పశ్చిమగోదావరి

బ్యాంకు ఉద్యోగుల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, సెప్టెంబర్ 18 : బ్యాంక్ ఆఫ్ బరోడా, దేనా బ్యాంక్, విజయ బ్యాంక్‌లను విలీనం చేయడాన్ని నిరసిస్తూ బ్యాంకు ఉద్యోగులు స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడా వద్ద మంగళవారం సాయంత్రం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలూరు బ్యాంక్ ఉద్యోగుల సమన్వయ కమిటీ కార్యదర్శి కాలే శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రుణాలు ఎగకొట్టిన వారిపై చర్యలు తీసుకోకుండా, బ్యాంకు బ్రాంచ్‌లు పెంచాల్సి వుండగా విలీనం పేరుతో కుదించడం దారుణమన్నారు. ప్రజావసరాలను దృష్టిలో ఉంచుకుని బ్యాంకులను పెంచాల్సింది పోయి తగ్గించడం మోదీ ప్రభుత్వ నిరంకుశ చర్యగా అభివర్ణించారు. బ్యాంకుల విలీనాన్ని తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామన్నారు. ఎ ఐటియుసి నాయకులు బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బ్యాంకుల కుదింపు చర్యను తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో బ్యాంకు కో ఆర్డినేషన్ కమిటీ నాయకులు వి కిషోర్ కుమార్, ఆర్ ఎస్ వి ప్రసాద్, పి శ్రీనివాసరావు, మోహన్, కె రవితేజ, ఎస్ శ్రీనివాస్, ప్రియాంక, నిటాషా, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పాలనలో గృహాలు నిర్మాణం లేకుండానే సొమ్ము కాజేశారు
- విధాన సభలో ఎమ్మెల్సీ అంగర
పాలకొల్లు, సెప్టెంబర్ 18: గత కాంగ్రెస్ పాలనలో పేదలకు గృహాల నిర్మిస్తామని, దరఖాస్తులు తీసుకుని, 14.5 లక్షలు గృహాలను నిర్మించినట్లు రికార్డులు సృష్టించారని, దీనివల్ల రూ.4,150 కోట్లు దళారులు తినేశారని విధాన మండలిలో ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ పేర్కొన్నారు. అయితే లబ్ధిదారులకు మాత్రం గృహాలు అందలేదన్నారు. ప్రస్తుతం దరఖాస్తు చేసుకుంటే గతంలో లబ్ధిపొందినట్లు రికార్డు చూపి, చేయని నేరానికి లబ్ధిదారులు శిక్ష అనుభవిస్తున్నారని చెప్పారు. సమగ్ర సర్వే నిర్వహించి అర్హులైన నిరుపేదలకు గృహాలు మంజూరు చేయాలని కోరారు.

అర్హుల జాబితా ప్రకటించిన తరువాతే
గ్రామసభలు జరపండి
కుకునూరు, సెప్టెంబర్ 18 : పోలవరం పునరావాస ఇళ్లపై అవగాహనా సదస్సు అంటూ చేపట్టిన గ్రామ సభలను ప్రజలు తిరస్కరించారు. నిర్వాసితుల జాబితా ప్రకటించకుండానే ఇళ్ల నిర్మాణాలపై అవగాహనా సదస్సుల పేరిట ఉమ్మడి ఇళ్లు దరఖాస్తులు ఏ విధంగా తీసుకుంటారంటూ అధికారులను నిలదీశారు. ఒకే ఇంటిలో ఎంతమందికి వచ్చిందన్నదే పూర్తి సమాచారం లేకుండా ఉమ్మడి దరఖాస్తులు ఏ విధంగా పెట్టుకోవాలని ప్రశ్నించారు. మండల పరిధిలో 15 పంచాయితీల్లో పెట్టిన గ్రామ సభల్లో ప్రజలందరూ ముక్తకంఠంతో ఈ విధంగా ప్రశ్నిస్తూ గ్రామసభలను బహిష్కరించారు. నిర్వాసితుల జాబితా ప్రకటించిన తరువాతే గ్రామ సభలు పెట్టాలని డిమాండ్ చేశారు. అధికారులు తక్షణమే ఈ విషయమై స్పందించి నిర్వాసితుల జాబితాలను ఆయా పంచాయితీల్లో ప్రకటించాలన్నారు. దీనితో గ్రామసభల నిర్వహణకు వచ్చిన అధికారులు వెనుతిరగాల్సి వచ్చింది.

బస్సు నుండి పొగలు... ప్రయాణికులు పరుగులు
చాగల్లు, సెప్టెంబర్ 18: ప్రయాణీకులతో వెడుతున్న బస్సు నుండి ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణీకులు బస్సు దిగి పరుగులు తీశారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా వున్నాయి. మంగళవారం సాయంత్రం నిడదవోలు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నిడదవోలు నుండి పోలవరం బయలుదేరింది. అయితే బస్సు చాగల్లులోని కాకతీయ కల్యాణ మండపం సమీపానికి వచ్చేసరికి బస్సులో నుండి పొగలు రావడం మొదలైంది. దీంతో ప్రయాణీకులు బెంబేలెత్తిపోయారు. నిడదవోలు కంటి ఆసుపత్రి నుండి వస్తున్న వృద్ధులు, విద్యార్థులు ఈ బస్సులో ప్రయాణిస్తున్నారు. వీరంతా బస్సు దిగి పరుగులు తీశారు. నిడదవోలు డిపో బస్సుల్లో ప్రయాణించటం భయంగా ఉందని, డిపో మేనేజరు ఇప్పటికైనా కొత్త బస్సులు వేసి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రయాణీకులు కోరుతున్నారు.