పశ్చిమగోదావరి

30న ఏలూరులో నంది నాటకోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, సెప్టెంబర్ 18 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున 21వ నంది నాటక బహుమతులు- 2017 ప్రదానోత్సవం ఈ నెల 30వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఏలూరులోని శ్రీ కనె్వన్షన్ హాల్‌లో నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర టెలివిజన్, నాటక రంగ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ అంబికా కృష్ణ తెలియజేశారు. స్థానికంగా మంగళవారం సాయంత్రం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర చలన చిత్ర, టివి, నాటక రంగ అభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్న ఈ నంది నాటక బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏలూరు నగరానికి వనె్నతెచ్చే విధంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 2017 సంవత్సరానికి గాను నంది నాటక పోటీలు 5 విభాగాలైన పద్యనాటికలు, సాంఘిక నాటికలు, బాలల నాటికలు, కళాశాల విశ్వవిద్యాలయాల విద్యార్దుల నాటికలు తెనాలి, రాజమహేంద్రవరం, కాకినాడ, కర్నూలు, నంద్యాలలో నిర్వహించినట్లు చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీ నుండి ఏప్రిల్ 18వ తేదీ వరకు 360 నాటికల ప్రదర్శనలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ పోటీల్లో ఎంపికైన నాటక నాటికలను పరిశీలించి 72 నంది నాటక బహుమతులను ఎంపిక చేయడం జరిగిందని చెప్పారు. దీనితో పాటు 2017 సంవత్సరానికి గాను రాష్టస్థ్రాయి నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారాన్ని, 2018 సంవత్సరానికి గాను రాష్టస్థ్రాయి, జిల్లా స్థాయి కందుకూరి పురస్కారాలను కూడా ప్రదానం చేయడం జరుగుతుందన్నారు. ఈ ప్రదానోత్సవంలో సుమారు 300 మంది కళాకారులు, సాంకేతిక నిపుణులు బహుమతులు అందుకోనున్నారని ఆయన చెప్పారు. నంది నాటక పోటీల్లో ఎంపికైన ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతి గ్రహీతలకు, కందుకూరి పురస్కార గ్రహీతలకు సుమారు 25 లక్షల రూపాయలను నగదు పారితోషకంగా అందించడం జరుగుతుందని చెప్పారు.

చిన్న సినిమాలు తీసే వారికి ప్రోత్సాహం:
-----------------------------------------------
రాష్ట్రంలో 4 కోట్ల రూపాయలు మించకుండా బడ్జెట్‌తో తీసే చిన్న తరహా సినిమాలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించనున్నదని అంబికా కృష్ణ చెప్పారు. చిన్న సినిమాలు ద్వారా ఉపాధి కల్పించడమే ధ్యేయంగా అందుకు సంబంధించిన విధి విధానాలతో ఒక జీవోను తీసుకురావడం జరిగిందని చెప్పారు. సినిమా టైటిల్స్ కూడా తెలుగులోనే ఉండి, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు అద్ధం పట్టే విధంగా సినిమాలు రూపొందించాల్సి వుంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే సినిమాలు తీయాల్సి వుంటుందని సినిమాకు సంబంధించి ఇతర రాష్ట్రాలలో ఒక్క షాట్ తీసినా సరే ప్రభుత్వం అందించే రాయితీలు వర్తించబోవని స్పష్టం చేశారు. సినిమాలు రూపొందించే సందర్భంలో చెల్లించే రాష్ట్ర పరిధిలో ఉన్న జి ఎస్‌టిని కూడా పూర్తిగా తిరిగి చెల్లించడం జరుగుతుందన్నారు. నిబంధనల ప్రకారం రూపొందించిన సంస్కృతి, సాంప్రదాయాలకు అనుగుణంగా ఉన్న 15 సినిమాలను ఎంపిక చేసి ఒక్కొక్క సినిమాకు 10 లక్షలు చొప్పున మొత్తం కోటీ 50 లక్షల బహుమతులు నగదు రూపేణా చెల్లించడం జరుగుతుందన్నారు. సినిమా పరిశ్రమకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రెండు కళ్లు అని కళాకారులను ప్రోత్సహించేందుకు ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున కల్పించేందుకు చిన్న తరహా సినిమాలు తీసే ప్రతీ ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలుకుతోందని చెప్పారు. ఫిల్మ్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ శేషసాయి మాట్లాడుతూ నంది అవార్డులకు విచ్చేస్తున్న ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. భోజనం, వసతి కల్పించడంతోపాటు కళాకారులచే వివిధ సాంస్కృతిక ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. సమాచార శాఖ సహాయ సంచాలకులు కె సుభాషిణి మాట్లాడుతూ నంది నాటకోత్సవ బహుమతి ప్రదానోత్సవం ఏలూరులో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం సంతోషదాయకమని, ఏలూరు నగరానికి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజర్ శ్రీనివాసరావు, డిప్యూటీ మేనేజర్ శ్రీనివాసనాయక్ తదితరులు పాల్గొన్నారు.