నాటికి పంట పొలాల్లోకి వరదనీరు చేరి ముంపునకు గురయ్యాయి. వందలాది ఎకరాల్లో ప్రత్తి, వరి పొలాలు ముంపునకు గురయ్యాయి. శుక్రవారం సాయంత్రానికి గోదావరి వరదకు శబరి కూడా తోడవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పుడిప్పుడే ప్రత్తిపంట కోలుకుంటోందని అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరుగుతుండటంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. వరద ఉధృతి మరింత పెరిగితే ఇప్పుడిప్పుడే పూర్తయిన వరినాట్లు సైతం ముంపునకు గురవుతుందని, దీంతో పంట సర్వనాశనమవుతుందని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా కుకునూరు - దాచారం మధ్యలో వున్న లో లెవెల్ బ్రిడ్జి పూర్తిగా వరదముంపునకు గురికావడంతో ఈ గ్రామాల మధ్య రాకపోకలు నిలచిపోయాయి. దాచారం, సీతారాంపురం గ్రామ ప్రజలు మండల కేంద్రానికి రావాలంటే ఇబ్బంది నెలకొంది. ముత్యాలంపాడు బ్రిడ్జి సైతం వరదనీటిలో చిక్కుకోవడంతో కౌండిన్యముక్తి, ముత్యాలంపాడు గ్రామస్తులు మండల కేంద్రానికి రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద ఉధృతి మరింత పెరిగితే ఈ గ్రామాలు పూర్తిస్థాయిలో దిగ్బంధనంలో చిక్కుకుంటాయని చెబుతున్నారు. ఐటిడి ఏ పివో హరీంధ్రియ ప్రసాద్ కుకునూరులో అత్యావసరంగా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో ముంపు ప్రాంతాలకు కూడా ఆయన స్వయంగా వెళ్లి పరిస్థితిని అధ్యయనం చేశారు. గోదావరి ప్రాంతంలో చేపలు పట్టే వారు వరద ఉధృతికి పడవల్లో ఒడ్డుకుచేరుకుని అక్కడే వంటా వార్పు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక వరద ఉధృతి కారణంగా విషజ్వరాలు ప్రబలి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.