పశ్చిమగోదావరి

చివరకేం మిగులుతుందో...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, సెప్టెంబర్ 20 : కొద్దిరోజుల క్రితం జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల నేపధ్యంలో వెల్లువెత్తిన వరద కారణంగా దాదాపుగా జిల్లా అంతటా పంటలన్నీ దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో రైతాంగం తీవ్ర నిరాశలో మిగిలిపోయారు. అయితే ఇటీవల జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నష్టపోయిన రైతులను పూర్తిస్థాయిలో ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో రైతుల్లో కొంత ఆశలు చిగురించాయి. దాదాపుగా వారం పది రోజులకు పైగా ఏకదాటిగా వర్షాలు కురవడం, మరోవైపు వరదలకారణంగా ఎర్రకాలువ పొంగి పొర్లడం వంటి పరిణామాల నేపధ్యంలో డెల్టా, మెట్ట అన్న తేడా లేకుండా అన్ని చోట్ల వ్యవసాయ రంగం తీవ్ర స్థాయిలో దెబ్బతింది. వరిపంట పూర్తి స్థాయిలో ప్రభావితమైంది. దీనితోపాటు వాణిజ్య పంటలు కూడా తీవ్ర నష్టాల పాలయ్యాయి. ఈ పరిస్థితులతో రైతాంగం ఈ సీజన్ పంట వదులుకోవాల్సిందేనన్న ఆందోళనలతో ఉండిపోయారు. అయితే స్వయంగా ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చినప్పుడు నష్టపోయిన రైతులను ఖచ్చితంగా ఆదుకుంటామని భరోసా ఇవ్వడంతోపాటు అధికారులకు ఆ మేరకు ఆదేశాలు జారీ చేయడంతో రైతులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. అయితే నష్టాల అంచనాలు మొదలు పెట్టినప్పుడే అసలు వాస్తవమేమిటో అందరికీ అర్ధమైపోయింది. అసలు నష్టాల అంచనాల జాబితాలోకే ఎక్కలేని పరిస్థితుల్లో అధిక శాతం మంది రైతాంగం ఉండిపోతే ఇక పరిహారం ఎంత మందికి దక్కుతుందోనన్నది ప్రశ్నార్ధకంగా మారిపోయింది. ప్రాధమిక అంచనాల ప్రకారం జిల్లా వ్యాప్తంగా 27 వేల హెక్టార్లలో పంట దెబ్బతిన్నట్లు గుర్తించినా చివరకు వాస్తవ అంచనాల దగ్గరకు వచ్చే సరికి ఈ మొత్తం భారీగా తగ్గిపోయి కేవలం 14 వేల హెక్టార్లకు పరిమితమైంది. అయితే ఈ అంచనాల ప్రక్రియ ముందుకు వెళుతున్న కొద్దీ ఎంత మేరకు ఈ దెబ్బతిన్న విస్తీర్ణం తగ్గిపోతుందా అన్న ఆందోళన రైతాంగంలో వ్యక్తమవుతోంది. ఇటీవల కురిసిన వర్షాలు, వచ్చిన వరదలకు జిల్లాలో దెబ్బతిన్న పంట నష్టపోని రైతు ఉండే అవకాశాలు చాలా కష్టమనే చెప్పాలి. ఆ పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో పంటలు నష్టపోయిన పరిస్థితే వున్నప్పటికీ అంచనాల్లో మాత్రం అవన్నీ పరిగణనలోకి తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు నోషనల్ నెంబర్ల పేరుతో రైతుల నోట మట్టి కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు కూడా లేకపోలేదు. భీమా పరిహారం రైతాంగానికి అందే విషయంలో ఈ నోషనల్ నెంబర్లే కీలకంగా నిలుస్తున్న పరిస్థితుల్లో ఆయా ప్రాంతాల్లో పరిగణనలోకి తీసుకున్న నెంబర్ల పరిధిలో వరదల నష్టం అంతగా లేకపోతే ఆ ఫలితం గ్రామంలోని రైతులందరిపై పడే అవకాశం వున్నప్పటికీ ఆ అంశాన్ని పట్టించుకోకుండా అధికారులు తమ మానాన తాము జాబితా రూపొందించుకుంటూ వెళ్లిపోతున్నారని చాలా చోట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక జిల్లాకు సంబందించి చూస్తే కౌలు రైతుల శాతం భారీగానే వుంటుందనడంలో సందేహం లేదు. ఒక దశలో దాదాపు రెండు లక్షల మందికి పైగా కౌలు రైతులు వుంటారని అప్పట్లో వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కాగా ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన ఎల్ ఇసి కార్డుల అమలులో గోదావరి జిల్లాలు కీలకంగానే నిలుస్తూ వచ్చాయి. అయితే పశ్చిమలో మాత్రం కౌలురైతులకు ఎప్పటికప్పుడు అన్యాయం జరుగుతూనే వస్తోంది. ఈసారి కూడా దాదాపుగ అదే పరిస్థితి కనిపిస్తోందని చెప్పక తప్పదు. జిల్లాలో సాగులో వున్న కౌలు రైతులకు సంబంధించి ఎల్ ఇసి కార్డుల జారీ విధానం కనీసం సంతృప్తికరంగా కూడా ముందుకు సాగకపోవడంతో నష్టాల అంచనాల జాబితాలు రూపొందే విషయంలో కౌలు రైతులు పూర్తి అన్యాయానికి గురవుతున్నారని, సంఘాల ఇప్పటికే విమర్శల వర్షం మొదలుపెట్టాయి. కార్డులు లేనందున క్షేత్రస్థాయిలో ఎన్యూమరేషన్ ప్రక్రియ ముందుకు సాగుతున్నా ఫలానా సర్వే నెంబర్‌కు సంబంధించి సాగులో వున్నది కౌలు రైతు అన్న అంశాన్ని అధికారులు రికార్డుల్లో పేర్కొనలేని పరిస్థితి నెలకొంది. దీనితో యధాప్రకారంగా భూ యజమానుల పేర్లే జాబితాలో చోటుచేసుకుంటున్నాయి. చివరకు కౌలు రైతులకు ఈసారి కూడా దాదాపు మొండిచేయే మిగులుతుందన్న అభిప్రాయమే వ్యక్తమవుతోంది. దీనికి మించి ప్రాధమిక అంచనాల్లో నష్టాల శాతం భారీగా కనిపించగా వాస్తవంగా క్షేత్రస్థాయి ఎన్యూమరేషన్ ప్రారంభమయ్యే సరికే ఈ భారీ శాతం గణనీయంగా కుదించుకుపోయినట్లు కనిపిస్తోంది. ఇక ఈ ఎన్యూమరేషన్ నిబంధనల మధ్య దెబ్బతిన్న విస్తీర్ణం ఇంకెంత తగ్గిపోతుందోనన్న ఆందోళన ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతోంది.

గోదావరిలో వ్యక్తి గల్లంతు
కొవ్వూరు, సెప్టెంబర్ 20: కొవ్వూరు శ్రీకృష్ణ చైతన్య స్నాన ఘట్టంలో గోదావరి నదిలో గురువారం ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు పడి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పట్టణ ఎస్సై పవన్‌కుమార్, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. గోదావరి నదిలో గల్లంతైన వ్యక్తి వివరాలు తెలియరాలేదు.